📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Successor to the business:వ్యాపార వారసుడు

Author Icon By Hema
Updated: July 28, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

successor to the business:ప్రశాంత్ తన ముగ్గురు కుమారులకు వ్యాపారం అప్పజెప్పాలని భావించాడు. వారిలో వ్యాపార లౌక్యం ఎంతవరకు ఉందోనని పరీక్షంచాలనుకున్నాడు.

ప్రశాంత్ వద్ద అయిదు తరాల నుండి సంక్రమించిన అతి విలువైన వస్తువులు ఉన్నాయి. ఒకరోజు తన ముగ్గురు కుమారుల్ని పిలిచి ఆ వస్తువులను వాళ్లకు చూపించాడు. “కుమారులారా! ఇవి మన వంశానికి అయిదు తరాలుగా సంక్రమించిన ప్రాచీన వస్తువులు.

వీటిలో పురాతన నాణేలు, గడియారాలు ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని తీసుకుని వెళ్లి అధిక ధరలకు అమ్మండి” అని తండ్రి కుమారులను కోరాడు. “ఇంత పాత వస్తువులను ఎవరు కొంటారు నాన్నా? పైగా వీటికి అధిక ధర ఎలా వస్తుంది?” అంటూ మొదటి కుమారుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

రెండవ కుమారుడు కూడా పెద్దవాడి బాటలోనే నడుస్తూ- “ఈ వస్తువులు ఎందుకూ పనికిరావు” అని చెప్పి వెళ్లిపోయాడు. మూడవ కుమారుడు అన్వేష్ మాత్రం పాత నాణేలు, గడియారాలను తీసుకున్నాడు. “నాన్నగారూ! వీటిని అమ్మడానికి నాకు కొంత సమయం ఇవ్వండి.

పాత నాణేలు, గడియారాలను అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తాను” అని చెప్పి వాటిని తీసుకుని పెద్ద నగరాలకు బయలుదేరాడు.

కొంత కాలం తరువాత చిన్న కుమారుడు అన్వేష్ పెద్ద మొత్తంలో ధరతో తిరిగి వచ్చి తండ్రిని కలిశాడు. “నాన్నగారూ! మీరు కోరుకున్నట్లే మీరిచ్చిన వస్తువులను అధిక ధరకు అమ్మి సొమ్ము చేశాను” అని చెప్పాడు.

“వీటిని అధిక ధరలకు ఎలా అమ్మగలిగావు అన్వేష్” అని తండ్రి ప్రశాంత్ ప్రశ్నించాడు. “వీటిని తీసుకుని ముందుగా పాత సామానులవారి వద్దకు వెళ్లాను.

వారు వీటి విలువను వందల్లోనే కట్టారు. ఆ తరువాత చరిత్రకారుల వద్దకు వెళ్లాను. వారు వీటి ధరను వేలల్లో చెల్లించడానికి అంగీకరించారు. చివరిగా ఈ ప్రాచీన వస్తువులను తీసుకుని పురావస్తు శాఖలో అనుభవజ్ఞుల వద్దకు వెళ్లాను.

వారు వీటి విలువను అంచనా వేసి లక్షల్లో చెల్లించారు’ అని చెప్పాడు మూడవ కుమారుడు అన్వేష్.

అంతలో ఒక వ్యక్తి అన్వేష్ అమ్మిన వస్తువులను తెచ్చి ప్రశాంత్ ముందు ఉంచాడు. వాటిని చూసి అన్వేష్ ఆశ్చర్యపోయాడు. “నాయనా అన్వేష్

మన పాత వస్తువులను అమ్ముకోవలసిన అవసరం నాకు లేదు. అందుకే నువ్వు అమ్మిన చోటు నుండి డబ్బు చెల్లించి తిరిగి తెప్పించాను. నేను మీ ముగ్గుర్ని పరీక్షించాను. అందులో నువ్వు నెగ్గావు. ఇకపై నువ్వు నా వ్యాపార వారసుడివి. పెద్దవారిద్దరినీ వేరే రంగాలలో స్థిరపడేలా చూస్తాను” అని చెప్పాడు ప్రశాంత్.

Read also: hindi.vaartha.com

Read also: Mother’s World: తల్లి ప్రపంచం

antique selling business heir family values moral story telugu story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.