Stories in Telugu : అనగనగా గుండారం ఊరు. ఆ ఊరిలో అసురేశ్, సువర్ణ అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిది ఉత్తమ కుటుంబం. వీరికి రాము(Ramu) అనే కొడుకు ఉన్నాడు. అతడు రెండవ తరగతి చదువుతున్నాడు. రోజు బడికి పోతాడు. సాయంకాలం దోస్తులతో ఆడుకుంటాడు. టైరును కట్టెతో తోలడం, సైకిల్‌తో అటుఇటు తిప్పడం, పాండబ్బ ఆడటం, గోటీలు ఆడటం చేస్తాడు.
రాముకు నాయనమ్మ రేణుక ఉంది. నాయనమ్మ అంటే రాముకు ఎంతో ఇష్టం. సువర్ణకాయలు, పండ్లు నాయనమ్మకు ఇచ్చిరా అనగానే నిమిషంలో ఇచ్చి వస్తాడు. నాయనమ్మ ఇవి తిను అంటాడు. అన్నం తెచ్చి తినుమంటాడు. రోజు నాయనమ్మ దగ్గర కథలు చెప్పించుకుంటాడు. రాముకు సాహసం కథలంటే చాలా ఇష్టం.
సురేష్, సువర్ణ రోజు పొలం పనులకు వెళ్లారు. ఒకరోజు రాము పగలు బడి నుంచి వచ్చాడు. నాయనమ్మ నీళ్లకని వెళ్లి కాళ్లు జారి బావిలో పడింది. అది రాము వస్తూనే చూచాడు. “అయ్యో నాయనమ్మ!” అని అరిచాడు. చుట్టూ ఎవరు లేరు. అప్పటికే బావిలోపల నీళ్లలో పడింది. రాము పరుగుెత్తి ఇంట్లో నుంచి పొడుగు తాడు తెచ్చాడు. తాడుకొన బావిలో విసిరాడు. మరొక కొనపైన కట్టాడు. “తాడును పట్టుకో నాయనమ్మ!” అని అరిచాడు.
ఆమె ధైర్యం కోల్పోలేదు. తాడును గట్టిగా పట్టుకుంది. ఆ అరుపులకు అందరూ జనం గుమికూడారు. “అయ్యో పాపం ముసలవ్వ!” అని కొందరు అంటున్నారు. “ఎంత పని అయిపోయే!” అని మరికొందరు అనుకుంటున్నారు. మంచి ముసలవ్వకు ఇలాంటి ఆపద వచ్చే అని బాధపడుతున్నారు. ఇంతలో కొందరు బావిలోకి దిగి ముసలవ్వను పైకి తీసారు. అందరినీ చూసింది. రామును చూడగానే ఆనందం పొంగింది. ఆత్మస్వైరం వచ్చింది.(Stories in Telugu)
“అయ్యో రాము నాయనా! తాడు వేసి కాపాడావు. నిండా నూరేళ్లు నా ఆయుష్షు కూడా పోసుకొని బతుకు నాయనా!” అని రాముకు దీవెనలు ఇచ్చింది. అందరు రాము తెలివికి, సమయస్ఫూర్తికి, సాహసానికి మెచ్చుకున్నారు.