రామనాథపురం గ్రామంలో రమణయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు. కాదు. వడ్డీవ్యాపారం చేసి ఎంతో డబ్బు గడించాడు. రమణయ్య తాను సంపాదించిన డబ్బును ఒక భోషాణంలో పెట్టి భద్రపరిచాడు. నిరంతరం ఆ డబ్బు గురించి ఆలోచించేవాడు. భోజనం సరిగా హిమాలయాల నుండి ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు. తినేవాడు కాదు. రాత్రిపూట సరిగా నిద్ర పోయేవాడు కాదు, రోజు రోజుకు రమణయ్యకు మనశ్శాంతి లేకుండా పోయింది.

ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరోజు రమణయ్య ఆ సన్యాసి దగ్గరకి వెళ్లి “నాకు – ఎంత డబ్బు సంపాదించినా నిజమైన సంతృప్తి, ఆనందం లేదని” చెప్పాడు. వెంటనే సన్యాసి “రమణయ్యా! నీవు సంపాదించిన డబ్బులో కొంత నీ అవసరాలకు ఉంచుకుని మిగిలిన డబ్బును పేదవారికి పంచమని” చెప్పారు. “సరేనని” సన్యాసికి నమస్కరించి
ఇంటికి వెళ్లాడు రమణయ్య తన దగ్గర ఉన్న డబ్బును ఆ గ్రామంలోని పేదలందరికీ పంచిపెట్టాడు.
అప్పటినుండి కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోతున్నాడు రమణయ్య. ఒక సంవత్సరం తర్వాత గతంలో వచ్చిన రమణయ్య సన్యాసి మళ్లీ గ్రామానికి వచ్చాడు. సన్యాసి వచ్చాడని తెలిసి రవ సన్యాసిని కలవడానికి వెళ్లాడు. “ఎలా వున్నావని” సన్యాసి రమణయ్యను. అడిగాడు. “పరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయం” చెప్పి

నా కళ్లు తెరిపించారు. రమణయ్య అన్నాడు. “నిజమైన జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు రమణయ్యా. నీకంతా శుభమే జరుగుతుందని దీవించాడు. సన్యాసి. సన్యాసి పాదాలకు నమస్కరించి రమణయ్య వీడ్కోలు తీసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: