ఉదయం ఆరింటికి నోట్లో బ్రష్ వేసుకుని చెరువుగట్టుపై కూర్చున్నాను. ఆలోచలన్నీ మంజుల వైపే వెళుతున్నాయి. అమ్మాయి చాలా మంచిది, సున్నితమైన స్వభావం కలది, కానీ విధి ఆమె పాలిట శాపమైంది. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. వాళ్ల అమ్మ కూలి పని చేసి చదివిస్తోంది. మంజుల గురించి తలచుకొంటుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి” ఎవరైనా ఆర్థిక పరంగాను వుండీ మంచి మనసున్న అతని పెళ్లి చేసుకుంటాను ఇప్పుడెలాగూ సుఖం లేదు. కనీసం పెళ్లయ్యాకైనా సుఖంగా వుండాలి కదా రాజా” అని. మంజుల అంటుంటే నాలో అంతర్మధనం మొదలైంది.తనది, నాది వేరే వేరే గ్రామాలైన నా గురించి ఆమె కన్నా- ఆమె గురించి నాకే బాగా తెలుసు. ఎప్పట్నుంచో తనని మనసులో ప్రేమిస్తున్నాను, అడిగినవన్నీ తీయిస్తున్నాను. మంజుల కూడా నా పైన అపారమైన నమ్మకం పెంచుకుంది. తనను వదిలి వుండలేని పరిస్థితి నాలో ఎక్కువైంది. కానీ మంజులకు ఆర్థిక పరమైన చేయూతనివ్వాలి. చేతనైనంత సహాయం అందించాలి. ఇలా ఆలోచించేలోగానే పొద్దు బారెడెక్కింది. “అయ్యో! సమయం దాటిపోతోంది. ఈరోజు మంజుల జన్మదినం. తనకు కొత్త బట్టలు కొనాలి, షాపింగ్ చేయాలి” అని మనసులో అనుకుంటూ లేచి చకచకా ఇంటికి వెళ్లాను.
నాన్న మంచంపై కూర్చుని కాఫీ తాగుతున్నాడు. “ఎక్కడికెళ్లావురా ఇంతసేపు? నీ కోసం ఆ శివగాడు వచ్చి వెళ్లాడు” అని నాన్న అనగానే నా గుండెలో రైళ్లు పరిగెత్తాయి. ఆ పూట భోజనం కూడా చేయలేదు. డ్రెస్ మార్చుకుని బజార్లోకి అడుగు పెట్టాను. ఎట్టకేలకు మంజులకు కావలసిన బట్టలు వగైరా సరుకులు వాళ్లింటికెళ్లాను నన్ను చూడగానే మంజుల ముఖంలో మెరుపుకల కొట్టొచ్చినట్టు కనిపించింది. “నిజంగా నువ్వేగనక లేకపోతే నేను ఈ సెలబ్రేషన్ జరుపుకునేదాన్నే కాను. అప్పటికీ నీ ఫ్రెండ్ రాకేష్ నన్ను బతిమిలాదాడు పుట్టినరోజు కానుకగా ఏదైనా తీయిస్తానని. ఎలాగో నువ్వు తెస్తావు కదాని వద్దులే అన్నాను” అంది. మంజుల, నాలో భయం నీడలా కమ్మేసింది. ఆ రాకేష్ మంజులను లోలోపల ఇష్టపడుతున్న సంగతి తెలుసు, ఆమె ఆర్ధిక పరిస్థితిని ఆసరా చేసుకొని ఎలాగైనా ఉడతాభక్తిగా సాయం చేసి మార్కులు కొట్టేయాలని వాడి ఆలోచన. అతను బాగా సంపన్నుడు. దేన్నయినా డబ్బుతో సాధించవచ్చనే మోసపూరితమైన ఆలోచన కలవాడు. మంజుల వాడి పేరు ఎత్తగానే క్షణం నా గుండె చల్లబడింది. “అలాంటి వాళ్లను నమ్మొద్దు. ఏమిచ్చినా తీసుకోవద్దు” అన్నాను. “సరే” అంది మంజుల ఆ రోజు పుట్టిన వేడుకలు సంతోషంగా ముగిసాయి.
కాలానుగుణంగా జరిగే పరిణామాల పట్ల చాలా జాగ్రత్తగా వుండాలని మంజులకు చాలా సార్లు చెప్పాను. ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే నమ్మకం. ఈ రెండు వదిలేసి అమ్మాయి వీక్ నెస్ను ఆసరా చేసుకుని డబ్బు ఎర వేసి మోసం చేస్తున్నారు. అలా మోసగింపపడకూడదనే. మంజులకు కావాల్సినవన్నీ నేనే సమకూరుస్తూ వస్తున్నాను. ఇలా రోజులు జరగగా ఒకరోజు.. తనని అర్జెంటుగా కలవాలని మెసేజ్ పంపింది. ఆరోజు సెలవు కావడంతో ఊరికి దూరంగా ఉన్న స్కూల్ శిరీషతో కలిసి వచ్చింది.. చేతిలో చిన్న బాక్స్, అమె ముఖంలో ఏదో ఇబ్బందికరమైన తేడా కనిపించింది. బాక్స్ ఓపెన్ చేసి బంగారు. ఉంగరాన్ని బయటికి తీసింది. దాన్ని ఎక్కడో చూసినట్టు గుర్తు, ఆలోచన నుంచి తేరుకునేలోగానే అందులో నుండి ఒక చీటీ బయటికి తీసి చూపించింది. విషయం అర్థమైపోయింది నాకు. ఆశ్చర్యం నుంచి కోలుకునేలోగానే-“దీన్ని బంగారు పావులో కుదువ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది” అని నిలదీసినట్టు అడిగేసరికి నేను నోరు మెదవలేకపోయాను. నా ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకుందట. నిజంగా నేను. కూడా మధ్యతరగతివాళ్లే. ఆర్ధిక వరంగా మంజులను ఆదుకోకపోతే ఎక్కడ దూరమైపోతుందోనన్న భయంతో అప్పు చేసి ఇచ్చేవాణ్ణి.
తనకు బట్టలు కావాలంటే చేతిలో చిల్లిగవ్వ లేని పోంలో దాన్ని కుదువకు పెట్టాల్సి వచ్చింది. తను ఊరెళ్లాలని చెప్పిన క్షణం స్నేహితుడు శివగాడితో అప్పుగా నగదు తీసుకుని మంజులకు ఇచ్చాను. అన్ని విషయాలు చెప్పేసరికి అవాక్కైంది. “ఎంతపని చేసావు రాజా! నేనెక్కడ నీ నుండి దూరం అవుతానోనని నీ పేదరి కాన్ని దాచిపెట్టి అప్పు చేసి నన్ను సంతో షపరిచావా? అడిగిన తక్షణం అన్నీ సమకూరుస్తుంటే నువ్వు ఆర్థికంగా బాగు న్నావని అనుకున్నాను. ప్రేమంటే అవస రం కాదు రాజా, ప్రేమంటే బాధ్యత, నమ్మకం. ఇవి రెండూ పుష్కలంగా నీలో వున్నాయి. మధ్యలో ఇవన్నీ ఎందుకు? నా కోసం ఎంత రిస్క్ పడ్డావో తెలుసా? అయినా ఆర్థికంగా సహాయం చేసినంత మాత్రాన వాళ్లకు ప్రేమను పంచుతానని ఎలా అనుకున్నావు? సహాయం వేరు, ప్రేమ వేరు. నువ్వు నా కోసం అసలు నిజాన్ని దాచి మానసికంగా బాధను భరించి నన్ను సంతోషపెట్టావు. నాక్కావ లసింది నీలాంటి మనసున్న మనిషి, కానీ మనసుకు లెక్కగట్టే మనిషి కాదు” అంటూ నన్ను గాఢంగా కౌగించుకుని ఆనందభాష్పాలు రాలుస్తున్న మంజులను చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు అప్రయత్నంగా రాలిపోయాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: