📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Unity:ఐక్యంగా ఉంటాం

Author Icon By Hema
Updated: August 1, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Unity: కోసల దేశాన్ని మణివర్మ పాలిస్తున్నాడు. అంతవరకు తమ వారసులు పాలించేవారు.
మణివరుకు అంతా కూతుళ్లే జన్మించారు.కుమారుడి కోసం చూసి, చూసి ఆరుమంది.
కూతుళ్లను కన్నాడు. దురదృష్టం చివరి కూతురు పుట్టగానే రత్నప్రభ మహారాణి కన్నుమూసింది.
పిల్లలు అందరూ యుక్తవయసుకు వచ్చారు.

రాజుకు వయోభారం మీద పడింది. అందరికీ వివాహాలు (marriages) చేసి సమర్థుడైన అల్లుడికి రాజ్యం ఇవ్వాలని రాజు ఆలోచన. ఈ విషయమే తన కూతుళ్ల వద్ద ప్రస్తావించడానికి వారి అభిప్రాయాలు కనుక్కోవడానికి వెళ్లాడు. నాన్నను చూడగానే ‘రండి నాన్నగారు’ అంటూ స్వాగతం పలికారు ఆరుగురు కూతుళ్లు. (Daughters) వాళ్లను చూసి చిరునవ్వు నవ్వాడు మణివర్మ. ‘అమ్మా మీకో విషయం చెప్పాలి’ అన్నారు. ‘చెప్పండి నాన్నగారు’ అంటూ అందరూ ఒకేసారి అడిగారు.

మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఆరుదేశాల యువరాజులు ముందుకు వచ్చారు అని మనమంత్రి చెప్పారు’ అన్నాడు రాజు. మీరు ఏమన్నారు?’ అడిగింది పెద్ద కూతురు దీప. వారి అందరికీ అన్ని విద్యలు వచ్చు, ఈ సువిశాల రాజ్యం’ అంటుండగానే రెండవ కూతురు కల్పించుకుని అందరం ఇక్కడే ఉంటే సరి’ అంది. మణివర్మ గడ్డం కింద చేయి పెట్టుకుని, ‘అందరూ ఇల్లరికం ఉండాలంటారు’ అన్నాడు మణివర్మ.

అవును నాన్నగారు మేమందరం ఐక్యతతో ఉంటాం. ముఖ్యంగా మన కోసలదేశం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం అందరం కలిసి కట్టుగా ఉంటాం’ అంది మూడవ కూతురు విజయ. ఆ మాటకు మిగిలిన ముగ్గురూ తలలు ఆడించారు. మణివర్మకు ఆ మాట కూతుళ్ల దగ్గర నుంచి విన్న తరువాత వారి ఐక్యతకు చాలా సంతోషించాడు. లేకపోతే తన రాజ్యం ఒకరికే ఇవ్వాలి అనే ఆలోచన అతనిది. దానివల్ల
కూతుళ్లు, అల్లుళ్లమధ్య మనస్పర్థలు వస్తాయని ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు కూతుళ్లే ఆమాట అంటుంటే ఆనందానికి అంతులేకుండాపోయింది. అందరి కూతుళ్లను దగ్గరకు తీసుకుని సదుటిపై ముద్దుపెడుతూ మీరు మన కోసల దేశం ప్రజల గురించి ఆలోచించడం నాకు నచ్చింది. ఇక అందరికీ ఒకేరోజు ఒకే ముహూర్తానికి వివాహాలు జరిపిస్తా.

మన కొసల దేశపు అల్లుళ్లు సింహాసనం అనేది లేకుండా సరి సమానంగా వాళ్ల ఆసనాలపై ఉండి రాజ్యపాలన చేస్తారు అదే మీకు చెప్పాలని వచ్చాను’ అన్నాడు. వెంటనే వివాహానికి కబురు పెట్టండి’ అంది చిన్న కూతురు చిత్ర. దానికి అందరూ నవ్వారు. మణివర్మ, మంత్రిని కలిసి ‘మహామంత్రి ఇప్పుడు నా సమస్య తీరింది మన కొసల దేశాన్ని పాలించడానికి ఇప్పుడు ఒకరు కాదు ఆరుమంది ఉన్నారు. వారికి తోడు మన అమ్మాయిలు ఉన్నారు’ అన్నాడు. దానికి మహామంత్రి ‘మంచిది మహారాజా రేపే వివాహానికి కబురు పెడతాను.’ అన్నాడు.

మణివర్మ ‘మహామంత్రి ఓ మాట, వీరికి వివాహం చేసి, అల్లుళ్లకు రాజ్యభారం ఇచ్చి మనం తీర్ధయాత్రలకు పోదాం’ అన్నాడు. సరే మహారాజా’ అని వెళ్లాడు. ఒకే శుభముహూర్తంలో కోసల దేశపు ప్రజల మధ్య వివాహం ఘనంగా జరిగింది. అల్లుళ్లు కూడా మంచి పాలనాధక్షులు కావడంతో కొసల దేశాన్ని ప్రజారంజకంగా పాలించారు. నిర్ణయాలు


తీసుకోవడంతో అందరూ ఏకీభవించేవారు. వారి పాలన స్వయంగా చూసిన రాజు మంత్రి ‘మేం
తీర్థయాత్రలకు వెళుతున్నాం. కోసల దేశపు ఔన్నత్యం మీరు నిలపాలి ఆ నమ్మకం, విశ్వాసం
మాకు ఉంది’ అన్నాడు మహారాజు. ‘మీరు ఏ దిగులు పెట్టుకోకండి కొసల దేశపు ప్రజలను మా
కన్నబిడ్డల మాదిరి చూసుకుంటాం’ అన్నారు అల్లుళ్లు.
‘అవును నాన్న’ అని వంతపాడారు కూతుళ్లు.

Read also: hindi.vaartha.com

Read also: assistance : సాయం

daughters rule kingdom Indian folktale Kosala kingdom princess marriage unity story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.