📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లేడీస్ గ్రేట్

Author Icon By Abhinav
Updated: November 28, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

“క్రిష్! నేను రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను. ఎలాగోలా ఇవాళ, రేవు పిల్లలిద్దర్శి బడికి పంపించు చంటిదానికి స్నానం చేయించి తుడిచి పౌడరు పూసి బట్టలు తొడిగి పాలు పట్టించు” అంది ఆటోలో కూర్చొని మేనేజరు హోదాతో కంప్యూటరు ముందు కూర్చొని పాతిక మందిని సంభాళించేవాడ్ని ఈ పన్ని నాకేమాత్రం? అనారోగ్యంతో బాధపడుతున్న మీ నాన్నను చూసుకొని రేపు రాత్రికల్లా వచ్చేయ్. నేను కూడా పిల్లల సంరక్షణంటూ రోజూ నువ్వు చేస్తున్న గ్రామాలేమిటోనన్నది ఈ రెండు రోజుల్లో తేల్చుకుంటాను” అన్నాడు. వ్యంగ్యంగా క్రిష్ ఫక్కున నవ్వింది పూజ. “అలాగా! అంటే నేను రోజూ పిల్లలతో వేగుతోంది. డ్రామాలా? అయితే ఆ డ్రామాలేమిటో మీకూ తెలుస్తాయిలే!” అని అంటుండగా ఆటో కదిలింది.

రెండు, నాలుగు క్లాసులు చదువుతున్న రష్మి, తన్విలిద్దరూ తల్లికి టాటా చెపుతుంటే క్రిష్ చంకలో వున్న సంవత్సరం చంటిది ఆటో వెళుతున్న వేపే చూస్తూ వుంది.

క్రిష్, పూజ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూడాలని పూజ పుట్టింటికి వెళ్లటంతో భర్త క్రిష్కు రెండు రోజుల పాటు పిల్లలను చూసుకోవటం తప్పనిసరైంది. పూజ ఊరికి బయలుదేరక మునుపే స్నానపానాదులను ముగించుకొని యూనిఫాం వేసుకొని తయారై వున్న పెద్ద పిల్లలిద్దరూ వరండాలో వున్న బెంచీలో కూర్చొని కోసం ఎదురుచూస్తూ స్కూలు వ్యాను కోసం వున్నారు.

ఈలోపు చంటిదాన్ని ఊయలలో వేసి కిచన్లోకి వెళ్లి పాలను కలుపుకొని నోటికి అందించాడు చంటిది ఆమ్.. ఫీడింగ్ బాటిల్లో పోసి తెచ్చి చంటిదాని ఆమ్ అంటూ పాలు తాగుతుండగా స్కూలు వ్యానొచ్చి ఆగింది.

పెద్ద పిల్లలిద్దరి భుజాలకు బ్యాగులను తగించి వ్యానెక్కించాడు క్రిష్. గబగబ చంటిదాని వద్దకెళ్లి చూశాడు. నిమిషాల్లో పాలను తాగిన చంటిది నిద్రలోకి జారుకుంది. ఫీడింగ్ బాటిల్ ను పక్కకు తీసి గుడ్డతో నోటిని తుడిచి “ఓష్! ఈ మాత్రానికే ఎంత బిల్డప్ ఇస్తుందో ఈ ఆడది” అనుకొంటూ అక్కడే వున్న సోఫాలో కూర్చున్నాడు క్రిష్. ల్యాప్టాప్ల్ను ముందేసుకొని. ఆ రోజు అలా ఈజీగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకల్లా అలారానికి బదులు ఉయ్యాల్లో వున్న చంటిదాని ఏడుపు క్రిష్ను నిద్ర లేపింది. నిద్ర నుంచి మేల్కొన్న తను చంటిదాని వేపు చూశాడు. అప్పటికే ఊయలలో ఒకటికీ, రెంటికి వెళ్లిన చంటిది డైపర్ లేని కారణాన అది కాస్తా వొంటికి పూసుకొని రోతగా కనబడింది క్రిష్కు. వెంటనే  బాత్ డైవర్, గౌనుతో పడుకోబెట్టి రూంకు తీసుకెళ్లి శుభ్రం చేసి తుడచి కొత్త  కడుక్కొని వచ్చి హోం వర్కు చేసుకొన్న చదువుకోండి. ఈలోపు పాలు తెస్తాను” అంటూ స్కూలు బాగుల్ని వాళ్ల ముందుంచి కిచెన్లోకి వెళ్లాడు క్రిష్. తనకు కాఫీ పెట్టుకొని తాగి పిల్లలకు పాలు తీసుకొని గదిలోకి వెళ్లి చూస్తే అక్కా చెల్లెల్లిద్దరూ టెక్స్ట్ బుక్స్ ముందుంచుకొని పెన్సిళ్లు, ఎరేజర్లను ఒకరి మీద ఒకరు విసురుకొంటూ, నవ్వుకొంటూ ఆడుకొంటున్నారు. “చూడండీ! మిమ్మల్ని గమనిస్తూ నేనిక్కడ కూర్చోలేను. వంట చెయ్యాలి. చక్కగా పాలు తాగి, కాస్సేపు చదువుకొని ఎనిమిదిన్నరకల్లా యూనిఫాం వేసుకొని రడీగా వుండాలి. జీడిపప్పు ఉప్మా చేస్తాను తిని, వ్యానెక్కి బడికి వెళ్లాలి. తెలిసిందా? మీ అమ్మలా మీకు స్నానాలు చేయించి, వొళ్లు తుడిచి, ‘యూనిఫామ్ తొడిగి, తల దువ్వి, జడలు అల్లి, పౌడరు పూసి బడికి పంపే ఓపిక నాకు లేదు. మీరు పెద్ద పిల్లలు కదా.

అందుకే వీలైనంత వరకు మీరే రెడీ కండి!” అంటూ మళ్లీ కిచెన్లోకి వెళ్లిపోయాడు క్రిష్.పొయ్యి వెలిగించి బాండ్లిని స్టవ్ మీద పెట్టి మంచి నూనెను అందులో పోసి, మొదటే తరిగి వుంచిన ఉల్లిపాయను వేసి కాస్త వేగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పుతో పాటు జీడిపప్పును కూడా వేసి ఫెళపెళమని వేగిన వెంటనే నీళ్లు పోసి అవి తెర్లినతరువాత తగినంత రవ్వ అందులో వేసి అటూ ఇటూ తిప్పి “ఉప్మా రెడీ” అంటూ సంతోషపడ్డాడు క్రిష్. అంతలో పక్కనున్న పొయ్యి మీది కుక్కర్ మూడవ విజిల్ వేసింది. స్టవ్ ఆఫ్ చేసి రెండు ప్లేట్లలో ఉప్మా వుంచుకొని తెచ్చి పిల్లల ముందుంచాడు.పిల్లలు స్పూన్లతో ఉప్మా తింటున్నారు. “ఒకే! త్వరగా తిని, తయారుకండి” అంటూ మళ్లీ కిచెన్లోకి వెళ్లిన క్రిష్ పెరుగు తాలింపుతో అన్నాన్ని కలిపి ఆవకాయతో బాక్సుల్లో పెట్టుకొని తెచ్చి బాక్సుల్లో వుంచాడు. బీరువాలోని యూనిఫామ్స్ తెస్తుండగా ఉయ్యాల్లో వున్న చిన్నది లేచి ” మంటూ ఏరుపు లంకించుకొంది.. యూనిఫాము సోపాలో వడేసి ఊయల వద్దకు వెళ్లి చూశాడు. చంటిది ఒకటో బాత్రూంకు వెళ్లినట్టుంది.. డ్రైవర్ నిందుకుంది. దాన్ని తీసి తుడిచి కొత్త డైవర్ వేసి పాలసీనా నోటికి తగిలించి. పెద్ద పిల్లలిద్దరికీ యూనిఫాం తొడిగి, తలలు దువ్వి, జడలు వేసి, పౌడరు పూసి బొట్టు పెట్టి బ్యాగుల్ని భుజాలకు తగించి బయట అరుగు మీద కూర్చోపెట్టాడు స్కూలు వ్యానొచ్చింది. “హమ్మయ్య..” అనుకొంటూ పిల్లలను అందులోకి ఎక్కించాడు క్రిష్. ప్రతిరోజూ ఎనిమిది గంటలకు లేచి కాఫీ తాగి పేపరు చదివి తరువాత దబాయింపు ధోరణితో భార్యను భయపెడుతూ పనులు చేయించుకునేవాడు.

చివరికి షూకి పాలీష్ కూడా భార్య చేత చేయించుకునేవాడు. అలాంటి క్రిష్ ఇవాళ ఉదయం ఆరు గంటలకే లేచి పనులన్నిటిని చేసుకొంటూ పిల్లలతో వేగుతోంది జన్మజన్మలకు గుర్తిండిపోయే సన్నివేశమనుకున్నాడు. అంతే! వున్నట్టుండి ఎవరో పిలిచినట్టు దిగ్గున లేచి గడియారం వంక చూశాడు. అప్పుడు గంట సరిగ్గా మధ్యాహ్నం మూడు. వెంటనే లేచి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని ఆఫీసుకు ఫోన్ చేసి ఓ రోజు సెలవు తీసుకున్నాడు. బాండ్లీని హాల్లోకి తెచ్చుకొని అందులో మిగిలిన వున్న ఉప్మాను ఆవురావురంటూ తిని చేయి కడుక్కొని తీరుబడిగా తన భార్యను.. కాదు.. కాదు ప్రతి ఇంట్లో భార్య స్థానంలో వుండే సాధారణ గృహిణుల గురించి ఆలోచించసాగాడు. నిజం చెప్పాలంటే పాపం.. ఆడవాళ్లు ఉదయం లేచిన దగ్గర నుంచి  పడుకోబోయే వరకు టోటెడు ఇంటి, వంట పనులతో సతమతమై బాగా, అలసిపోతారని అప్పుడు తెలుసుకొన్నాడు. ఇక ఉద్యోగాలు చేసి గృహిణులైతే వాళ్లు ఇంటి, వంట పనులతో పాటు వుద్యోగాలు చేయటమే కాక అన్ని విధాలా భర్త అవసరాలను తీర్చే యంత్రాలనుకున్నాడు క్రిష్ స్త్రీలపై కాస్త సానుభూతి, జాతిని తెచ్చుకొని తనకు తానే మనసులో చిన్నగా బాధపడ్డాడు. అంతలో గుంట నాలుగున్నర అయింది. బడిపిల్లల వ్యానొచ్చి ఇంటి ముందాగింది.గ్రీష్ పరిగెత్తినట్టు వెళ్లి పిల్లలిద్దర్ని దించి స్కూలు బ్యాగుల్ని తీసుకొని ఇంట్లోకి నడిచాడు. అప్పుడు క్రిష్ కు “తల్లీ ఇద్దరూ వినండి. పాలు తాగిన తరువాత ఓ గంటసేపు ఆడుకోండి. తరువాత హోం వర్కు చేసుకొని కాసేపు చదువుకోండి. ఈలోపు మనకూ, మమ్మీకి అలూకూరతో చపాతి చేసిపెడతాను.సరేనా?” అన్నాడు క్రిష్ “మమ్మీ వస్తుందా నాన్నా? పెద్ద పిల్ల అడిగింది. ఈవెనింగ్ తతంగం మొదలైంది.

పిల్లలు ముఖం కడుక్కొని వచ్చేసరికి స్నాక్సు, హార్లిక్సుతో కలిపిన పాలను తీసుకెళ్లి టీపాయ్ మీదుంచాడు. “తల్లీ! ఇద్దరూ వినండి. పాలు తాగిన తరువాత ఓ గంటసేపు ఆడుకోండి. తరువాత హోం వర్కు చేసుకొని కాస్సేపు చదువుకోండి. ఈలోపు మనకూ, మమ్మీకి ఆలూకూరతో చపాతి చేసిపెడతాను.. సరేనా?” అన్నాడు క్రిష్. “మమ్మీ వస్తుందా నాన్నా?” పెద్ద పిల్ల అడిగింది.”అవునమ్మా! మరో రెండు గంటల్లో దిగిపోతుంది” అంటుండగా ఉయ్యాల్లో చిన్నది లేచింది. క్రిష్ గబగబా వెళ్లి తయారుగా వుంచిన పాలసీసాను నోటికందించాడు. చిన్నది ఆమ్.. అమ్మని పాలు తాగుతుంటే “పాలు తాగి గోల చేయకుండా హాయిగా పడుకోవాలి. నాన్నకు బోలెడు పనులున్నాయమ్మా” అంటూ బుగ్గను చిదిమి ముద్దు పెట్టుకొని కిచెన్లోకివెళ్లిపోయాడు క్రిష్ ఒక్క గంటలో చపాతి, అలూకూర. చేశాడు. అంతలో పెద్ద పిల్లలు చదవటం ముగించారు. ఇద్దరికీ స్నానాలు వేయించి, చౌళ్లు తుడిచి బట్టలు తొడిగి తల దున్ని పౌడరు పూసి ఎంచక్కా బొమ్మల్లా తయారు దేని, సోపాలో కూర్చోపెట్టాడు. తనూ స్నానమదీ చేసి టీ షర్లు, షార్టుతో తయారై వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు గంటఆటో వచ్చి ఇంటి ముందాగింది. అందులో నుంచి పూజ రిగింది. అది గమనించిన పిల్లలిద్దరూ “అమ్మ వచ్చేసిందోడ్” అంటూ ఎదురు వెళ్లారు. పిల్లలతో పాటు పూజ లోపలికివచ్చింది.

“ఏమిటి మహానుభావా? అలా దిగాలుపబడి కూర్చున్నారు. ఒక్క రోజుతో అయిపోయిందా తమరిపని” అడిగింది పెదాల పైకి నవ్వు తెచ్చుకొని చటుక్కున పూజను లాగి పక్కన కూర్చోపెట్టుకున్న క్రిష్ “నిజంగా మీ ఆడవాళ్లు ఎంత గొప్పవాల్లో! ఇంట్లో ఇన్ని పనులు చేసుకొంటూ ఓర్పు, సహనాలతో ఇంటిల్లిపాదిని చక్కగా సంభాళిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారని ఇవాళే తెలుసుకున్నాను. ఇక.. ఇన్ని పనులను చేసుకొంటూ సంపాదన కోసం ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలనైతే ఎంతగా అభినందించాలో! అందుకే నా మటుకు నేను మీలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తాను. రియల్లీ లేడీస్ ఆర్ వెరీ గ్రేట్! ఇంతకూ మీ నాన్నకెలా వుంది?” అడిగాడు. “ఇప్పుడు పర్వాలేదండి. బాగున్నారు. సరే! రాత్రి డిన్నర్కు ఏం చేశారు?” అడిగింది పూజ. “నీకు బాగా ఇష్టమని చపాతి, ఆలూకూర చేశాను డియర్” అన్నాడు.”వెరీగుడ్! అయిదు నిమిషాల్లో వడ్డించేస్తాను” అని లేవబోయింది పూజ.”నో…. వంట చేసింది నేను. మీకు వడ్డించేది కూడా నేనే సుమా!” అంటూ క్రిష్ కిచెన్లోకి వెళుతుంటే ళుతుంటే భర్తను చూస్తూ మెల్లగా నవ్వింది పూజ.తల్లి నవ్వుతో నవ్వు కలిపారు పిల్లలిద్దరూ.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Ladies are great latest news Latest News in Telugu Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.