📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

I Made a Mistake : నేను చేసింది తప్పే

Author Icon By Abhinav
Updated: December 5, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విక్రమ చోళుడు అనే రాజు రా ఉండేవారు. ఆయన ఒకరోజు మారువేషంలో నగరంలో సంచరించాడు. నగరంలోని ఒక చెరసాలలోని ఖైదీలు ఎలా ఉన్నారో. చూద్దామనుకుని అక్కడికి వెళ్లాడు. పలువురు ఖైదీలు అక్కడున్నారు. వారిలో ఒకరిని పిలిచి “నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని?” అడిగాను. మారువేషంలో ఉన్న రాజు

దానికి ఖైదీ జవాబిస్తూ “నేను ఒక అద్దెకొంపలో ఉండేవాడిని. ఆ ఇంటిని ఖాళీ చేయమని చెప్పారు. మరో ఇల్లు సమయానికి దొరుకలేదు. దాంతో ఖాళీ. చేయకుండా ఉన్న ఇంట్లోనే ఉండిపోయాను. అందువల్ల నా మీద కేసు పెట్టారు. విచారణ తర్వాత నాకు ఏడాది జైలుశిక్ష విధించారు” అన్నాడు. రాజు మరొక ఖైదీని పిలిచాడు….. “నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని?” అడిగాడు. 

దానికతను జవాబిస్తూ “నా మీద ఎలాంటి తప్పూ లేదండి. ఒకరోజు వీధిలో నడుచుకుంటూ పోతున్నాను. దారిలో ఒక బంగారు గొలుసు కనిపించింది. ఎవరూ పట్టించుకోని ఆ గొలుసుని నేను తీసుకున్నాను.

డబ్బులు అవసరమైన దానిని అమ్మడం కోసం ఓ దుకాణానికి వెళ్లాను. అక్కడ నన్ను గొలుసు దొంగించావని చెప్పి నన్ను పట్టుకున్నారు. అంతేకాకుండా శిక్ష కూడా విధించారు” అన్నాడతను. రాజు ఇంకొక ఖైదీని పిలిచి విచారించాడు. “అయ్యా, మా ఊళ్లో జమాపద్దులు చూసుకునే ఓ మనిషి ఉన్నాడు.

ఆయన నన్ను తరచూ డబ్బులు అడిగేవాడు. నా దగ్గర ఏదైనా ఉంటే నేనూ ఇచ్చేవాడిని. అలా ఓసారి నన్ను కలిసి డబ్బులు అడిగారు. “నా దగ్గర లేవన్నాను”. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఆరోజు రాత్రి ఆయన పచ్చగడ్డి అంటుకుంది. అయితే ఆ ప్రమాదానికి నేనే కారణమని చెప్పి, నా మీద ఫిర్యాదు చేసారు.

ఆయన మాట అందరూ నమ్మి నాకు శిక్ష విధించగా ఇక్కడికి వచ్చాను” అన్నాడు. అ ఖైదీ. రాజు అతను చెప్పినదంతా విన్న తర్వాత మరొక ఖైదీని పిలిచి అడిగారు. “స్వామీ, నేను మరేమీ చెయ్యలేదు.

ఓ చిన్న గుడి కట్టాలనుకున్నాను. ఆ క్రమంలో పలువురి దగ్గర కందాలు వసూలు చేసాను, అయితే ఆలయ నిర్మాణానికి ఆలస్యమవడంతో డబ్బులు ఇచ్చినవారు నా మీద ఫిర్యాదు చేశారు. దాంతో నన్ను కటకటాలపాలు చేశారన్నాడు” ఇలా ప్రతి ఖైదీ తాము తప్పేమీ చేయలేదనీ, అన్యాయంగా తమను జైల్లో బంధించారని చెప్పి బాధపడ్డారు.

రాజు చివరగా ఒక ఖైదీని విచారించారు. “నువ్వెందుకు జైలుకు వచ్చావని?” అడిగిన ప్రశ్నకు ఆ ఖైదీ ఇలా చెప్పాడు. “అయ్యా, నేను చాలా పేదవాడిని. ఏడుగురు పిల్లలు మాకు. అంతేకాకుండా వయస్సు మళ్లిన తల్లిదండ్రులు. ఎంత కష్టించినా తగినంత కూలీ గిట్టేది కాదు. కొన్ని సార్లు పని కూడా దొరికేది కాదు.

ఆకలిబాధతో మాడాల్సి వచ్చేది. అందువల్ల చెయకూడని ఒక పని చేశాను, ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేసాను. దొంగిలించడం తప్పని తెలుసు. మరొక మార్గం లేక దొంగతనం చేసాను. అందువల్ల నన్ను పట్టుకుని నాకు జైలుశిక్ష విధించారు. నేను మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాలి”.

అన్నాడు ఆ ఖైదీ. “నేనిక్కడికి రావడానికి మరెవరో కారణం కాదు. నాకు నేనే కారణం” అని చెప్పాడు. చేసిన తప్పుకి ప్రతిరోజూ బాధ పడుతున్నాను” అని అతను కంట తడిపెట్టాడు. రాజు వెంటనే జైలు అధికారిని పిలిచాడు.

అధికారి వెంటనే వచ్చాడు. “ఇదిగో చూడండి.. ఇక్కడికి వచ్చినవారెవరూ ఒక్క తప్పూ చేయనివారే. ఈ ఒక్క మనిషే తప్పు చేశాడు. మంచివాళ్లు ఎందరో ఉన్న ఇక్కడి వాళ్ల మధ్య ఓ దుష్టుడు ఉండకూడదు. అందువల్ల వెంటనే ఇతనిని విడుదల చేసి అతనిని బయటకు పంపించేయండి” అని ఆదేశించాడు. 

చేసింది తప్పని గ్రహించినవాడు విడుదల అయ్యాడు. చేసిన తప్పు ఒప్పుకోవడం అనేది ” సామాన్య విషయం కాదు. అది మంచి గుణం. తప్పు ఒప్పుకునేందుకు ధైర్యం కావాలి. మనసు పరిపక్వంగా ఉండాలి. ఈ రెండూ ఉన్న ఒకరు కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నాడు.

ఆయన పక్కనున్న మరొక మనిషి “ఏమిటీ? మీరే ఏదీ దాచి పెట్టకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మీకీ గతేమిటి?” అని అడిగాడు. దానికి ఆ పెద్దమనిషి “సోదరా, నేను ఏ పాపమూ చేయలేదు. ఒకరోజు నాకు ఖర్చుకి అయిదు వేల రూపాయలు కావలసి వచ్చాయి. అందుకోసం మరేమీ చేయలేదు. ఇంట్లోంచి డబ్బులు కొట్టేసాను. అది మహా నేరమని చెప్పి నన్ను ఇక్కడ బంధించారు” అన్నాడు.

“అదేంటీ? మన సొంత ఖర్చులకి డబ్బుని ఇంట్లోంచి తీసుకోవడం కూడా తప్పేనా?” అని అడిగాడు వారి మధ్య జరిగిన సంభాషణను విన్న ఇంకొకడు. “అవును.. అట్లాగే చెప్తోంది చట్టం. ఎందుకంటే నేను డబ్బులు కొట్టేసింది మా ఇంట్లోంచి కాదు, పక్కింట్లోంచి” అన్నాడు చల్లగా.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Admitting Mistakes Confession Crime and Punishment Forgiveness Honesty Integrity Justice King Vikrama Chola moral story Prisoner Redemption Short Story Truth wisdom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.