Self Effort:జక్కిదొనలో జయరామయ్య అనే కూలీ వుండేవాడు. అతని కొడుకు బాగా చదివి మంచి అందరి కంటే ఎక్కువ మార్కులు పొందేవాడు. కొడుకు పట్టుదల చూసి తండ్రి ఉప్పొంగిపోయేవాడు.
జయరామయ్య పక్కింట్లో వున్న పరంధామయ్య కొడుకు (son) కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడు. పరంధామయ్య చాలా మోతుబరి. అతని కొడుకు ప్రశాంత్ బాగా చదివేవాడు కాదు. మార్కులు చాలా తక్కువ వచ్చేవి.
దీనితో కొడుకును తిట్టేవాడు పరంధామయ్య. ప్రశాంత్ తన ఎదురింటి జశ్వంత్ కన్నా మార్కులు బాగా తెచ్చుకుని తండ్రి వద్ద ప్రశంసలు పొందాలనుకున్నాడు. అందుకు చదువుపై తగిన శ్రద్ధ పెట్టలేదు. అయితే తన వద్ద వున్న డబ్బును (money) ఎరగా చూపి మార్కులు పొందాలనుకున్నాడు.
పరీక్షల్లో ప్రశాంత్ కన్నా మార్కులు ఎక్కువగా పొందే గిరితో జతకట్టాడు. డబ్బులు ఇచ్చి పరీక్షల్లో రహస్యంగా సమాధానాలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉపాధ్యాయులను నివ్వెర పరిచేవాడు.
ప్రశాంత్ “అక్రమ మార్గంలో అందరి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం పెద్ద గొప్పేం కాదు అది తగదు. స్వయంకృషితో మార్కులు సాధించి మెప్పు పొందడం ఉత్తమం” అని జశ్వంత్ హితవు పలికేవాడు. బాగా చదివే జశ్వంత్ చదువులో వెనుకబడటం చూసి ఉపాధ్యాయులు “స్వయంకృషితో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకో” అని మందలించసాగారు.
అది చూసి “నేను గొప్పగా చదవకపోయినా మంచి మార్కులు తెచ్చుకుని నీకు అవమానం తెప్పించాను చూడు..” అని అవహేళన చేశాడు ప్రశాంత్.
జశ్వంత్ తను నమ్ముకున్న స్వయంకృషితోనే పదో తరగతిలోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత చదువులు చదివాడు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగానికి వెళ్లాడు. బాగా చదవడం వల్ల సొంత తెలివితేటలతో ఇంటర్వ్యూలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బ్యాంకు మేనేజరు ఉద్యోగం పొందాడు.
అదే ఉద్యోగానికి వెళ్లిన ప్రశాంత్ తను ఏమీ చదవకపోవడం వల్ల ఇంటర్వ్యూలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశాడు.
తను ఇచ్చిన లంచం వల్ల పని కాలేదు. తరువాత కూడా ఎన్ని పరీక్షలకు వెళ్లినా ఏ ఉద్యోగానికి ఎంపిక కాలేదు. మంచి మార్కులు తెచ్చుకున్నా విజ్ఞానం లేక రాణించలేకపోయాడు. జశ్వంత్ అపరిమిత జ్ఞానంతో కష్టపడి చదివి ప్రమోషన్లు పొందుతూ బ్యాంకు డైరెక్టరు స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు.
Read also:hindi.vaartha.com
Read also: