📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Society is losing something: సమాజం దేనినో కోల్పోతోంది..

Author Icon By Hema
Updated: August 16, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమయం ఉదయం పది గంటలు కావొస్తోంది. భర్త ఆఫీసుకు వెళ్లిపోవడంతో జయంతి వంట గదిలో సామాన్లు సర్దుకొని, వచ్చి హాలులో సోఫాలో విశ్రాంతిగా కూర్చుంది. ముఖానికి పట్టిన చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ.. టీవి రిమోట్ చేతిలోకి తీసుకొని ఆన్ చేసింది.
ఇంతలో కాలింగ్బెల్ మోగడం వినిపించింది.

“ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా!” అనుకుంటూనే లేచివెళ్లి తలుపు తీసింది. ఎదురుగా తన స్నేహితురాలు రమ కూతురు లలిత నవ్వుతూ కనిపించింది. జయంతి ఆనందంతో ఆప్యాయంగా లలిత చేయి పట్టుకొని లోపలకు తీసుకు వస్తూ తలుపుమూసింది. లలితను సోఫాలో కూర్చుండమని చెప్పి ఫ్రిజ్ వద్దకువెళ్లి డోరు తెరిచి చల్లటి నీళ్లను (water) గ్లాసులో నింపి, తెచ్చి లలితకు అందించింది. లలిత గ్లాసు అందుకొని కొద్దిగా తాగి, టీపాయ్పై ఉంచింది.

ఏమమ్మా! లలిత అంతా బాగున్నారా? నీవు గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నావని మీ అమ్మ చెప్పింది! నిజమేనా? మరి ఎలా చదువుతున్నావ్? సాధించాలంటే
చాలా కష్టపడాలి మరి! ఆల్టి బెస్ట్!” అంటూ లలితను అభినందిస్తూ, జయంతి లేచి కిచెన్ వైపుకు వెళ్లింది. ఒక ప్లేటులో స్వీటు (sweet) కొన్ని బిస్కెట్లు ఉంచి, తీసుకు వచ్చి లలిత ముందు టీపాయ్పై
ఉంచుతూ, “తీసుకోమ్మా!” అంటూ లలిత పక్కనే కూర్చుంది. “ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ!” అంటూనే తీసుకొని తినడం మొదలు పెట్టింది లలిత. రమతో కలిసి గడిపిన తమ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ, సంబరపడిపోతూ జయంతి, తమ అనుభవాలను చెప్పుకుంటూ పోతుంటే, లలిత ఆమెనే చూస్తూ ఆసక్తిగా వింటోంది. తినడం పూర్తి చేసి, కొద్దిగా నీళ్లు తాగి, గ్లాసు టీపాయ్పై ఉంచుతూ, జయంతి ఇచ్చిన నేప్కిన్తో చేతులు తుడుచుకుంటూ ఆంటీ! ఎల్లుండి మమ్మీ ఇంట్లో ఏదో వ్రతం చేయాలని అనుకుందిట.

ఆ వ్రతానికి మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నానని మరి మరీ చెప్పమని నన్ను పంపించింది. నిజానికి, మమ్మీనే స్వయంగా మిమ్మల్ని పిలవడానికి రావాలని అనుకుందిట కాని.. పనుల ఒత్తిడి వల్ల కుదరలేదని చెప్పమంది. ‘అందుకు ఏమీ అనుకోవద్దని
చెప్పమంది. అందుకే నేను వచ్చాను” అంది లలిత. జయంతి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ.. “వ్రతానికి కాకపోయినా, మీ మమ్మీని చూసేందుకైనా తప్పకుండా వస్తాను” అని చెప్పు. “చాలా రోజులైంది. రమను చూసి” అంటూ లలిత పక్కనే సోఫాలో కూర్చుంది.లలిత తన ఫోన్ తీసింది క్యాబ్ బుక్ చేసేందుకు.జయంతి వసూ ఎవరికమ్మా ఫోన్అంటూ?” లలిత పక్కనే సోఫాలో కూర్చుంది. లేదంటీ! క్యాబ్ కోసం ఫోన్ చేస్తున్నాను” అంది లలిత.

ఆ మాట విన్న జయంతి, “వద్దమ్మా! ఫోన్ చేయొద్దులే. మా కారులో నిన్ను దిగవిడుస్తానులే! నాకూ చిక్కడపల్లి పోవాల్సి ఉంది… మా బంధువుల ఇంటికి, మా కారులో పోదాం ఉండు. అయిదు నిమిషాల్లో రడీ అవుతాను”అంటూ తన బెడ్ రూమ్లోకి వెళ్లి ముస్తాబై హేండ్బ్యాగ్ బయటకు వచ్చింది.

లలితా! పదమ్మా! వెళదాం!” అంటూ లలితతో పాటు బయటకు వచ్చి, ఇంటికి తాళం వేసి, కీ తన హేండ్బ్యాగ్ వేసుకొని, కారు వద్దకు నడిచింది. కారు డోరు తెరిచి, సీట్లో కూర్చుని కారును స్టార్ట్ చేసి
ఎసిని ఆన్ చేసింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, “లలితా!” అంటూ పిలిచి డోర్ తెరిచింది.
లలిత కారులో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంది.

జయంతి కారును ముందుకు పోనిస్తూ..
రమతో తన పరిచయం, కాలేజీలో ఆనందంగా గడిపిన రోజులు గుర్తు చేసుకుంటూ,
ముచ్చటిస్తుంటే లలిత వింటూ ఆనందిస్తోంది. ఇంతలో లలిత ఫోన్ మోగింది. అటు ఫోన్లో
లలిత తండ్రి సుధాకర్ మాట్లాడుతున్నాడు. చిన్నగా మాటలు జయంతి చెవిలో
పడుతున్నాయి. “అమ్మా లలితా! ఇంటికి బయలుదేరావా? క్యాబ్ బుక్ చెయ్యమంటావా?”
అని అడుగుతుంటే.. లేదు డాడీ! ఆంటీనే తన కారులో నన్ను ఇంటికి దిగవిడుస్తానన్నారు. చిక్కడపల్లిలో వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లాల్సిన పని ఉందిట తనకు. అందుకే తన కారులోనే
వస్తున్నాను! కాసేపట్లో ఇంటికి చేరుకుంటాం!” చెప్పింది లలిత. “అలాగా! సరే! ఆంటికి భోజనం ఏర్పాట్లు చూడండి. ఆంటీని అడిగానని కూడా చెప్పు” అంటున్నాడు.

సుధాకర్. వింటున్న జయంతి చిన్నగా నవ్వుకుంది. ఫోన్ ఆఫ్ చేస్తూ “ఆంటీ! డాడీ ఫోన్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని భోజనం చేసి మరీ వెళ్లమంటున్నారు. నవ్వుతూఅంది లలిత. జయంతి నవ్వింది. కొద్ది నిమిషాల్లో కారు రమ ఇల్లు చేరుకుంది. కారు పక్కకు తీసి, ఇంజిన్ ఆఫ్చేసి, డోరు తెరిచి జయంతి కిందకు దిగుతుంటే “అప్పుడే కారు దిగిన లలిత జయంతి దగ్గరకు వచ్చి “థ్యాంక్స్ఆంటీ.. బై” అంటూ చేతులు ఊపుతూ తమ ఇంటి వైపు పోసాగింది. ఊహించని ఆ ఘటనకు జయంతి నిర్ఘాంతపోయింది.

ఆమె మెదడు పనిచేయడం మరిచిపోయింది. తేరుకున్న ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ‘సమాజం దేనినో కోల్పోతోంది’ అని స్వగతంలో అనుకుంటూ
ప్రశాంతంగా కారు డోరు మూసి, సీట్ బెల్ట్ పెట్టుకొని, స్టార్ట్ చేసి నెమ్మదిగా చిక్కడపల్లి వైపు కారును పోనిచ్చింది!

Read also:hindi.vaartha.com


Read also:

https://vaartha.com/gold-treasure-in-well/kids-stories/530526/



friendship HumanBonding LifeStories SOCIETY Values

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.