📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Clever Goat : తెలివైన మేక

Author Icon By Abhinav
Updated: December 11, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేవాపురం గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఒక మేకను సాకుతూ ఉండేవాడు. ఆ మేకకు పేరు కూడా పెట్టాడు. దాని పేరు చిక్కి, ఊరిలో జనాలు దానిని చిక్కు అని పిలుస్తారు. రామయ్య రోజూ చిక్కికి చెట్లకొమ్మలు నరికి తెచ్చేవాడు. ఎంతో సంతోషంగా కడుపునిండా తినేది చిక్కి. ఎవరినీ ఏమీ అనేది కాదు. రామయ్య పక్కింటివారు కూడా రెండు మేకలు పెంచుకున్నారు. తెల్ల మేక, నల్ల మేక. తెల్ల మేక పేరు జింకి, నల్ల మేక పేరు జింకేష్. జింకి, జింకేష్లు చిన్న పిల్లలు, పెద్దవారు అని అనకుండా అందరినీ భయపెట్టేవి, కొమ్ములతో కుమ్మేవి. ఊళ్లో జనాలకు జింకి, జింకేష్ అంటే అస్సలు నచ్చదు. పక్కింటివారు ఒకరోజు ఊరికి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది.

అప్పుడు రామయ్యకు జింకీ, జింకేష్లను అప్పజెప్పి వెళ్లారు.. “మీరు మళ్లీ ఎప్పుడు వస్తారు?” అని అడిగాడు రామయ్య. “రెండు రోజుల తరువాత వస్తామని, వీటిని జాగ్రత్తగా చూడమని” చెప్పి పక్కింటివారు వెళ్లిపోతారు. సరే” నంటాడు రామయ్య. చిక్కిని, జింకిని, జింకేష్లను ఒకే దగ్గర కట్టేసి వాటికి మేత వేశాడు. పాపం.. చిక్కిని తిననీయకుండా జింక్, జింకేష్లు

“మాత్రమే తిన్నాయి. రెండు రోజులూ ఇలాగే చేసాయి. చిక్కి ఏమీ తినకపోయేసరికి దానికి చాలా ఆకలేస్తోంది. చిక్కి తన మెడకు కట్టిన తాడు తెంపుకుంది, బయటకు వెళ్లింది. ఎక్కడ చూసినా గడ్డి దొరకడం లేదు. అందరు గడ్డిమందు కొట్టారు. 

పాపం.. చిక్కికి బాగా ఆకలిగా వుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి. ఒక చెట్టు వంకరంగా ఉంది. దాని చివర లేతకొమ్మలు ఉన్నాయి, కానీ చిక్కికి చెట్టు ఎక్కడం రాదు. ‘పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని’

అనుకుంటుంది చిక్కి. పైకి ఎక్కుతుంది.. కింద పడుతుంది. చెట్టు సగం వరకు ఎక్కుతుంది కానీ అంతలోనే జారి కింద పడుతుంది. మళ్లీ మళ్లీ ప్రయత్నించి కింద పడుతుంది. చివరికి చిక్కి ప్రయత్నం ఫలించి చెట్టుపైకి ఎక్కుతుంది. చిగురుకొమ్మలను మేసి తన ఆకలి తీర్చుకుంది. మెల్ల మెల్లగా చెట్టు పైనుండి దిగి హాయిగా ఇంటికి వెళ్లిపోయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

animal tales Chikki determination Hungry Goat kids story moral story Perseverance Success The Clever Goat Tree Climbing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.