📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Raindrops of Thought:మేఘపు చినుకులు

Author Icon By Hema
Updated: August 4, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Raindrops of Thought:ఆనందరావు విశాలమైన పార్కులో కూర్చున్నాడు. అక్కడ అడుకుంటున్న పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. బాధ్యతలు తీరిన ఆలుమగలు అక్కడక్కడ బెంచీకి ఇటొకరు అటొకరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిని చూసి “అదృష్టవంతులు.. పైవాడి దయకు పాత్రులు” స్వగతంలో అనుకుంటూ జేబులోంచి పర్సు తీసాడు. భార్య ఫొటో కొన్ని క్షణాలు చూసి.. “నీ వద్దకు రావడానికి ఇంకెన్నాళ్లో?” అని బాధగా అనుకున్నాడు.

“వేడి వేడి పల్లీలండి! పదికి గుప్పెడు”. తినాలనుకున్నాడు. పర్సు తీసాడు. చిన్న నోట్లు లేవు. ఆరోగ్యం గుర్తు వచ్చింది. “తింటే రుచికరం. కఫం చేస్తుంది. విపరీతమైన దగ్గు వస్తుంది. రాత్రిపూట అందరికీ ఇబ్బందే! ఆస్మాతో ఊపిరి తీసుకోవడం కష్టం!” కోరిక బలహీనపడింది.

పార్కులోంచి బయటకు వచ్చేసాడు. మిక్చర్లు, చెరుకు రసాలు, ఐసు ఫ్రూట్లు, మామిడి (mango) పండ్లు, జామ కాయలు, పకోడీలు, పునుకులు, ఉడకబెట్టిన శనక్కాయలు.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాహనదారులు ఆగి మరీ వాటిని తింటున్నారు. మిరపకాయ బజ్జీలు చూసి నోరూరింది రావుకి. పెద్ద మూకుడులో సలసల కాగుతున్న నూనె (oil) చూసి “ఎన్నాళ్ల నుంచి ఈ నూనె వాడుతున్నాడో?” అనుకుంటూ ముందుకు కదిలాడు.

చెరుకు రసం ఐసు లేకుండా ఓ గ్లాసు తాగేడు. ప్లాస్టిక్ కవర్లలో చిన్న చిన్న పానీపూరీలను, కుండలోని ద్రావకం చూసి “నీళ్లు కూడా ఎన్నాళ్లవా? అందరూ ఆలోచించకుండా అంత ఇష్టంగా ఎలా తింటున్నారు!?” అని ఆశ్చర్యపోతూ ముందుకి నడిచాడు.

“అయ్యగారూ నమస్కారమండీ! జామపళ్లు బాగున్నాయి” — ఒక కేజీ తీసుకున్నాడు. మామిడిపళ్లు దగ్గర ఆగాడు. “నమస్కారం సార్! న్న ఇవి చెట్టు పండ్లండి! తియ్యని బంగిన మామిడి పళ్లండి!” అంటూ పక్కన ఉన్న గంపపై గుడ్డ తొలగించాడు.

పళ్లు తాజాగా ఉన్నాయి. బండివాడు రావుకి బాగా ‘రుకులు’ తెలుసు. వాడి భార్య రావు ఇంటిలో పనిమనిషి.

“అయ్యగారూ! మీరు స్టూలుపై కూర్చుని, ఈ పండు ముక్క తిని చూడండి. బాగుంటేనే తీసుకోండి” వాడి మాటలు రావుని ప్రభావితం చేసాయి. స్టూలుపై కూర్చున్నాడు. తినడానికి సందేహిస్తున్నాడు.

“ఏంటయ్యాగారూ! తినడం లేదు! మీలాగ మా నాన్నకూ షుగరుంది. అయితే అన్నీ కొంచెం కొంచెం తింటున్నాడు. టైముకి మాత్రం టంచనుగా మాత్రలు మింగుతాడు”. వాడి మాటలు విన్న రావుకి డాక్టరు గారి మాటలు గుర్తు వచ్చాయి.

“సీజన్లలో వచ్చే అన్ని పండ్లు మితంగా తినవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది”

“ఏంటి సార్! ఇంటికాడ మీరు తింటారో.. లేదో? ఈ నాలుగు చిన్న ముక్కలను కూడా తినండి” అంటూ కాగితంలో పెట్టి రావు చేతిలో పెట్టాడు బండివాడు.

రావు తృప్తిగా తిన్నాడు. “మంచివి రెండు కేజీలు మీ పిల్లాడి చేత ఇంటికి పంపించు” అంటూ రావు డబ్బులు ఇచ్చాడు బండివాడికి.

“అందరూ తనలా ఆలోచిస్తే ఈ వ్యాపారస్తులు ఎలా బతుకుతారు? చరమాంకపు దశలో తనిలా ఆలోచిస్తున్నాడుగానీ, వయసులో ఉన్నప్పుడు తనూ అందరిలానే రోడ్లపై అన్నీ తిన్నాడు. తనలాంటి వారి ఆలోచనలు మహా సముద్రంలో మేఘపు చినుకులే!” అనుకుంటూ రావు ఇంటి వేపు అడుగులు వేసాడు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/fearful-businessman-reacts-in-crisis/kids-stories/525701/

emotional-moments life-lessons old-age-thoughts reflection wisdom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.