Power of Forgiveness: అప్పాజిపేట అనే గ్రామంలో రామచంద్రుడు, అతని భార్య సరోజన నివసించేవారు. వారు ఎంతో అన్యోన్యమైన ప్రేమజంట. బతకడానికి ప్రతిరోజూ కూలిపనికి పోయేవారు. పెళ్లి అయిన కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా సంసారం సాగించేవారు. కొద్ది కాలానికి ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు (children) కలిగారు.
పని చేయగా వచ్చిన డబ్బులతో అతి కష్టం మీద పిల్లల్ని పోషిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు.
పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. దీనికితోడు భర్త రామచంద్రుడు కష్టాల ఒత్తిడి(stress)
పెరగడంతో తాగడానికి అలవాటు పట్టాడు. ఆ భార్యాభర్తలకు రోజు రోజుకు కుటుంబాన్ని పోషించడం తలకు మించిన భారమైంది. ఈలోగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎడబాటు తడబాటుగా ఉంటున్నారు. భర్త రామచంద్రుడు పట్టీపట్టనట్లుగా ఉంటున్నాడు. భార్య సరోజనపై కుటుంబ భారం పడింది. ఇద్దరూ తరచుగా తగవులాడుకోవడం సాధారణమైంది.
సఖ్యత లేక పిల్లల్లోకాడ, తండ్రికాడ, తల్లోకాడ వేరు వేరుగా పడుకోవడం జరిగేది. తల్లిదండ్రుల పోరు భరించలేని పిల్లలు దిక్కులేనివారయ్యారు. పరిస్థితి చేయి దాటడంతో వేరు వేరుగా ఉంటున్నారు. పిల్లల బాధ్యత అప్పుడప్పుడు తల్లి చూసుకునేది.
ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఒకరోజు రామచంద్రుడు తన ఇంటి ఆవరణలో నివసిస్తున్న పక్షుల జంటను చూశాడు.
అవి ఎంతో ప్రేమతో కలిసి మెలిసి ఉంటున్న పరిస్థితిని చూశాడు. అంతేకాకుండా గూటిలోని తమ పిల్లపక్షులకుఆహారాన్ని అందిస్తున్న సంగతి గమనించాడు. శ్రీరామచంద్రుడి మనసులో ఏదో తీరని వెలితి అనిపించింది. మాటలు లేని పక్షులు ఎంతో అల్లారుముద్దుగా ఉంటున్న తీరు చూసి సిగ్గుపడ్డాడు.
Power of Forgiveness: భార్య దగ్గరికి వెళ్లి క్షమించమని కోరాడు. ఇకనుండి తాగడం మానేస్తానని, ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి స్వస్తి పలుకుదామని, ఇకనుండి మన పిల్లల్ని ప్రేమగా చూసుకుందామని ఇద్దరూ అనుకున్నారు.
ఇక అప్పటి నుండి ఆ దంపతులిద్దరూ మళ్లీ పోట్లాడకుండా ఎంతో చక్కగా ఉంటూ పిల్లల్ని చక్కగా చదివిస్తూ జీవనం సాగించారు. తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుకు ఆ పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. ఇరుగు పొరుగువారు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
Read also:hindi.vaartha.com
Read also: Trust: నమ్మకం