📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sibling Bond : తేడాలెందుకు?

Author Icon By Hema
Updated: July 31, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sibling Bond: రాజు, వాణి ఇద్దరు అక్కాతమ్ముడు. వారిద్దరూ ఎంచక్కా ఆడుకొంటున్నారు. ఇద్దరి మధ్య ఎప్పుడూ చిన్నపాటి గొడవ కూడా పడేవారు కాదు. రాజు వయసులోవాణీకన్నా మూడు సంవత్స రాలు చిన్నవాడైనా అతనికి అక్క అంటే ఎంతో ఇష్టం.(like)

ఇంట్లో ‘అమ్మనాన్నలు ఏం ఇచ్చినా అక్కకు తెలియాల్సిందే. తనని కాదని ఏదీ చేసేవాడు కాదు. ఇద్దరూ ఒకేబడిలో చదువుతున్నారు. తనకు ఏసందేహం వచ్చినా అక్క (older sister) దగ్గరే దానికి సమాధానం దొరికేది. ఇంట్లో తన గురువు మాత్రం వాణీనే.
స్కూల్లో ఒకరోజు చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని అనుకొన్నారు. అందుకుకావలసిన వస్తువులను పిల్లలనే తెచ్చుకోవాలని చెప్పారు.

ఇద్దరూ ఇంటికి రాగానే రేపటికి కావలసిన వాటికోసం నాన్న ఎప్పుడుకావలసినవి తీసుకోవడానికి బజారుకు వెళ్లాలి, రండి వెళ్లాం’ అంటూ చెరోపక్క కూర్చున్నారు. రాత్రి పూట మీరిద్దరెందుకు, అక్కకు ఏం కావాలో నువ్వు తెలుసుకో మనిద్దరం వెళ్లి తీసుకొద్దాం’ అంటుండగానే ఇంట్లో నుంచి వచ్చిన అమ్మ వస్తారా బయటకు ఎప్పుడు తీసుకువెళ్తారా అని ఎదురుచూస్తున్నారు.

నాన్న రాగానే ‘నాన్న మాకు రేపు బడిలో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అందుకు అవును… ఆడపిల్ల రాత్రి పూట బయటకేందుకు, నువ్వెళ్లి రా..రా.. మీ నాన్నతో..’ అంటుండగానే ఏమీ తెలియని వయసున్న రాజు తన తండ్రితో ‘నాన్న ఐతే నేను అక్క ఒకటి కదా?’ అంటూ అడిగే సరికి వాటి నుంచి మరొక్క అనుమానకరమైన ప్రశ్న మొద లైంది.

అందుకు కారణం పెద్దలుగా మనమేనని భావించిన రంగారావు తన మనసులో ఇన్నాళ్లూ గూడుకట్టుకున్న ఇలాంటి నీచ భావాలకు స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే
తడవు, వెంటనే ఇద్దరినీ తన బండిపై తీసుకెళ్లి కావలసినవి కొనిపెట్టాడు.

ఆ రోజు నుండి ఇద్దరి మధ్య తేడా చూపకూడదని భార్యభర్త లిద్దరూ భావించారు.

Read also: hindi.vaartha.com

Read also: Power of Forgiveness: పక్షులే మనకు ఆదర్శం

Empathy #ParentingGoals FamilyLove GenderEquality RespectGirls SiblingBond

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.