📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Story Told by the Watch : వాచీ చెప్పిన కథ

Author Icon By Abhinav
Updated: December 8, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వీడికి చిన్నప్పటి నుంచీ వాచీలంటే మహా ఇష్టం. మేం ఎప్పుడు మాల్ కి వెళ్లినా వాడు వాచీ కొనమని నన్ను తెగ ఇబ్బంది పెట్టేవాడు. వాచీలంటే మరీ ఖరీదయినవేమీ కాదు. సుమండీ… మహా ఉంటే వందో, రెండు వందల రూపాయలో ఉంటాయంతే. అదేమిటో మూడేళ్ల వయసు నుంచే వాడికి బొమ్మల కన్నా వాచీలంటే మహా పిచ్చి ఉండేది.

వీడు ఆ కొత్త వాచీ పెట్టుకుని అపార్టుమెంట్లో అందరి ఇళ్లకి వెళ్లి నా కొత్త వాచీ అని చూపించేవాడు. ఇంతలో వాడు ఒక బాక్స్ తీసి అందులో నుంచి వాచీ తీసి ఇది ఎవరిది నాన్నా? అని అడిగాడు ఆ వాచీ చేతిలోకి తీసుకుని చూస్తే అది మా నాన్నగారి రాడో వాచ్…. దాన్ని చూడగానే నా కళ్ల ముందు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కదలాడసాగాయి. అప్పుడు అర్థమైంది ఈ వాచీల పిచ్చి వీడికి మా నాన్న గారి దగ్గర నుంచే అబ్బిందని. 

నేను మొదటిసారి విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు మా నాన్న గారికి ఒక వాచీ కొనాలి అనిపించింది. అది నా మొదటి బహుమానంగా ఆయన పుట్టిన రోజున ఇవ్వాలి.. అనుకున్నా, ఒక మిత్రుడితో కలిసి నేను డో షోరూంకి వెళ్లాను.

చాలా మోదల్స్ చూసి వాటిలో ఒకటి ఎంచుకుని రేటు చూసా. ఆ రోజుల్లోనే అది అక్షరాలా పదిహేడు వేల రూపాయలు. ఆ రోజుల్లో నా సంపాదనకది కొంచం ఎక్కువే అయినా నాన్న గారికి ఒక మంచి వాచీ కొనాలన్న ఆకాంక్షతో కొనేశాను. ఇంతలో నా స్నేహితుడు దీంతోపాటు ఒక గోల్డ్ చైన్ షాప్కి వెళ్లి ఒక చైన్ కూడా కొనేసాను.

నాన్నగారు చాలా నిజాయితీగా ఉండేవారు. పేరుకి ప్రభుత్వంలో పనిచేసే ఎలక్ట్రిక్ ఇంజినీర్ అయినా ఆర్జన అంతంత మాత్రంగానే ఉండేది. తోటి సహచరులు అన్ని విధాలా అక్రమార్జన చేస్తుంటే ఆయన మాత్రం నిజాయితీకి ప్రతిరూపంగా ఉండేవారు. 

దానికి ఆయనిచ్చే ఒకే ఒక సమాధానం “ఆ పాపిష్టి సొమ్ము మనకు వద్దు. దేవుడిచ్చిన దాంతోనే బతకాలి” అని, ఆయన ఆలోచనలకు సరి సమానంగా మా అమ్మగారి ఆలోచనలు. జీవితంలో అడుగడుగునా కష్టాలు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నవారికి పిల్లలు ఎదిగి చేతికి వచ్చి ప్రయోజకులు అయితే అంతకన్నా కావాల్సి నదేముంటుంది? అందుకు గొప్ప తార్కాణం.. మా అమ్మా నాన్నలు.

ఇప్పుడు నాన్న గారి వయసు ఎనభై పనే ఉంటుంది. చేతికి వాచీ లేదు, బ్రేస్లెట్ లేదు. ఎందుకు తీసేసారంటే పెట్టుకునే ఓపిక లేదురా! అంటారు. ఆరోజు నేను డబ్బుకి వెనుకాడి ఎందుకు కొనడం? అనుకుంటే ఈ రోజు ఇన్ని మధుర స్మృతులు నాకు దక్కేవి కావు. అందుకనే పెద్దలు ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయాలి.. అనేవారు. 

జీవితంలో డబ్బే ప్రధానం కాదు, విలువలు ప్రధానం అని చెప్పడానికి నాన్న గారి జీవితమే ఒక నిదర్శనం. మమ్మల్ని కూడా అలాగే పెంచారు, అలాగే జీవించమన్నారు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తిత్వం కోల్పోతే తిరిగి రాదు అనేవారు.

నా ప్రకారం జీవితం జట్కాబండి అయితే విలువలు ఇరుసు. మా వాడి దగ్గర నుంచి వాచీ తీసుకుని నాన్న గారికి చూపిస్తే ఆయన కంట నీరెట్టుకుని ఇక ఇప్పటి నుంచి దీన్ని వీడు పెట్టుకోవాలి.. అని ఆ వాచీ వాడి చేతికి పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

childhood memories Emotional story family bonding family sentiment Father and Son generations gift of love grandfather love Heart Touching Story Honesty Integrity Legacy Life Lessons Moral values Rado watch sentimental touching story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.