📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Rabbit’s Dream : వైవిధ్యం సృష్టి విలాసం

Author Icon By Abhinav
Updated: December 6, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓకసారి అడవికి విహారానికి వచ్చిన సుబ్బయ్య కుటుంటానికి ఒక కుందేలు పిల్ల దొరికింది. సుబ్బయ్య భార్య పిల్లలు రాము, శివాలు ముచ్చట పడటంతో ఆ కుందేలు పిల్లను ఊరికి తెచ్చుకొని పెంచటం మొదలు పెట్టారు. అది శాకాహారి కాబట్టి దానిని పెంచటం పెద్ద శ్రమ కాలేదు సుబ్బయ్య కుటుంబానికి. పిల్లలతో అడుకొంటూ కుందేలు కూడా హాయిగా కాలం గడుపుతున్నది. కుందేలుకు చిన్ని అని పేరుపెట్టారు. చిన్నీ అని పిల్లా పెద్దా ఎవరు పిలిచినా చెంగు చెంగున ఎగురుకొంటూ వచ్చేది కుందేలు. అయితే చిన్ని చాల బుద్ధి కలది. ఆ ఇంటిలో అన్నీ గమనిస్తున్నది. ఇలా గమనిస్తుండగా దానికొక సందేహం వచ్చింది. అదేమిటంటే అడవిలో కూడా ఆడ, మగా జంతువులు ప్రతి జాతిలో ఉంటాయి. పిల్లల్ని కంటాయి. కొన్ని రోజుల తర్వాత ఎవరి జీవితం వారిది. పిల్లల దారి పిల్లలది. కానీ, సుబ్బయ్య గారింట్లో సుబ్బయ్య, ఆయన భార్య అనుక్షణం కీచులాడుకొంటుంటారు. 

ఒకరిమీద మరొకరు ఆజమాయిషీ చేయాలనుకొంటుంటారు. ఎక్కువసార్లు సుబ్బయ్యనే మహాలక్ష్మిని తన మాట వినేట్లు చేస్తాడు. మళ్ళీ కాసేపటికి ఇద్దరూ కలిసి నవ్వుకొంటూ మాట్లాడుకొంటుంటారు. చూడడానికి వీళ్ళ జీవితం మన జీవితంలానే ఉన్నా ఇదేం విచిత్రమబ్బా మనిషి జీవితంలో. ఇలా అనుకొంటూ చిన్న కునుకు తీసింది. అందులో దానికొక కల వచ్చింది. ఆ కలలో ఒక రుషి కూడా తనలాగే కీచులాడుకొనే మొగుడూ పెళ్ళాన్ని చూసి, భార్యపై జాలిపడి ఆమెను పులిగా, ఆయనను జింకగా మార్చేశాడు. ఎప్పుడైతే ఆ జంటలోని భార్య పులిగా మారిందో వెంటనే భర్త ఆమెను చూసి పరుగు లంఘించుకొన్నాడు. అది చూసి రుషి కంగారు పడ్డాడు. రుషి కోరుకొంది పేరు, జరిగింది వేరు. భర్త భార్యను అనుక్షణం శాసించటం, భార్య లొంగి ఉండటం ఇష్టం లేక తాను వారిని అలా మారిస్తే భార్యకు భయపడి జింక అణిగిమణిగి కాపురం చేస్తుందనుకొన్నాడు. 

కానీ, తానొకటి తలిస్తే వేరొకటి జరిగింది. వారి కాపురమే బుగ్గిపాలైంది. ఇలా అనుకోని, చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడి తిరిగి జింకగా మారిన భర్తను మనిషిగా, పులిగా మారిన భార్యను స్వ స్వరూపానికి తెచ్చాడు. హమ్మయ్య.. తను చేసిన పొరపాటు సరిదిద్దుకొన్నానని లోపల సంతోషపడ్డాడు. కానీ, ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. ఇప్పుడు భర్త అంటే అణుకువుగా కనిపించే భార్య పూర్వ లక్షణం పోయింది. జింకాకారం నుంచి మనిషైన భర్త ఆమెను క్రితంలాగా చూడ లేకపోయాడు. అలా వాళ్ళ కాపురం ఎవరికి వారిదై, భార్యా భర్తల బంధం తెగిపోయింది. కునుకు తీస్తున్న చిన్నికి ఓ స్వరం వినిపించింది.. చూశావా చిన్నీ, నువ్వు అనుకున్నట్టే వాళ్ళ జీవితం జంతువుల జీవితంగా మారిపోయింది. అప్పుడు దేవుడు మనుషులను సృష్టించటం దేనికి? అందుకే మనుషుల జీవితం జంతువుల కంటే భిన్నంగా ఉండాలని దేవుడు ఇలా సృష్టి జరిపాడు. వైవిధ్యం సృష్టికి ఆధారం, మకుటం, అందం కూడా. కుందేలుకు మెలుకువ వచ్చింది. తన ఆలోచనలోని లోపానికి సిగ్గు పడింది..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Diversity in Creation Dream Sequence Family Relationships Harmony. Human Nature Husband and Wife Life Lessons Magic moral story Nature vs Humans Pet Story rabbit Sage telugu story Tiger and Deer Uniqueness wisdom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.