📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Moral stories : కుక్కకాటుకి చెప్పుదెబ్బ

Author Icon By Abhinav
Updated: December 2, 2025 • 2:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పూర్వం బండి ఎల్లయ్య అనే రైతు ఉండేవాడు. బండి ఎల్లయ్య చదువు రానివాడు.  వ్యవసాయం తప్ప ఏమాత్రం లోకజ్ఞానం లేని అమా యకుడు. బండి ఎల్లయ్యకు రంగయ్యశెట్టి అనే మిత్రుడు ఉండేవాడు. రంగయ్యశెట్టి, బండి ఎల్లయ్య జరుగు-పొరుగు ఇళ్లల్లో వుండేవారు. బండి ఎల్లయ్య వ్యవసాయం మీద వచ్చిన సంపాదనను దాచి భద్రంగా ఉంచమని, పొరుగు నున్న రంగయ్యశెట్టికి ఇచ్చేవాడు. రంగయ్యవెట్టి మొదట్లో ఎల్లయ్యకు తన మీద వున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా కచ్చితంగా లెక్కలు చెప్పేవాడు. అంతేకాదు, తన దగ్గర ఎల్లయ్య సంపాదనంతా వుంచి నందుకు కొంత మొత్తాన్ని అదనంగా వడ్డీ కింద ఇచ్చి ఎల్లయ్య సంపాదనను పెంచేవాడు. సంపాదనైతే పెరుగుతుంది కానీ దాన్ని ఎప్పుడూ వినియోగించుకునే వాడు కాదు ఎల్లయ్య. “నీ సంపాదనంతా లెక్కకు మించి ఎక్కువ అయిపోయింది. ఇప్పటికైనా దాన్ని తీసుకొని వినియోగించుకో. నీవు ముసలివాడివి అయి పోతే అప్పుడు నువ్వు సరదాగా ఖర్చు చేద్దామనుకు న్నా నీకు ఓపిక ఉండదు” అని హితబోధ చేసేవాడు రంగయ్యశెట్టి. “నేను సంపాదన అంతా నా పిల్లలకోసం దాచి పొదుపుగా వుంచుకుంటున్నాను. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నీ దగ్గర వున్న నా సంపాదన అంతా ఇద్దువుగానిలే. “అని రంగయ్య మీద పూర్తి నమ్మకంతో అనేవాడు ఎల్లయ్య.

ఎల్లయ్య మాటలకు రంగయ్యశెట్టి పగలబడి నవ్వుతూ “పిచ్చివాడా! నీకు ఇంకా పెళ్లే కాలేదు, పిల్లలంటావు, వాళ్లకు సంపాదన ఇస్తానంటావు. అంతా విచిత్రంగా – వుంది. నీ వెర్రిగానీ.. లేని పిల్లలకు నీ సంపాదన – ఇవ్వడమేంటి? నీ చాదస్తం కాకపోతే” అని హేళన – చేసేవాడు రంగయ్యశెట్టి. రంగయ్య మాటలకు తాను ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఎల్లయ్య అమాయకంగా చిరునవ్వునే సమాధానంగా ఇచ్చేవాడు. కొన్నాళ్లకు ఎల్లయ్య సంపాద నను మోసం చేసి తానే కైవసం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది రంగయ్యకు. ఎల్లయ్యకు పెళ్లి జరిగి, పిల్లలు పుడితే అతని సంపా దన అంతా తీసుకుంటాడని దురాలోచనతో ఎల్లయ్యకు నచ్చచెప్పి “నీకు ఇప్పటికే పెళ్లివయసు దాటిపోయింది. గినా పిల్లలు ఇక నీకు పెళ్లి పుట్టరు. అందుకే నాకున్న ఇద్దరు కొడుకుల్లో ఒకడ్ని నీకు దత్తత ఇస్తాను, పెంచుకో” అని సూచన ఇచ్చాడు రంగయ్యశెట్టి. అమాయకుడైన ఎల్లయ్య రంగయ్యశెట్టి చిన్న కొడుకుని పెంచుకున్నాడు. రంగయ్య కొడుకుని పెంచి పెద్ద చేసిన ఎల్లయ్య తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన పెంపుడు కొడుక్కి ఇచ్చేమని అడిగాడు రంగయ్యశెట్టిని.

రంగయ్య అధిక తెలివితో ఆలోచించి ఎల్లయ్యకు “ఇంకా ఎక్కువ కాలం కష్టపెట్టి ఎక్కువ సంపాదన కూడబెట్టిం చి, తన చిన్న కొడుక్కి ఎక్కువ ఆస్తిని సమకూర్చి పెట్టాలని, తరువాత ఎల్లయ్య మరణాననంతరం దాన్ని తన ఇద్దరు కొడుకులకు వంచి పెట్టాలని చూసి “ఎల్లయ్యా! నీకు చెప్పడం మర్చిపోయాను. నీ సంపాద న అంతా మా ఇంటి పెరట్లో గొయ్యి తీసి దాచిపెట్టేవా డిని. ఆ గొయ్యికి ఆకలి ఎక్కువై నీ ఆస్తిని తినేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నీకు వయసు, కండబలం వుంది కాబట్టి ఇకపై సంపాదన నాకు ఇస్తే నా అటక మీద పెట్టి భూమి నోటికి అందకుండా జాగ్రత్తగా ఉంచుతాను. నీ పెంపుడు కొడుకు కోసం ఇకపై కూడా బాగా కష్టపడు” అన్నాడు నక్క వినయాలు నటిస్తూ, వారం రోజుల తరువాత ఇంటికి వచ్చి రంగయ్యశెట్టి ముందు బోరున ఏడ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నీకు వయసు, కండబలం వుంది కాబట్టి ఇకపై సంపాదన నాకు ఇస్తే నా అటక మీద పెట్టి భూమి నోటికి అందకుండా జాగ్రత్తగా ఉంచుతాను.

నీ పెంపుడు కొడుకు కోసం ఇకపై కూడా బాగా కష్టపడు” అన్నాడు నక్క వినయాలు నటిస్తూ, వారం రోజుల తరువాత ఇంటికి వచ్చి రంగయ్యశెట్టి ముందు బోరున ఏడ్చాడు. “ఏమైందని?” రంగయ్య అడగగా- “ఏం చెప్పమంటావు రంగయ్యా! నా పెంపుడు కొడుకుని ఆకాశం ఎత్తుకుపో యింది. దానికి పది కోట్ల రూపాయలు ఇస్తే తప్ప వాడిని వదిలిపెట్టనని భీష్మించుకొని కూర్చుంది” అని నెత్తీ నోరూ బాదుకున్నట్లు నటించాడు. “అమ్మో! డబ్బుకోసం ఆశపడితే చివరకు నా చిన్న కొడుకే నాకు దక్కేటట్లు లేడు, ఎల్లయ్య అమాయకుడు కాదు, మహా దేశముదురు” అనుకుంటూ “అయితే ఎల్లయ్యా! ఆ ఆకాశాన్ని తొందరపడి మనవాడికి కీడు చెయ్యవద్దని చెప్పు. నేను భూమిని ఒప్పించి నీ ఆస్తిని కక్కించి నీకు తెచ్చిస్తాను” అని రెండు రోజుల తరువాత ఎల్లయ్య ఆస్తిని నయాపైసలతో సహా లెక్కించి ఇచ్చేసాడు రంగయ్యశెట్టి. ఆ విధంగా ఎల్లయ్య తన డబ్బును తిరిగి పొందాడు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cleverness Deception Folktales friendship Greed Humor Justice moral stories Paper Telugu News telugu stories Tit for Tat Village Life Wit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.