📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Unity is Strength:ఐకమత్యమే మహా బలం

Author Icon By Hema
Updated: August 5, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Unity is Strength:ఒక అడవిలో ఒక మడుగు ఉండేది. ఆ మడుగులో ఒక మొసలి, ఒక తాబేలు, ఒక ఎండ్రకాయతో పాటు అనేక కప్పలు, చేపలు కలసి జీవించేవి. అవి అన్నీ ఎంతో అన్యోన్యంగా కలసి మెలసి ఉండేవి.

ఇలా ఉండగా ఒకనాడు చేపలను తినటంకోసం ఒక కొంగ అక్కడికి వచ్చింది. ఆ కొంగను చూసిన చేపలు ఆ సంగతిని తమ మిత్రులైన మొసలి,(crocodile) తాబేలు, ఎండ్రకాయకు చెప్పాయి. అప్పుడు మొసలి “దాని సంగతి నేను చెబుతాను ఉండండి. అది నీటిలోనికి దిగిన తర్వాత దాన్ని లాగి చంపేస్తాను” అని అంది. వెంటనే ఎండ్రకాయ “ఈ చిన్న పనికి నీవు ఎందుకు? నేను లేనా? దాని మెడను పట్టుకొని ఆ మెడను నా కొండతో కత్తిరిస్తాను” అని అంది. అప్పుడు మొసలి సరేనంది.

కొంగ చేపల (fish) కోసం మడుగులో అడుగులు వేసింది. వెంటనే ఎండ్రకాయ గట్టిగా దాని మెడను పట్టింది. ఆ కొంగకు ఊపిరి తీసుకోవడమే కష్టమైంది. ఇంతలో చేపలు భయంగా అటూ, ఇటూ ఎండ్రకాయను తోసుకుంటూ వెళ్లడం వల్ల దాని పట్టు జారింది. వెంటనే కొంగ పైకి ఎగిరి ‘బతుకుజీవుడా’ అనుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడు చేపలతో పాటు మిగిలినవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి.

మరికొద్ది రోజులకు ఒక నక్క అక్కడికి వచ్చింది. అది ఆహారం కోసం నీటిలో దిగింది. అది గమనించిన తాబేలు అన్నింటినీ తప్పించుకొమ్మని హెచ్చరించింది. తాబేలు మొసలితో ఆ నక్క పట్టు పట్టమని చెప్పింది. మొసలి సరేనని వెంటనే నీటిలోకి దిగిన ఆ నక్క కాలును గట్టిగా నోటితో పట్టుకుంది.

ఆ బాధకు నక్క అరవసాగింది. దానికి అందులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అప్పుడే మొసలి వద్ద నుండి కప్పలు, చేపలు పరుగు దీయడంతో మొసలికి చక్కలిగింతలు పెట్టినట్లు అనిపించి నోటిని వదులుగా చేసి నవ్వింది. వెంటనే నక్క ఇదే సమయమని తన కాలును లాక్కొని పారిపోయింది. అది చూసి మిత్రులన్నీ నవ్వాయి.

స్నేహితులు తన పట్టు జారిందని చూసి నవ్వాయనుకున్న మొసలి కోపించి చేపలు, కప్పలు తనకు చక్కలిగింతలు పెట్టాయని, లేకపోతే దాన్ని ఈపాటికే చంపేసేదానినని తెలిపింది. తాబేలు దానిని ఊరడించి చేపలు, కప్పలను మందలించింది. దాంతో మొసలి కోపం చల్లారింది.

మరికొన్ని రోజులకు అక్కడకు వీటిలో దేనినైనా తినాలనిఒక తో వచ్చింది. ఆ నీటిలో దిగిన తోడేలు తాబేలు వద్దకు వెళ్లింది. తోడేలు దానిని పెద్ద చేప అనుకొని గట్టిగా దాని డిప్పను కొరికింది. అది దానికి మింగుడు పడలేదు. వెంటనే మొసలి రాకను గమనించి భయపడిన తోడేలు తాబేలును వదలి అక్కడి నుండి పారిపోయింది.

ఆ తర్వాత మరికొన్ని రోజులకు ఒక పాము కప్పల కోసం వచ్చింది. అది నీటిలోకి దిగగానే దానిని చంపటానికి మొసలి వచ్చింది. కానీ ఆ పాము మొసలి తలకు గట్టిగా చుట్టుకుంది. దంతో ఆ మొసలికి శ్వాస ఆడలేదు. అక్కడే ఉన్న ఎండ్రకాయ పాము కంఠాన్ని ఒక్క ఉదుటున ఎగిరి పట్టుకుంది. వెంటనే పాము మొసలిని వదిలిపెట్టి ఎండ్రకాయతో పెనుగులాడుతూ ఆ మడుగు ఒడ్డు వైపుకు తీసుకొని వెళ్లింది. ఎండ్రకాయ దానిని ఇంకా గట్టిగా పట్టి నొక్కింది.

ఆ పాముకు శ్వాస తీసుకోవడమే కష్టమైంది. అది ఎండ్రి బారి నుండి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. చివరకు ఎలాగో ఆ పాము ఒడ్డుకు చేరగానే ఎండ్రి దానిని వదిలిపెట్టింది. పాము చెంగున ఒడ్డుపైకి దూకింది. ఎండ్రకాయ నీటిలోకి వెళ్లింది. పాము కూడా పారిపోయింది. మిత్రులందరూ ఆ పాము పారిపోతుంటే దానిని చూసి నవ్వాయి. కప్పలు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాయి.

అవి అన్నీ సమిష్టిగా పోరాడి శత్రువులను పారదోలాయి. మళ్లీ కొంగ, నక్క, తోడేలు, పాము ఆ మడుగు ఛాయల వద్దకే రాలేదు.

“మనం ఇకముందు కూడా ఐకమత్యంగా కలిసి పోరాడితే ఎంతటి శత్రువునైనా జయించవచ్చు” అని అవి అన్నీ సమిష్టిగా నిశ్చయించుకున్నాయి. అదే విధంగా చివరి వరకు మంచి మిత్రులుగా కొనసాగి ఆ మడుగులోకి శత్రువులను రాకుండా చేశాయి.

అంతేకాదు… శత్రువులను బెదరగొట్టాయి తప్ప వాటి ప్రాణాలను తీయలేదు. అక్కడి నుండి పారిపోయిన తమ తమ శత్రువులన్నీ ఈ మడుగు లోకి వెళ్లవద్దని, మనం ఐకమత్యంగా ఉన్నామని అవి తమ మిత్రులకు చెబుతాయని వాటికి తెలుసు. అందువల్ల ఇతర కొంగలు, నక్కలు, తోడేళ్లు, పాములుగానీ, మరి ఏ ఇతర శత్రువులు కానీ ఆ మడుగు ఛాయలకు మళ్లీ రాలేదు.

అందుకే ‘ఐకమత్యమే మహా బలం’ అన్నారు పెద్దలు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/giraffe-pride-and-camel-race-story/kids-stories/525861/

animal story children story moral story Togetherness unity

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.