Fearful Businessman:వృద్ధుడైన నాగయ్య ఒక పల్లెటూరిలో నివసిస్తున్నాడు. ఆ ఊళ్లో మంచినీళ్లు కూడా దొరకని కారణంగా సుదూర ప్రాంతం నుండి బిందెల్లో మోసుకుని తెచ్చుకునేవారు. ఆ ఊళ్లో రైల్వే గేట్ ఉంది. ప్రతి అర్థ గంటకు ఒకసారి రైళ్ల రాకపోకల వలన గేట్ మూసేవారు.
అది మండు వేసవి కాలం కావడంతో నాగయ్య ఉదయాన్నే సుదూర ప్రాంతానికి వెళ్లి బిందెలో మంచినీళ్లు నింపుకుని వచ్చి రైల్వే గేట్ మూసిన సమయంలో ఆగిన వాహనదారులకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో( money) జీవనం సాగించేవాడు.
ఒకరోజు రైల్వే గేట్ మూసిన సమయంలో ఖరీదైన కారు (car) వచ్చి ఆగింది. నాగయ్య చెంబులో నీళ్లు ముంచుకుని వెళ్లి “అయ్యా! ఈ నీళ్లతో దాహం తీర్చుకోండి. మీకు తోచినంత ఇవ్వండి” అని అర్థించాడు.
ఆ కారు నుండి సూటు, బూటు వేసుకున్న మారాజు దిగి “అరే పల్లెటూరి బైతూ, కారుపైన పడతావేంటి? ఈ కారు ఖరీదు కోటి రూపాయలు. గంజికి లేని నువ్వు బెంజికారుపై పడి దుమ్ము, ధూళీ అంటిస్తావా?” అని హేళనగా మాట్లాడాడు.
“అయ్యా! నేను కారును తాకలేదయ్యా” భయపడుతూ చెప్పాడు నాగయ్య. ధనవంతుడు కేకలు వేస్తూ “నీ మురికి నీళ్లతో నాకు ఎటువంటి అవసరం లేదు. శుద్ధమైన జలాన్ని తాగే నాకు వీటి అవసరం లేదు” అన్నాడు.
అప్పటికే ధనవంతుడు చాలా దూరం నుండి కారులో ప్రయాణించడం వల్ల రేడియేటర్ చాలా వేడెక్కింది.
ఇంతలో రైలు వెళ్లిపోవడంతో గేటు తీశారు. ధనవంతుడు బయలుదేరడానికి కారు తీశాడు. అనుకోకుండా కారు నుండి దట్టమైన పొగలు వచ్చాయి. ధనవంతుడు భయపడిపోయి కారు దిగి నాగయ్య వద్ద వున్న బిందె తీసుకుని రేడియేటర్లో నీళ్లు పోశాడు. వేడి తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
“బతుకుజీవుడా!” అంటూ ధనవంతుడు నాగయ్య వైపు చూశాడు. “పెద్దాయనా! పొరపాటు జరిగింది. ధనబలంతో మీరు చేస్తున్న సేవను గుర్తించకుండా ఇష్టానుసారంగా మాట్లాడాను.
ఈ డబ్బు తీసుకుని హాయిగా జీవనం సాగిస్తూ ప్రజల దాహాన్ని తీర్చండి” అంటూ పెద్ద మొత్తంలో నాగయ్యకు డబ్బు ఇచ్చి, కృతజ్ఞతలు చెప్పి ధనవంతుడు వెళ్లిపోయాడు.
Read also:hindi.vaartha.com
Read also: