పుట్టపర్తి బస్టాండ్లో గంటసేపు నుంచి కూర్చున్నాను.నేను వెళ్ళాల్సిన ధర్మవరం బస్సు ప్లాట్ ఫాంలోకి ఇంకారాలేదు. సమయం పది కావస్తోంది. అటూ ఇటూ చూస్తూ ఒక్కడినే కూర్చుని వున్నాను “అనంతపురం వెళ్ళే బస్సు ఇంకా రాలేదా?” ఎవరో అడిగినట్టు అనిపిస్తే తల పైకెత్తి
చూసాను. చేతిలో బ్యాగు పట్టుకుని ఒక అమ్మాయి (girl) నాపక్కనే నిలబడింది “ఇంకా రాలేదమ్మా?” అన్నానునిరుత్సాహపడిపోతూ, నా పక్కనేకూర్చుంది “చదువుతున్నావా తల్లీ?”ఎంతో ఆప్యాయంగా పలకరించాను.
లేదు” అన్నట్టు తల అడ్డంగా ఊపింది. అరగంట గడిచిపోయింది.
తిన్నగా తల తిప్పి అమ్మాయిని గమనించాను. ఏదో తేడా(difference) కనిపించింది.. ఆమె కంట్లో నీళ్లు
ఒక్కొక్క బొట్టుగా రాలడం చూసాను “ఎందుకమ్మా. ఏడుస్తున్నావ్?” అడగాలనిపించి అడిగాను. “ఏం లేదు” అన్నట్టు తల పంకించింది. “పర్వాలేదు చెప్పమ్మా, నేను చేయగలిగిన సాయమైతే తప్పకుండా చేస్తాను”
నా మాటకు సమాధానం ఇవ్వలేదు “నీ పేరేమిటి?” అని అడిగాను.
“పద్మ” అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కాస్త ప్రయత్నం చేస్తే ఎట్టకేలకు చెప్పడం మొదలు పెట్టింది. మిద్దె పైన కూర్చుని సెల్ ఫోన్చూ స్తూ వుంది పద్మ. “అస్తమానం సెల్ఫోన్ తప్ప వేరే ధ్యాస లేదు” అంటూ విసుక్కుంది పార్వతమ్మ.
వచ్చి భోంచేయ్ పద్మా, నేను పనికి వెళ్లాలి” అంది పార్వతమ్మ. రోజూ కూలి పనికి వెళుతుంది. భర్త శివప్రసాద్ అనారోగ్యంతో ఏడాది కిందటే మరణించాడు. పద్మ చదువుతో పాటు ఇంటి బాధ్యత అంతా పార్వతమ్మే చూసుకుంటోంది.
ఉన్న ఒక ఎకరం భూమిలో పంట వేసే స్థోమత లేక బీడు పెట్టింది. ప్రాణమంతా ఒక్కగానొక్క
కూతురిపైనే పెట్టుకుని జీవిస్తోంది. కొద్ది రోజులు గడిచిపోయాయి.. ఫేస్బుక్లో దివాకర్ అనే పర్సన్ పద్మకు బాగా క్లోజ్అ య్యాడు. క్రమంగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది.
ఇదే విషయం పార్వతమ్మతో చెప్పింది పద్మ. “ఎవర్ని పడితే వాళ్ళను నమ్మకు పద్మా, పైకి బాగానే కనిపిస్తారు జాగ్రత్త” అంది పార్వతమ్మ. అయినా తల్లి మాటను బేఖాతరు చేసి దివాకర్తో చనువుగా ప్రవర్తించడం మొదలు పెట్టింది “నిన్ను మాట్లాడకుండా క్షణం కూడా వుండలేనురా” అనేంత పిచ్చి ప్రేమ పద్మలో ముదిరిపోయింది. రోజు రోజుకూ పద్మలో మార్పు కనిపిస్తుంటే పార్వతమ్మ ఆలోచనలో పడింది. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. ఆరోజు తెల్లవారుజామున నిద్ర లేచింది పార్వతమ్మ. పద్మ కనిపించలేదు.
పక్కన ఒక చీటి పడుంది, తీసి చదివింది
“సారీ అమ్మా! నాకు దివాకర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడుతన దగ్గరకే వెళ్తున్నాను, తననే పెళ్లి
చేసుకుంటాను. నా కోసం వెదికే ప్రయత్నం చేయకు. నాకు పెళ్ళి చేసే స్థోమత నీ దగ్గర
లేదు, చదివించే శక్తి కూడా నీకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కచ్చితంగా ఎప్పుడో ఒకరోజు వస్తాను నన్ను క్షమించు” అని రాసి పెట్టి వెళ్ళిపోయింది. గుండెలవిసేలా రోదించింది పార్వతమ్మ. ఉన్న ఒక్క తోడు కూడా దూరమైపోయేసరికి తీవ్రమైన ఆలోచనతో అనారోగ్యం పాలై
మంచాన పడింది పార్వతమ్మ.
దివాకర్ ప్రేమలో పడి తనకు ఒక తల్లి వుందన్న సంగతి మర్చిపోయింది పద్మ. ఒకరోజు ఊరి నుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మకు ఆరోగ్యం క్షీణించింది నిన్నే కలవరిస్తోంది ఒక్కసారి వచ్చిపో పద్మ” అని పక్కింటివాళ్లు చెప్పినా కూడా పద్మలో చలనం రాలేదు. తొలి మోజులో కొన్నాళ్ళు గడిచిపోయింది. కొత్త పాతైంది మోజు తీరిపోయింది.
ఇప్పుడు కావాల్సింది ప్రేమ కాదు బతకడానికి డబ్బు కావాలి. దివాకర్లో మార్పు మొదలైంది “ఊరి దగ్గర ఉన్న ఆ ఎకరం పొలం అమ్మి డబ్బులు తీసుకురా” అంటూ పద్మను వేధించడం మొదలుపెట్టాడు “అమ్మను వదులుకుని నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తే ఇలా చేయవచ్చా దివాకర్” అంటూ కన్నీరు
కార్చింది పద్మ “ప్రేమ వేరు పెళ్ళి వేరు. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. వెళ్ళి చెప్పిన పని చేసుకురా” అంటూ పద్మకు సంబంధించిన బట్టల బ్యాగు బయటికి విసిరి, తలుపులు మూసేసాడు దివాకర్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను ఆకర్షణ వేరు ప్రేమ వేరు మోసపోయావు తల్లీ” అని
అంటుండగానే అనంతపురం బస్సు రానే వచ్చింది.
హడావుడిగా వెళ్లి బస్సు ఎక్కేసింది పద్మ. సాయంత్రానికి ఊరు చేరుకుంది. ఇంటికి తాళం వేసి వుంది. పక్కింటి రత్నయ్యను అడిగింది “మీ అమ్మ నీ కోసం శ్మశానంలో ఎదురు చూస్తోంది, వెళ్లు” ఆ మాటతో కళ్లు తిరిగిపోయాయి పద్మకు. “నీ పిచ్చి ప్రేమ మీ అమ్మను బలి తీసుకుందమ్మా, కచ్చితంగా చెప్పాలంటే నీ ప్రేమపిచ్చి మీ
అమ్మను మానసికంగా బాధించి చివరికి హత్య చేసింది. వెళ్ళు వెళ్ళి చూడు” అంటూ రత్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే పద్మ నిర్జీవిలా నిలబడిపోయింది. “ఆకర్షించే ప్రేమ ముందు కన్న ప్రేమ ఓడిపోయింది.
అవసరానికి రంగులు మార్చే ప్రేమ ముందు జన్మనిచ్చిన ప్రేమ ఓటమి పాలైంది.. చివరికి మోసమే గెలిచింది. నాపై ఆశలు పెట్టుకున్న కన్న ప్రేమ కనుమరుగై
పోయింది..” మనసులో అనుకుని కన్నీటిపర్యంతమైంది
పద్మ అక్కడే కూలబడిపోయింది.
Read also: hindi.vaartha.com
Read also: The Hen and the Kite’s Feud:కోడి గద్ద వైరం