Telugu Emotional Love Story: పెళ్లివారి ఇల్లు సందడిగా ఉంది. తోరణాలు, పూలమాలలు, చుట్టూ అరటి పిలకలు, కొబ్బరాకులతో పెళ్లిపందిరి శోభాయమానంగా వుంది.
మంత్రాలు, మంగళ వాయిద్యాల హోరుతో, అందరూ అక్షతలు చల్లుతుంటే పెళ్లికూతురు మనస్వి మెడలో మంగళసూత్రం కట్టాడు కౌశిక్,
తను ప్రేమించిన అమ్మాయి, తన అర్ధాంగిగా రావడంతో కౌశిక్ ఆనందానికి అవధులు లేవు.
అతని మనసు ఆనంద పరవశ్యంతో తేలియాడింది. పెళ్లికొచ్చిన బంధువులు, స్నేహితులు అభినందిస్తుంటే, సంతోషంతో కౌశిక్ కళ్లు చెమ్మగిల్లాయి.
కొన్ని క్షణాలపాటు కళ్లు మూసుకుని ఇన్నాళ్లూ తను కన్న బంగారు కలలు నిజమైనందుకు ఇష్టదైవాన్ని మనసారా స్మరించుకున్నాడు. రెండేళ్ల క్రితం మనస్విని మొదటిసారిగా చూసాడు కౌశిక్. తొలి సూర్యకిరణంలాంటి చిరునవ్వు, వానలో తడిసి ఉదయాన విచ్చుకున్న పువ్వులాంటి కళ్ళతో ఎప్పుడూ
లేడి పిల్లలా హుషారుగా గంతులు వేస్తూ చూడముచ్చట గొలిపేది. ఆనందంతో సెలయేరులా. తుళ్లిపడుతూ కనిపించేది. ఆమెలో అద్భుతమైన అందం ఉంది, ఆకర్షణ ఉంది, అంతకు మించి అణుకువ ఉంది. నెమ్మదిగా, స్థిమితంగా మాట్లాడేది. ఆమె కళ్లలో ఎప్పుడూ వినయం, వివేకం తొణికిసలాడుతూ ఉండేవి. మనస్వి అందానికి ముగ్ధుడైన కౌశిక్ ఆమెకు దగ్గరవుతూ, భవిష్యత్తును ఎంతో మధురంగా, మనోహరంగా ఊహించుకున్నాడు. ఆమెకు కూడా కౌశిక్ అంటే ఇష్టం కలగడంతో, వారి ప్రేమ మొగ్గ తొడిగి చిగురించింది. ఎవ్వరూ ప్రేమించలేనంతగా కౌశిక్ మనస్విని ప్రేమించాడు. చెట్టులో, పుట్టలో, రాయిలో మనస్వి రూపాన్ని చూసుకున్నాడు. కౌశిక్ నమ్మకం, ఆశ ఫలించింది. మనస్వి మనసు కరిగింది. అతని స్వచ్ఛమైన ప్రేమకి దూరంగా ఉండలేకపోయింది. ప్రేమ, ప్రేమని గెల్చుకోగలిగింది. ఇద్దరి మధ్య పటిష్టమైన బంధం ఏర్పడింది. వీరి ప్రేమకు ఇరు వర్గాల పెద్దలు అంగీకారం తెలపడంతో కౌశిక్, మనస్విల ప్రేమకు పట్టాభిషేకం జరిగింది.
తాటిచెట్టే ఆయుష్కల్ప – ఒక రాత్రి పోరాటం
సాయంత్రం నుండి ఆకాశమంతా మేఘావృతమై వుంది. కనుచూపు మేరలో ఆకాశం కనిపించడం లేదు. మేఘాలు దూది పింజల్లా వాయు వేగానికి పరుగులు పెడుతున్నాయి. సన్నగా పడటం మొదలైన వర్షం కుండపోతగా మారింది. రాత్రి పది గంటలయింది. శోభనపు గదిలోకి ప్రవేశించాడు కౌశిక్.
మనస్విని అలంకరించి గదిలోకి పంపి తలుపులు మూశారు ముత్తయిదువులు. బయట ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరుపులు స్వేచ్ఛా విహారం చేస్తున్నాయి.
ఉరుములు ఉవ్వెత్తుగా విజృంభిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పరిసరాలు మరింత భీభత్సంగా మారాయి. ఇంతలో ఇంట్లో నుంచి అరుపులు, కేకలు పెద్దగా వినిపించాయి.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద వచ్చి ఊరుపైన పడింది. ఊరంతా ఒక్కసారిగా మునిగిపోయింది. ఇంట్లోవారి అరుపులకు తలుపు తీశాడు కౌశిక్. అంతే! ఒక్కసారిగా వరదనీరు తోసుకొచ్చి గదిని నింపేసింది. ఇంట్లోవాళ్లు కనిపించలేదు. వాళ్ల కోసం చూస్తుండగానే, మనస్విని నీళ్లలో మునిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద ప్రవాహం.
రావడంతో కౌశిక్ కూడా వరదలో కొట్టుకుపోయాడు. కొద్ది దూరంలో తాటిచెట్టు (Palm Tree) అతనికి ఆసరాగా దొరికింది. శక్తినంతా కూడదీసుకొని తాటిచెట్టు ఎక్కగలిగాడు. నష్టాన్ని మిగిల్చిపోయింది. రాత్రంతా ఆ చెట్టును అంటుకుని గడిపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం నీటిమట్టం తగ్గింది. కౌశిక్ తాటిచెట్టు దిగి చూస్తే, ఊరంతా నామరూపాలు లేకుండా పోయింది. వరద విలయతాండవం చేసి మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు, వంట భూములకు అనూహ్యమైన
తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మనస్విని దూరం కావడం జీర్ణించుకోలేకపోయాడు కౌశిక్. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలై పొగలు, సెగలు కక్కినట్లయింది.
బాధతో మెలికలు తిరుగుతున్న ఆలోచనలు అతన్ని వెంటాడుతున్నాయి. అంతా శూన్యంగా గోచరిస్తోంది. ఆమె రూపం గుర్తుకొచ్చి నిద్రకు దూరమయ్యాడు.
భార్య జ్ఞాపకాన్ని మరచిపోలేక అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కౌశిక్ ముందు ఒకరోజు అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది మనస్విని.
మనస్విని చూసిన కౌశిక్ ఒక్కసారిగా షాక్ తిన్నవాడిలా ఆదిరిపడ్డాడు. ఆమె చనిపోయిందని అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇప్పుడు మనస్విని సజీవంగా రావడంతో గ్రామంలోనివారు ఆశ్చర్యపోయారు. వరద నీటిలో కొట్టుకువచ్చి, నది ఒడ్డున స్పృహ తప్పి పడివున్న ఈ అమ్మాయిని మా గ్రామ ప్రజలు కాపాడారని, గ్రామ సర్పంచ్ ఆమెను తన కన్నబిడ్డగా చేరదీశారని, ఆమె చెప్పిన వివరాలు ప్రకారం మీ దగ్గరకు తీసుకొచ్చానని జరిగినదంతా వివరించాడు. ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి, వరదల్లో తప్పిపోయిన మనస్వి తిరిగి తన చెంతకు చేరడంతో కౌశిక్ మనసు ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది.
అప్పటివరకు అతన్ని చుట్టేసిన మబ్బు తెరలు తొలిగిపోయాయి.