నాయనా ముందే చెబుతున్నా చీట్లు చివరిదాకా పాడటానికి వీలు లేదు ఇది నా నిబంధన’ అన్నాడు రంగనాథం. అలాగే నమ్మకం కొరకు నేను తన వద్ద రెండు చీట్లు వేస్తున్నట్లు పత్రం రాసి ఇవ్వండి’ అన్నాడు లక్ష్మణుడు. “నేను చదువుకోలేదు అడుగో రచ్చబండపై చలమయ్య ఉన్నాడు.. అతనిచే రాయించుకురా వేలిముద్రవేస్తాను’ అన్నాడు. రంగనాధం. పత్ర రాస్తున్న చలమయ్య ‘రంగునాథం అన్నా రెండు చీట్లే కదా?’ అన్నాడు. ‘ఔను రెండు చీట్లే’ అన్నాడు రంగనాధం.
పత్రంపైన వేలిముద్ర వేసాడు రంగనాథం. అలా ప్రతి మాసం పూర్ణయ్యగారికి, రంగనాథంగారికి కాయగూరలు క్రమం తప్పకుండా సంవత్సరకాలం అందించాడు. లక్ష్మణుడు. ఒకరోజు రంగనాథం ఇంటిముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. రంగనాథంతో, లక్ష్మణుడు తగాదా పడుతున్నాడు. ‘నువ్వు నావద్ద పదివేల రూపాయల చీటి ఒకటి, వేయి రూపాయల చీటి ఒకటి వేసి ఇప్పుడు రెండూ పదివేల రూపాయల చీట్లు అంటావేమిటి? పదివేల రూపాయల చీటికి లక్షాఇరవైవేలు, వేయి రూపాయల చీటికి వన్నెండు.
వేలుకదా నీకు రావలసింది’ అన్నాడు ఆవేశంగా రంగనాథం. ‘అన్యాయం ప్రతిమాసం రెండు పదివేల రూపాయల చీట్లుకుగాను ఇరవై వేలరూపాయలు, కాయగూరలు, మీకు ఇచ్చివెళ్లాను’ అన్నాడు. లక్ష్మణుడు. అక్కడ ఉన్న జనంలో కొందరు ‘అబ్బాయి అందుకు సాక్ష్యం ఉందా’ అన్నారు. ‘రంగనాథం గారు నాకు రాసి ఇచ్చిన పత్రం ‘ఇదిగో అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు తెలివిగా రెండు బీట్లు పదివేల రూపాయలనని పత్రం రాయించుకొని తనను మోసం చేసాను అనుకున్న రంగనాథం, వేరే దారిలేక అందరి ముందు లక్ష్మణుడికి ధనం ఇచ్చి వంపుతూ, చదువురాని వాళ్లని ఇంతకాలం తను మోసం చేస్తూ వచ్చాడు.
నేను ఆదే చదువు రానితనం వలన తను మోసపోయాను విద్య విలువైనది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తన చదువుకు కొద్దిగ డబ్బు ఇచ్చిన రంగనాథం, చదువులేని తండ్రిని వేలిముద్రలు వేయించుకుని తమ పొలం స్వాధీన పరచుకున్నందుకు ఈవిధంగా గుణపాఠం చెప్పాడు లక్ష్మణుడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: