📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Teacher is God : ఆచార్య దేవోభవ 

Author Icon By Abhinav
Updated: December 6, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలభానుడు అప్పుడప్పుడే చిరు చీకట్లను పారదోలడానికి తయారవుతున్నాడు. పక్షుల కిలకిలారావాలు, పొలాలకు వెళ్తున్న పశువుల మువ్వల చప్పుళ్లు తప్ప అంతా నిశ్శబ్దమయం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అప్పుడప్పుడు వీస్తున్న చల్లటి పిల్ల తెమ్మెరలు చక్కటి పైరు వాసనలను సుమధురంగా అందజేసి పోతున్నాయి, ఇంటి ముందట రంగవల్లులు వేస్తున్న సీతమ్మగారు అల్లంత దూరంలో నడిచి వస్తున్న సూర్యం మాస్టారిని చూసి “ఏమండోయ్! మాస్టారు వస్తున్నారు” అంటూ. ఇంటిలోపలికి కేకేసింది. “వచ్చే వచ్చే” అంటూ ఇంటి లోపలి నుండి రాఘవరావు మాస్టారు వచ్చి అప్పటికే అక్కడికి చేరుకున్న సూర్యం మాస్టారిని కలిసి ముందుకు సాగారు. గత పాతికేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న నిత్య కార్యక్రమమిది. సూర్యం మాస్టారు. రాఘవరావు మాస్టారు ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠ పాఠశాలలో లెక్కలు, సైన్స్ ఉపాధ్యాయులుగా ముప్పై యేళ్లు పని చేసి రిటైరయ్యారు పదేళ్ల క్రితం. 

ఉద్యోగాలు చేస్తున్న కాలం నుండే ఇలా పొద్దుటే ఇద్దరు కలిసి ఊరికి కొంచెం దూరంగా ఉండే పొలాలదాకా ఒక గంటసేపు నడుస్తూ వాహ్యాళికి వెళ్లి రావడం అలవాటు చేసుకున్నారు. నడకనే వ్యాయామంగా చేసుకున్న ఆ ఉపాధ్యాయులిరువురు ఆ గంటసేపు నడకతో పాటు లోకాభిరామాయణం, స్కూలు ముచ్చట్లు, పరస్పర కుటుంబ విశేషాలు ఒకరితో ఒకరు పంచుకుని ఆనందించేవారు. ఇద్దరికీ ఏమాత్రం సంకోచం లేకుండా ఒకరినొకరు విమర్శించుకునేటంతటి చనువు, కష్టసుఖాలు పంచుకునే దగ్గరితనం కూడా ఉన్నాయి. సూర్యంగారితో కలిసి కొద్ది దూరం నడిచాక రాఘవరావు అడిగారు “విశేషాలేమిటిరా సూర్యం?” అని. దానికి సూర్యంగారు “కొత్తగా విశేషాలేమీ లేవురా రాఘవా!” అని బదులిచ్చారు. మరికొద్ది దూరం నడిచాక అన్నారు “ఈ విషయం తెలుసురా రాఘవా!” ఈ సంవత్సరం కెమిస్ట్రీ నోబెల్ బహుమతి ముగ్గురికి కలిపి ఇచ్చారట. అందులో ఒక ప్రవాస భారతీయుడు కూడా ఉన్నాడట. బహుమతి ప్రదానం వచ్చే నెలలో ఉంటుందట. 

అదైపోగానే మన భారతీయ ప్రభుత్వం కూడా అతనిని భారతదేశానికి పిలిచి సన్మానిస్తుందట”. ఆ మాటలకు రాఘవరావుగారు “చాలా మంచి వార్త చెప్పావురా సూర్యం. ఎట్టకేలకు మన భారతీయులు కూడా అంతర్జాతీయంగా బాగా రాణిస్తున్నారు. ఇలాగే మన భారతీయులు మరెన్నో బహుమతులు సంపాదించుకోవాలిరా” అన్నారు. ఆ మిత్రులిద్దరూ అలాగే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ తమ నడక సాగించారు. మర్నాదు నడక సాగిస్తున్నప్పుడు సూర్యంగారు అన్నారు. “ఇది తెలుసా రాఘవా? నోబెల్ బహుమతి వచ్చిన ఆ భారతీయుడు మన తెలుగు వాడేనట. మన దేశానికి వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అతనిని సన్మానిద్దామని అనుకుంటోందట”. “అతని పేరేమిటన్నావు?” అడిగాడు రాఘవరావు గారు. “ఆదిత్య వరుట. డిగ్రీ వరకు మన రాష్ట్రంలోనే చదువుకుని, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎమ్మెస్సీ చేసి, ఆ పైన చదువులన్నీ అమెరికాలో చేసి అక్కడే స్థిరపడ్డాడట ఒక ప్రసిద్ధ యూనివర్సి టీలో టీలో ప్రొఫెసర్గా పని చేస్తూ, ఇప్పుడు వచ్చిన నోబెల్ బహుమతి కూడా సహచరులతో కలిసి రసాయన శాస్త్రంలో అతను సాధించిన నూతనావిష్కరణ కోసమాట”. 

“చాలా ఆనందంగా ఉందిరా సూర్యం. ఒక తెలుగువాడికి ఇంత గుర్తింపు రావడం మనందరికీ ఎంతో గర్వకారణమైన విషయం” ఎంతో సంతృప్తిగా అన్నారు రాఘవరావు గారు. కాలగమనంలో మూడు నెలలు ఇట్టే తిరిగిపోయాయి. ఆరోజే ఆదిత్యవర్మని భారత ప్రభుత్వం సన్మానించింది. మర్నాడు రాష్ట్ర ప్రభుత్వం అతన్ని సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ రోజు ఉదయపు వాహ్యాళిలో సూర్యం మాస్టారు చెప్పారు. “రాఘవా! నిన్న మన స్కూలు హెడ్ మాస్టారు వెంకటేశ్వర్లు గారు కనబడ్డారు. మాటల్లో ఆయ ఆయన చెప్పినదేమిటంటే ఆదిత్యవర్మ మన ఊరు. వాడేనట. మన స్కూల్లోనే చదువుకున్నాడట. రేపు రాష్ట్ర ప్రభుత్వ సన్మానం అయిపోయాక మన ఊరికి, ముఖ్యంగా మన స్కూలుకి రావాలని ఉందని తన మనసులోని మాట వ్యక్తపరిచాడట. అందుకోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందట. ఏర్పాట్లు పూర్తవగానే అతని రాక గురించి అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు”. మర్నాటి పొద్దుట నడక మధ్యలో చెప్పారు సూర్యం మాస్టారు “మంచి శుభవార్తరా రాఘవా. 

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సన్మానం అయిపోయాక ఈ రాత్రికి రాష్ట్ర రాజధానిలోనే ఉండి, రేపు పొద్దుటే మన ఊరికి హెలికాప్టర్లో వస్తున్నాడట ఆదిత్యవర్మ. పొద్దున పది గంటలకు టౌన్ హాల్లో పౌర సన్మానం చేస్తారట. ఆ తరువాత మన స్కూల్ చూసి సాయంత్రానికి తిరిగి వెళిపోతాడట. వెంకటేశ్వర్లు గారు మరీ మరీ చెప్పారు.. పదవీ విరమణ చేసిన మనందరినీ తప్పకుండా టౌన్ హాల్ కి రమ్మని, టౌన్ హాల్ నుంచి మనల్ని స్కూల్ కి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు ఆయనే చేస్తానని చెప్పారు”. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజే ఆదిత్య వర్మకి 10 టౌన్ హాల్లో పౌర సన్మానం. సూర్యం మాస్టారు రామన మాస్టారు పొద్దుటే తయారై తొమ్మిదిన్నరకల్లా టౌన్ హాలి కి చేరుకున్నారు. అప్పటికే హాలంతా జనంతో కిక్కిరిసిపోయింది. హాల్లో వెనకగా ఒక మూల రెండు ఖా కుర్చీలు కనబడితే వాటిలో ఆసీనులయ్యారు ఇద్దరూ. సరిగ్గా పది గంటలకు వేద పండితుల ఆశీర్వచనాలు, మంగళ వాయిద్యాల మధ్య జిల్లా కలెక్టరుగారు, ఎమ్మెల్యేగారు, మున్సిపల్ చైర్మనరు ఆహ్వానిస్తుండగా వేదిక మీదకు వచ్చి ఆసీనుడయ్యాడు నోబెల్ బహుమతి గ్రహీత ఆదిత్య వర్మ. ముఖ్య అతిథికి పుష్పగుచ్ఛం సమర్పణ అనంతరం కలెక్టర్గారు, ఎమ్మెల్యేగారు, మున్సిపల్ చైర్మన్గారు, మరెందరో పుర ప్రముఖులు ఆదిత్యవర్మ గురించి, అతని గొప్పతనం గురించి వేనోళ్ల ప్రశంసలు. 

కురిపించారు రసాయన శాస్త్రంలో అతను సాధించిన ఆవిష్కరణల వలన, విజయాల వలన దేశానికొచ్చిన కీర్తి గురించి పదే పదే  పొగిడారు. కలెక్టర్గారు పౌర సన్మానానికి గుర్తుగా ఒక మెమెంటోని ఆదిత్యవర్మకి అందజేశారు. చివరగా నోబెల్ బహుమతి గ్రహీత ఆదిత్య వర్మని తన స్పందనని తెలియజేయమని కోరారు. తన స్పందనని తెలపడానికి ఆదిత్యవర్మ లేచి నుంచుని మైకు అందుకుని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం ప్రారంభించాడు. “సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు. నా స్పందనను తెలియజేసే ముందు ఒక చిన్న కార్యక్రమం పూర్తి చేయవలసి ఉంది. అందుకు మీ అనుమతి లభిస్తుందని భావిస్తూ మన స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారిని కోరుతున్నాను”. అతని మాటలకు వేదికమీదే ఒక పక్కగా కూర్చుని ఉన్న వెంకటేశ్వర్లుగారు తన అనుచరులను పురమాయించి మరో అయిదు కుర్చీలను వేదిక ముందు భాగంలో వేయించారు. ఆదిత్య వర్మ తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు. “ఈరోజు నేను ఇంత ఖ్యాతి సంపాదించుకోగలిగినంటే అందుకు ప్రధాన కారకులు చిన్ననాటే మన పాఠశాలలో నన్ను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, మట్టిలోని మాణిక్యానికి సాన పట్టినట్టు, బండరాయిని ఒక గొప్ప శిల్పంగా చెక్కినట్టు వారు నా మేధస్సుకు పదునుపెట్టి నేనింతగా ఎదగడానికి దోహదమయ్యారు. 

వారికేమిచ్చి నా రుణం తీర్చుకోగలను? ఏమి చేసి నా కృతజ్ఞతలు తెలుపుకోగలను? ఈ రోజు నాకు ఈ సన్మానం జరుగుతుంటే ఏమీ తెలియని సామాన్యుల్లా ఏదో ఒక మూల కూర్చుండి తమకే సన్మానం జరుగుతున్నట్టుగా ఆనందించే మహానుభావులు వాళ్లు. వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ మహానుభావుల్ని ఈ వేదిక మీదకు ఆహ్వానించి వారికి ఉడతా భక్తిగా మీ అందరి సమక్షంలో చిన్న సన్మానం చేయడం నా కనీన కర్తవ్యంగా భావిస్తున్నాను. మొదటగా నాకు సైన్స్ అలు నేర్పిన సైన్స్ మాస్టారు. రాఘవరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే టెక్కలు అలవోకగా అర్థమయ్యేట బోధించిన సూర్యం మాస్టారిని, తెలుగు, ఇంగ్లీష్ బాసలలో నన్ను నిష్ణాతుడిని చేసిన కేశవశాస్త్రి మాస్టారిది, సీతాపతి రావు మాస్టారిని, సాంఘిక శాస్త్రం కూడా దేనికి తీసిపోదన్నట్లు బోధించిన సోమయాజులు మాస్టారిని అందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మహానుభావులందరు ఈ కార్యక్రమానికి వచ్చేటట్లు చేసిన ప్రస్తుత హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నాకు విద్యాదానం చేసిన ఈ గురువులందరినీ మంగళ వాద్యాల మధ్య వేదిక మీదకు తీసుకురావలసిందిగా కోరుతున్నాను”. 

ఆదిత్యవర్మ కోరుకున్నట్లే ఆ అయిదుగురు గురువులను మంగళ వాద్యాల మధ్యన జిల్లా కలెక్టర్గారే స్వయంగా వారిని వేదిక మీదకు తోడ్కొని వచ్చారు. వారిని వేదిక మీద కుర్చీలలో ఆసీనులను చేసి, ఒక వెండ్ పళ్లెంలో వారి కాళ్లు కడిగి పుష్పాలతో పూజ చేశాడు ఆదిత్య వర్మ. అందరినీ బంగారు కడియం తొడిగాడు. ఆనంద బాష్పాలతో మనకు. బారుతున్న కళ్లతో అతనికి తమ  దీవెనలు అందజేశారు పరవశంతో పులకరించిపోతున్న గురువులు. తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు ఆదిత్య వర్మ “ఇక్కడున్న ఈ అయిదుగురు గురువులే కాక నా జీవితంలో వేర్వేరు స్థాయిల్లో ఇప్పటివరకు నాకు బోధనలు చేసిన గురువులందరికీ నా వందనాలు.. అయితే ఈ అయిదుగురు గురువులకు నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వీరు నా ప్రథమ గురువులు. నేను అంకుర దశలో ఉన్నప్పుడు నా చేయి పట్టుకుని మార్గ నిర్దేశం చేసిన ఆచార్యులు వీళ్లు. విద్య మీద ఆసక్తి కలిగించగలిగిన దేవుళ్లు వీరు. 

అటువంటి వీరిని ఈ రోజు పూజించుకోవడంతో నా జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నాను. మరో విషయం.. నా విద్యాభ్యాసంలో మొదటి పదేళ్లు చదివిన మన ఊరి పాఠశాల కూడా నాకు ఒక దేవాలయంతో సమానం. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకు ధన రూపేణా వచ్చిన బహుమతిలో సగం మన పాఠశాల మౌలిక సదుపాయాలు వృద్ధి చేయడానికి వినియోగించదలచాను. మిగతా సగం మూలధనంగా ఏర్పాటు చేసిన దాని మీద వచ్చే ఆదాయంతో మన స్కూల్లో చదివే యోగ్యులయిన విద్యార్థులకు, ఉత్తమ విద్యార్థులకు, ఉత్తమ ఉపాధ్యాయులకు పారితోషికాలు ఏర్పాటు చేయదలచాను. ఆ బాధ్యతను నా అయిదుగురు గురువులకు, మన స్కూల్ హెడ్మాస్టర్ గారికి అప్పజెప్పదలచాను వారు అంగీకరిస్తే”. కరతాళ ధ్వనుల మధ్య తన స్పందన ముగించాడు ఆదిత్య వర్మ. నిర్విరామంగా కారుతున్న కళ్లను మరోసారి తుడుచుకున్నారు సూర్యం మాస్టారు, రాఘవరావు మాస్టార్లతో సహా మిగతా ముగ్గురు మాస్టార్లు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Acharya Devo Bhava Childhood Memories. education emotional reunion Giving Back gratitude Guru Dakshina Inspirational Story Nobel prize Philanthropy Respect for Teachers Role Model School Memories student teacher relationship Success Story Teachers Day Special telugu story Village School

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.