📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

True Worth : అర్హత

Author Icon By Abhinav
Updated: December 11, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లలిత తన మొబైల్ చూసుకుంటూనే ‘యాహూ’ అని ఎగిరి గంతేస్తూ అటుగా వెళ్తున్న ఆఫీస్ బాయ్ అప్పారావ్ కాలుని కనుక్కున తొక్కేసింది. దాంతో అతను “అమ్మోయ్, చచ్చార్రా రావుడో” అంటూ చెవులు మూసుకుని మైకు మింగినట్టు అరిచాడు. అది చూసిన లలిత, “అయ్యో.. సారీ అప్పారావ్! గంతేస్తూ బ్యాలన్స్ తప్పి నీ కాలుని పిప్పి చేశాను. ఏడవకు” అంటూ కళ్లు తుడిచింది. తర్వాత పర్స్ లోంచి రెండొందలు తీసి “మందులు కొనుక్కో” అంటూ జేబులో పెట్టింది. ఆ డబ్బులు చూసి “పోనీలెండి, మీ హీలుతో నా కాలుని తోలొచ్చేలా తొక్కినా హీల్ చేయించుకోడానికి డబ్బులిచ్చారు.. సంతోషం” అని అక్కడి నుండి వెళ్లిపోయాడు అప్పారావ్, లలిత ఇంత సంతోషంగా గంతేయడానికిగల కారణం.. తాను కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న అవార్డ్ ఎంపిక కోసం తీసిన ఫైనల్ లిస్ట్ నల నలుగురిలో ఆమె పేరు ఉంది. పైగా ఆమెదే మొదటి పేరు. దాంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. జాయిన్ అయిన ఒక సంవత్సరంలోనే ఇది సాధ్యమైంది. అందుకే ఆమెకి ఇంత సంతోషం. అయితే ఇది అంత తేలిగ్గా సాధ్యపడలేదు. 

ఆ గొప్ప పేరు అందుకో వడం కోసం ఆమె ఎన్నో ఆలోచనలు చేసింది. తన సీ.ఈ.ఓ. ని ప్రసన్నం చేసుకోవడానికీ, అతన్ని ఇంప్రెస్ చేయడానికీ చాలా మందిపై చాడీలని, చేగోడీలు తిన్నంత తేలిగ్గా చెప్పేది. మిగతా వారు చేసిన చిన్న చిన్న చీమ తలకాయంత తప్పులని సైతం గున్నేనుగంత చేసి చూపేది. వాటిని ఆమెకు అనుకూలంగా ఆయన చెవిలో వేసి, పెద్ద ఇంప్రెషన్ కొట్టేసేది. ఇలా తనకి పోటీ వస్తారు అనుకున్న వారందరి మీద ఏదో ఒక కంప్లయింట్ ఉండేలా

చేసింది. అలానే అతని భార్యామణి ఆ సంవత్సరంలో ఒకటి రెండు సార్లు కంపెనీ యానివెర్సరీకి, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ ఇవ్వడానికిగాను వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుండీ ఆవిడని అతుక్కుని మరీ ఆవిడ కళ్లల్లో పడింది. తర్వాత ఇంటి దగ్గర వండి తెచ్చిన పులిహోర అంటూ ఆమెకి తినిపించింది. ఇన్ని చేసాక ఆ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డూ, లక్ష రూపాయల నగదు ఆమెకి కాక ఇంకెవరికి వస్తుంది. పైగా ఆమె పేరు లిస్టులో మొదటిది కూడా. ఇక అనుమానం లేదనుకుంది. కొందరైతే ఇప్పుడే కరచాలనం చేస్తూ మరీ కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. ఆ సంతోషంతోనే ఈరోజు కాస్త గర్వంగా ఫీలయిపోతూ, కాలు మీద కాలు వేసుకుని మరీ కంప్యూటర్లో పని చేసుకుంటోంది. 

ఇంతలో ఒక అమ్మాయి వచ్చి “ఎక్స్యూజ్ మీ మేడం.. ఈ చిన్న డౌట్ క్లియర్ చేసి చెప్తారని వచ్చాను” అని కంప్యూటర్లో ఓ ఫైల్ ఓపెన్ ఓపెన్ చేసి, “ఇక్కడ ఈ లైన్ నాకు సరిగా. అర్థం కావడం లేదు” అని ఆమె ఏదేదో అడిగినట్టు అనిపించింది. పూర్తిగా అర్థం కాలేదు లలితకి, “అయినా ఎప్పుడూ లేనిది ఇప్పుడు నన్నే ఎందుకు ఈ డౌట్ అడుగుతున్నావ్?” అడిగింది లలిత తెల్ల మొహంతో చూస్తూ.

ఆమె చిన్నగా నవ్వుతూ “భలేవారు మేడమ్, మీరు ప్రాసెస్ బ్రిలియంట్ అవార్డ్కి ఎంపిక అయిన ఫైనల్ లిస్టులో ఉన్నారు. రేపో మాపో ఆ అవార్డు అందుకోబోతున్నారు. అంటే ఈ ప్రాసెస్లో మీకే అందరికంటే ఎక్కువ తెలిసి ఉంటుందనే నమ్మకంతో మిమ్మల్ని అడుగుతున్నాను” చెప్పిందామె చిరునవ్వుతో. “చచ్చింది గొర్రె.. ఇప్పుడు ఎలా?” అని మనసులోనే ఓ క్షణం అలోచించి ఇద్దరు ముగ్గురు స్నేహితులతో మాట్లాడి ఆమె డౌట్ క్లియర్ చేసి పంపి ఊపిరి పీల్చుకుంది. అంతలోనే మరో కొత్త ఎంప్లాయ్ వచ్చి మరో సందేహం అడిగాడు. దాంతో మళ్లీ ఊపిరి ఆగినంత పనైంది. ఏమనాలో తెలియక “చెప్తాను” అని మళ్లీ ప్రాసెస్లో ఓ సీనియర్ కి ఫోన్ చేసి వివరాలు మొత్తం విడమరిచి కనుక్కుని, తరువాత ఇతనికి చెప్పి పంపేసింది. అయితే వచ్చేప్పుడు ఇద్దరూ చాలా గౌరవంగా ఆమె వైపు చూశారు. కానీ వెళ్లేప్పుడు వాళ్ల చూపుల్లో కొంత తేడా కనిపించింది లలితకి. 

బహుశా అవార్డుకి ఎన్నికైన అమ్మాయి అలా అడిగితే ఇలా చెప్తుందనుకున్నాం.. కానీ ఈవిడేంటీ ఇలా తెల్ల మొహం వేసి నీళ్లు నమిలింది.. అనే సందేహం వారికి కలిగి అలా చూసి ఉండొచ్చు.. అనుకుంది మనసులో. ఇంతలో మరొకరు తన కేబిన్ వైపు రావడం చూసింది లలిత. ఆమె గుండెల్లో రాయి పడింది. కో కానీ.. ఇంతలో ఇందాక లలితని కలవడానికి వచ్చిన అమ్మాయి అతడిని ఆపి, ఎక్కడికి? అని

అడిగినట్టుగా లలిత గ్లాస్ కేబిన్ రూమ్లో నుండి స్పష్టంగా కనపడింది. అయితే ఆమె తల పట్టు కుని తర్వాత లలిత పక్క కేబిన్లోకి వెళ్లమన్నట్టు సైగ చేసింది. అది చూసిన లలిత మొదట హమ్మయ్య అనుకున్నా, తర్వాత కొద్దిసేపటికి ఆలోచనలో పడింది. “అతన్ని ఆమె ఆపకపోతే నేరుగా నా కేబిన్లోకే వచ్చేవాడు. కానీ ఆమె అతన్ని నా దగ్గరికి వద్దు.. అని నా పక్క కేబిన్లోకి వెళ్లమంది. బహుశా ఆమె ఇందాక వచ్చినప్పుడు నేను ఆమె అడిగిన సందేహానికి చక చకా చెప్పకుండా నాంచి, నాంచి ఆమెనే యక్ష ప్రశ్నలు వేసాను. ఆ తర్వాత మరొకరికి ఫోన్ చేసి, ఆమెకి వివరం చెప్పాను. అందుకయ్యుంటుంది. ఇంకా ఆ అవార్డ్ రాకుండానే నాపై ఇంత పెద్ద అంచనాలు ఉన్నాయ్. 

ఒకవేళ ఆ అవార్డ్ వచ్చాక, ప్రాసెస్లో నేను సరిగా అందరి డౌట్స్ క్లియర్ చేయడంలో తడబడితే నా పరువు ఏమవుతుంది.. ఏం చేద్దాం?” అని ఆలోచిస్తుండగా అటుగా వెళ్తున్న అప్పారావ్ వాచీ చూసుకుంటూ నెత్తి కొట్టుకుంటున్నాడు. అది చూసి “అదేవిటీ.. అలా నసుగుతూ నెత్తి బాదుకుంటున్నావ్?” అడిగింది లలిత. “ఎం చెప్పమంటారు మేడమ్ గారూ! మా బావమరిది చేతికున్న స్మార్ట్ వాచ్

చూసి గొప్పకు పోయి నేనూ అచ్చం అలాంటి డిజిటల్ స్మార్ట్ వాచ్ కొనేసి పెట్టుకున్నానండీ. కానీ నాకు అందులో టైమ్ చూడ్డం రావడం లేదు. గొప్పకీ పోయి దీన్ని చేతికి తగిలించుకుంటే ఇపుడు ఇది నా పీకకి చుట్టుకున్నట్లయింది. ఆ మాటలతో లలిత బుర్ర గోక్కుని “అవును ఇప్పుడు గొప్పకో, డాబుకో పోయి ఈ అవార్డ్ తీసుకుంటే- రేపు నాతో పాటు నన్ను నమ్మి ఎంతో అభిమానంగా ఈ అవార్డ్కి ఎంపిక చేసిన సీ.ఈ.ఓ గారికి కూడా మాట రావచ్చు” అని మనసులో అనుకుంది. ఓ క్షణం ఆలోచించి వెంటనే తనకి ఆ అవార్డ్ వద్దనీ, దానికి తగ్గ అర్హత ఇంకా ఆమె వద్ద లేదని అతనికి వాట్సప్ పెట్టింది. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

competence corporate life employee award Hard Work Honesty Integrity moral story office story self realization true success

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.