Useless Wealth:ఒకప్పుడు, కోటీశ్వరుడైన ఓ పిసినారి ఉండేవాడు. తన సంపదను పెంచుకోవడమే తప్ప ఎవరికీ పైసా కూడా దానం చేసేవాడు కాదు. ఒకసారి అతడు ఒక ముఖ్యమైన పని నిమిత్తం రైల్లో ప్రయాణించవలసి వచ్చింది. అప్పుడు అతని సూట్కేస్ (Suitcase) నిండా కట్టలకొద్దీ డబ్బుంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రైలు పట్టాలపై నీరు ఉప్పొంగి, అతడు ప్రయాణించే రైలు ఆగిపోయింది.
నాలుగు రోజుల అక్కరకు పాటు వర్షం తెరిపివ్వకపోవడంతో ప్రయాణికులందరూ ఆకలితో అలమటించారు. కోట్లాది రూపాయలున్నా, పిసినారి ధనవంతుడికి ఒక్క మెతుకు కూడా దొరకలేదు. చివరికి వర్షం తగ్గగానే, దూరంగా పొగ కనిపించడంతో ఆకలితో ఉన్న వారందరికీ ఆశ చిగురించింది. పిసినారి ధనవంతుడు (rich man) తనకున్న కొద్దిపాటి బలంతో, సూట్కేసన్ను పట్టుకుని, నడుము లోతు నీటిలో నడుచుకుంటూ ఆ పొగ వస్తున్న చోటుకు చేరుకున్నాడు. అక్కడ ఒక వృద్ధ బిచ్చగత్తె గంజి కాచుకోవడం చూసి “అమ్మా, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి.
నా ఆకలి తీర్చడానికి ఒక్క గంటెడు గంజి ఇవ్వు, ఈ డబ్బు మొత్తంనీకు ఇస్తాను” అని దీనంగా వేడుకున్నాడు. ఆమె జాలిపడి “నాయనా, నీ ఆకలి తీర్చలేని ఈ డబ్బు నాకెందుకు? నీకు ఈ గంజి చాలా అవసరం” అని ప్రేమగా గంజి నింపిన పాత్రను అందించింది. బిగి ఇచ్చిన గంజి తాగిన తర్వాత ఆ ధనవంతుడికి జ్ఞానోదయం కలిగింది.
కోట్లు ఉన్నా ఆకలి తీరదని, కానీ ఆ బిచ్చగత్తె ఇచ్చిన ఒక గిన్నె గంజి ప్రాణం నిలబెట్టిందని గ్రహించాడు. నిజమైన సంపద దానం చేయడంలోనే ఉంది.. అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతని మనసు మారిపోయింది.
తన పిసినారితనాన్ని విడిచిపెట్టి, తన సంపద మొత్తాన్ని పేదలకు, అనాథలకు దానం చేశాడు. దానధర్మాలు చేస్తూ, మానవత్వ విలువలను గ్రహించి, నిజమైన ఆనందాన్ని పొందసాగాడు.
Read also:hindi.vaartha.com
Read also: