📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Pickle Story : ఊరగాయ

Author Icon By Abhinav
Updated: December 5, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొడుకు ప్రణవ కృష్ణ పోస్ట్  చేస్తున్నాడు. ఉద్యోగం చేసేది ఏలూరులో కాబట్టి అక్కడే కొత్త కాపురం పెట్టాడు. పెళ్లై ఆరు నెలలైనా కోడలు పుల్ల మామిడికాయ కావాలని అత్త వేదలక్ష్మిని అడగలేదు. “ఈ కాలం పిల్లోల్లకి మనం చెప్పేదేముంది? కక్కొచ్చినా, కళ్యాణమొచ్చినా ఆగదు కదా!” అని తనకు తానే సర్ది చెప్పుకుంది కొడుకూ కోడలూ, ఎలా ఉన్నారోనని వేదలక్ష్మి ఓ రోజు, గంట ప్రయాణమున్న ఏలూరుకు నూజివీడు నుంచి బస్సులో వెళ్లింది. అత్తని నవ్వుతూ  ఆహ్వానించింది కోడలు పూర్ణతిలక, అత్తగారికి చల్లటి ఫ్రీజ్సెళ్లు ఇచ్చి మంచి చెడ్డలు మాట్లాడింది. ఇంతలో కొడుకు ప్రణవ కృష్ణ ఆఫీసు నుంచి భోజనానికి వచ్చాడు. 

అమ్మని పలకరించి, అవీ ఇవీ మాట్లాడి భోజనానికి కూర్చున్నాడు. ఇంటి వెనుకనున్న అరటిచెట్టు నుంచి కొన ఆకు కోసుకొచ్చి అందులో అన్నం, పప్పు వడ్డిస్తోంది పూర్ణ పూర్ణ తిలక, కోడలు ఎలా వడ్డిస్తోందో చూస్తూ కూర్చుంది.

వేదలక్ష్మి. వంటలతో పాటు ఊరగాయ కూడా వడ్డించింది కోడలు. ఆశ్చర్యంగా చూసింది అత్త. “పెళ్లి కాకముందు నా బిడ్డ ఊరగాయ ఊసే ఎత్తేవాడు కాదు కదా, ఇప్పుడెందుకు అలవాటు చేసుకున్నాడో?” అని ఆలోచనలు మొదలైనాయి.

వేదలక్ష్మికి. గబగబా తినేసి ఆఫీసులో ఆర్జెంటు పని ఉందని వెళ్లిపోయాడు ప్రణన “ఎప్పటినుంచి ఊరగాయని ఇష్టపడుతున్నాడు?” అని అడిగింది. 

“ఇక్కడ కాపురం పెట్టినరోజు నుంచీ ఊరగాయ లేనిదే భోజనానికి కూర్చోవడం లేదు” అని బదులిచ్చింది. ఆయనకి ఇష్టమని సూపర్ మార్కెట్ నుంచి తను తెచ్చిన ఊరగాయలన్నీ చూపించింది కోడలు.

“వెల్లుల్లి వేసిన ఊరగాయలే ఆయనకి నచ్చుతాయి. వెల్లుల్లి వేయని ఊరగాయను ఎడమ చేత్తో కూడా తాకడు” అని చేతి గాజులు ఆడిస్తూ చెప్పింది. అత్త ముఖం మాడిన గోంగూర పచ్చడిలాగా తయారయినయంది. చిన్నగా బ్యాగు సర్దుకుని “నేను వెళ్లొస్తాను” అని చెప్పింది. “పది రోజులైనా ఉంటారని అనుకున్నాను. 

అప్పుడే వెళ్లిపోతారా అత్తయ్యా? కనీసం భోజనం  చేసైనా వెళ్లండి” అని బతిమిలాడింది కోడలు. “కడుపు నిండుగా ఉంది, నేను వెళ్లొస్తా” అని చెప్పి ఆటో పెట్టుకుని బస్టాండుకు సర్రున వెళ్లిపోయింది.. అత్త ఎందుకు వెంటనే వెళ్లిపోయిందో అర్థం కాలేదు కోడలికి. ఊరగాయ గురించి ఎందుకు అలా అడిగిందో కూడా అర్ధం కాలేదు.

ఊరగాయ తింటే నష్టాలేమిటో కనుక్కోడానికి తన క్లాస్మెటికె ఫోన్ చేసింది. యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్టులో రీసెర్చ్ చేస్తోంది ఆ మిత్రురాలు. “ఎంత ఊరగాయ తింటున్నాడు? ఎన్ని సార్లు తింటున్నాడు? ఏయే వేళ్లల్లో తింటున్నాడు? ఏ రకం ఊరగాయలు ఆయనకు నచ్చుతాయి? ఏ కంపెనీ బ్రాండ్లు ఇష్టపడుతున్నాడు? ముక్కలు తింటున్నాడా? అందులోని జ్యూస్ తింటున్నాదా?” లాంటి ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టింది.

కంప్యూటర్ ముందు కూర్చుని జిగ్ జాగ్ లెక్కలు కొన్ని వేసి, ఆయన తినే ఊరగాయ మోతాదు వల్ల అతడి ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని గంట కొట్టినట్లు చెప్పింది మిత్రురాలు. అయినా పూర్ణతిలక మనసు శాంతించలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పింది.

ఇంటికొచ్చిన అత్త “చేయి కడుక్కోకనే” పరుగులు తీసిందని, కొడుకు తినే ఊరగాయ విషయం కూడా ఆరా తీసిందని చెప్పింది. నూజివీడులోని ఒకే వీధిలో ఉంటున్న వియ్యంకురాలి ఇంటికి పరుగులు తీసింది పూర్ణ తిలక తల్లి, అప్పుడు బస్సు దిగిన వేదలక్ష్మి, పూర్ణ తిలకని గట్టిగా వాటేసుకుని ఇలా చెప్పింది.

“నీ కూతురు వండే వంటల్లో ఉప్పూ. కారం సరిగా వేయడం లేదు. అందుకే నా కొడుకు ఊరగాయలకు మరిగినాడు. ఊప్పూ, కారం తింటేనే కదా పిల్లోల్లకి బలం ఉండేది. వాడు నిక్కరేసుకున్న రోజు నుంచి తాళి కట్టే వయసొచ్చేంత వరకు ఊరగాయ ముఖం చూసినోడు కాదు.

అట్లాంటిది పెళ్లయ్యాక మారిపోయాడు” అని ఎగిరెగిరి చెప్పింది. “అయ్యో..! అవునా? నాకు విషయమే తెలియదు. అయినా అల్లుడు ఆ విషయాన్ని, నా కూతురితో చెప్పొచ్చు కదా!” అని అడిగింది పూర్ణ తిలక తల్లి. “మా వాడికి మొహమాటం జాస్తి. కొత్త పెళ్లాం కదా, ఒకటి చెప్పినా ఎక్కువ, రెండు చెప్పినా తక్కువ.

అందుకని చెప్పి ఉండడు” అని ముక్కు బలంగా చీదింది. వెంటనే పూర్ణ తిలకానికి వీడియో ఫోన్ కాల్ చేసింది తల్లి “ఉప్పూ, కారం బాగా వేసి వంటలు చేయి. మీ ఇంటాయనకు ఊరగాయలు వడ్డించేది తగ్గించు. అంతా సర్దుకుంటుంది” అని చెప్పింది. సరేనని గట్టిగా తల ఊపింది పూర్ణతిలక, మూడు నెలలకే వేదలక్ష్మికి కోడలి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

“నూజివీడులో పుల్లటి మామిడికాయలు కేజీ ధర ఎంత అత్తయ్యా?” అని. “కేజీ ఏముంది? బస్తానే తెస్తాను” అని చీర కొంగు నడుముకు చుట్టి అప్పటికప్పుడు ఏలూరు బయలుదేరింది వేదలక్ష్మి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Comedy cooking cravings Daughter in Law Family Drama Food Habits Happy Ending Indian Marriage misunderstanding Mother in Law Pickle Pregnancy News Relationships Traditional Family

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.