📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Moral Values Story : తాత మనవడు

Author Icon By Madhavi
Updated: July 4, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Moral Values Story: పద్మిని, రమణలకు పెళ్లయి ఐదు సంవత్సరాలయింది. వారి ముద్దుల కొడుకు సాకేత్, మూడేళ్ల సాకేత్ తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన ప్రేమానురాగాలు అల్లుకున్నాయి. హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి పెనుతుఫాన్ చెలరేగింది.

తాత, మనవడి మధ్య అనురాగ బంధాన్ని చూసిన పద్మని తట్టుకోలేకపోయింది. ఎక్కడ తన కొడుకు తనకు దూరం అవుతాడోనని మదనపడసాగింది. ఆమె ముఖంలో వున్న ప్రశాంతత స్థానంలో కోపం చోటు చేసుకుంది. రాను రాను తాతే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. “ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. మన కొడుకును దూరం మనకు చేస్తున్నాడు” అని వేరు కాపురం పెట్టడానికి రమణ పైన ఒత్తడి. పెంచింది.

తాత రఘురామయ్య అంటే సాకేతకి వల్లమాలిన ప్రేమ, భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్థులు కావడం వలన వారి నదుమ సాకేత్ గడిపే సమయం చాలా తక్కువ. అందుకే తల్లిదండ్రుల కంటే తాతయ్య దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడు. ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే బంధం ప్రత్యేకమైనది. ఎందుకంటే వారు మన సంస్కృతీ (Culture) సాంప్రదాయాలను, విలువలను తెలియజెప్పి, తమ జీవితానుభవంతో మనిషిగా ఎలా మసలుకోవాలో చెబుతారు. వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో తాతకు ఎక్కడలేని శక్తిని ఇవ్వగలుగుతాడు మనవడు.

రమణకు భార్య మాటే వేదం.

Moral Values Story: ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాడిని చేసి వేరు కాపురం పెట్టారు. ఎంతో అన్యోన్యంగా వున్న తాత, మనవాడ్ని వేరు చేశారు. తాత-మనవల బంధం శాశ్వతమే కానీ, వాడితో కలిసుండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు.

పక్క మీద వాలినా నిద్ర రావడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు కందిరీగల్లా రఘురామయ్యను చుట్టుముట్టాయి. పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదా? ఆక్రోశించింది మనస్సు, గుండె చెరువయ్యింది. ఆయన కళ్లల్లో నీళ్లు తెరలు కట్టాయి. పెద్దలంటే గౌరవం లేదు.

కుటుంబ సభ్యులను ప్రేమగా పలకరించాలనే ఇంగింత జ్ఞానం లేదు. తల్లిదండ్రులను నిరక్ష చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి. పెళ్లికాక ముందు పులిగా ఉండే కొడుకు, భార్య రాగానే పిల్లిలా మారిపోయాడు. భార్య ముందు నోరెత్తటం మానేసి, బుద్ధిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకున్నాడు.

తన గురించి తాను పట్టించుకోకుండా తన వారసుడి సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య, సకల భోగాలు తన వారసుడికి అందించి తను మాత్రం సాధారణ జీవితం గడవసాగాడు. చిన్నప్పుడు కన్నకొడుకుతో ఆడుకుని, వాడు అడుగులు వేస్తే ఆనందించే తను.

ఈ వయసులో తన కొడుకు చేయూత ఇవ్వనం ఇవ్వనంటున్నాడు. కన్నకొడుకు సహకరించకపోయినా దిగులు సహకరి పడకూడదనుకున్నాడు. అయితే తన ప్రాణమైన మనవడు దూరం కావడంతో ఇబ్బంది పడసాగాడు. ప్రతి నిమిషం వాడి గురించే ఆలోచిస్తూ, ఆదుర్దా పడుతూ మానసికంగా కుంగిపోయాడు.

మనవడిని చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికెళ్లాడు.

Moral Values Story: అమ్మా లోపలికి రావచ్చా?” నీళ్లు నిండిన కళ్లతో రఘురామయ్య అరగడంతో, దారికి అడ్డుగా ఉన్న పద్మిని పక్కకు తప్పుకుని మామగారిని లోపలికి రమ్మంది. రఘురామయ్య లోపలికి రాగానే “మామయ్యా..! నన్ను క్షమించండి” అంటూ ఆయన కాళ్ల మీద పడి ఏడ్చేసింది పద్మిని. ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరింకేదైనా కారణం ఉందో రఘురామయ్యకు అర్ధం కావడం . మనసులో భారం తగ్గేదాకా ఏడ్వసాగింది కోడలు పద్మిని. రఘురామయ్యకు ఏమీ అర్ధం కాకపోవడంతో బెడ్ రూంలో పడుకుని వున్న మనవడి దగ్గరకి వెళ్ళాడు. సాకేత్ అస్థిపంజరంలా మూసిన కళ్లు మూసినట్లే బెడ్ మీద పడి ఉన్నాడు. ఆ స్థితిలో మనవడ్ని చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చిందు. “సాకేత్, నాన్నా సాకేత్ అంటూ పిలుస్తుంటే, ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి.

తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు. తాతను చూడగానే పెదవుల పైన చిరునవ్వు మెరిసింది. ఎక్కడలేని శక్తిని తెచ్చుకుని తాతను అల్లుకుపోయాడు. దుఃఖం ఎగదన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ తాతను వదలలేదు. అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఆ గదిలో మనుషులు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఏవో తెరలు అడ్డు పడుతున్నాయి. “నాన్న..! సాకేత్ ఇలా

కావడానికి పద్మిని తొందరపాటే కారణం. మనోవ్యాధికి మందు లేదని సాకేత్ విషయంలో రుజువయింది. మమ్మల్ని క్షమించండి నాన్నా! ఈరోజే మనింటికి వెళ్లాం” తన మనసులోని ఆవేదనను తెలియజేశాడు రమణ.

కొడుకు, కోడలులో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య. వారం రోజుల్లో పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యాడు సాకేత్.

Read Also: AP& TS water disputes: పెరుగుతున్న జల వివాదాలు

#EmotionalStory #FamilyBond #FamilyEmotions #GrandfatherAndGrandson #IndianCulture #LifeLessons #MoralValues #ParentingLessons #RespectElders #TraditionalValues Google News in Telugu Latest News in Telugu Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.