📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Family Life is the Foundation of Success : కుటుంబ జీవనం ప్రగతికి సోపానం

Author Icon By Abhinav
Updated: December 13, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘జీవితంలో ఆనం దం చాలాభాగం మనకున్న సత్సంబం ధాల వలన లభ్యమ వుతుందని, దిగుళ్లు, విచారాలన్నీ అప్రియమైన సంబంధాల వలన కలుగుతాయనీ’ అంటాడు. మానసిక శాస్త్రవేత సిడ్నీ జోరర్డ్. మనకొచ్చే సమస్యల్లో ఎక్కువ భాగం మానవ సంబంధాలకు సంబంధించినవే. మానవ సంబంధాలను ఉన్నతంగా మలచుకున్నవారు వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో సాఫల్యం సాధిస్తారు. సాటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోలేక పోవటమే మనిషి జయాపజయాలకు, నైరాశ్యానికి ముఖ్యకారణం. కొన్నేళ్లక్రితం వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్సులో తండ్రి కొడుకులను పక్కన కూర్చోబెట్టుకుని, ‘ఒక సామాన్యుడిలా ఈ సమాజానికి ఏమివ్వగలంరా! ప్రేమతో కూడిన మంచి కుటుంబం తప్ప. దాన్ని మించినది ఇంకేదైనా ఉందా? ఇదిగో.. ఈ జన్మకే వీడు నీకు తమ్ముడు, ఈ జన్మకే నేను మీకు నాన్న’ అంటాడు. ఇవ్వాళ సమాజంలో తగ్గిపోతున్న మానవ సంబంధాన్ని తక్కువ మాటల్లో ఎంతో హెచ్చరించినట్టు విస్తృతార్థంతో చెబుతాడు. కుటుంబం నుండే సమాజం ఏర్పడుతుంది. కుటుంబం మంచిదైతే సమాజం మంచిదవుతుంది. కుటుంబం అనే కోటను దుర్భేద్యంగా మలచుకోవడానికి మానవ సంబంధాలు రక్షక భటుల్లా వెన్నంటి ఉంటాయి. 

పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పదిమందైనా, ఇరవైమందైనా ఒకే ఇంట్లో కలిసి మెలసి ఉండేవాళ్లు. ఒక రాజ్యానికి రాజులా ఇంటి యజమాని ఉండేవాడు. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, సుఖదుఃఖాలు.. అన్నిటినీ అందరూ కలసి పంచుకునేవారు. ఇలా పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ మానవత్వ విలువలతో ‘నేను’ అనే ఆహానికి తావులేకుండా ‘మనం’ అనే కలివిడి కుటుంబాలు మానవీయ సంబంధాలకు ప్రతిబింబాలుగా భాసిల్లాయి. ఏ ఇంట్లో చూసినా వావివరుసలు, నోరారా పిలుపులు, కమ్మని భోజనాలు, పాడిపంటలు, సరదాలు, సంబరాలు వెల్లివిరిసేవి. అవన్నీ ఇంటికే పరిమితం కాకుండా, వాటన్నిటినీ ఇరుగుపొరుగు వారితో, ఊరివారితో పంచుకునే వాళ్లు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇంటి యజమాని వారి పక్కన నిలబడి ‘నేనున్నాను’ అనే భరోసా ఇచ్చేవాడు. అలాగే ఊరి సమస్యలు అంతా పంచుకునేవాళ్లు. వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ప్రేమ, విశ్వాసం, నమ్మకం, గౌరవం అనేవి మనుషుల మధ్య మానవసంబంధాలను బలపరచేవి. అలా ఏర్పడ్డ మానవసం కలుషితాన్ని సైతం కలుపుకుపోయే నదీప్రవాహంలా సాగిపోతూ సమాజమనే సౌధాన్ని నిర్మించేవి. అలాంటి కుటుంబసౌధాల్లో మంచిమాట, మంచి పొగడ్త, పవిత్రత, హద్దులు, కట్టుబాట్లు అదృశ్యంగా ఐకమత్యానికి అండగా నిలబడేవి. 

‘భద్రత’ అనే కవచం ఇంట్లో ప్రతివ్యక్తికీ రక్షణగా ఉండేది. పిలుపులు: ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆరంభమయ్యే మానవసంబంధాల సంబోధనలు కడుపునింపేలా ఉండేవి. ‘బాబాయ్ బాగున్నావా? పిన్నీ కులాసానా?’ అంటూ పిల్లలనుండి పెద్దల వరకూ వావివరసలతో కమ్మని పిలుపుతో పలకరించేవాళ్లు, పెద్దలపట్ల గౌరవమర్యాదలు, భయం, భక్తి తప్ప అలక్ష్యం, అలసత్వం ఉండేవి కావు. నేడు వీధికొకటి పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు ఆరోజుల్లో మచ్చుకైనా కన్పించేవి కావు. పండగ వచ్చిందంటే చాలు.. సంస్కృతి సంప్రదాయాలతో ఊరు ఊరంతా సంబరాలు జరుపుకునేవాళ్లు. కానీ నేడు కాంక్రీట్ జంగిళ్లలా మారిపోయిన నగరజీవితాలు తగరపు జీవితాలయ్యాయి, పట్టుకుంటే శబ్దం, ముట్టుకుంటే నిశ్శబ్దం. అందుకే కోల్పోతున్న మానవ సంబంధాల్నీ, సంస్కృతి సాంప్రదాయాల్నీ, ఆప్యాయతానుబంధాల్ని ఏడాదికోసారైనా మననం చేసుకోవడానికి నగరాల నుంచి వల్లెలకు పరుగులు తీస్తున్నారు. విదేశాల్లో ఉన్నవాళ్లు పండుగలకు స్వదేశం పైసలి వస్తున్నారంటే కారణం. సంబంధాలపై ఉన్న ముక్కువ మా అన్నయ్య, మా అక్కయ్య మా తమ్మడు, మా చెల్లి అంటుంటాం. మంచికి, చెడుకీ కుటుంబంలోని సభ్యులంతా సంఘటితమైనట్టు తిరుగుపొరుగు వాళ్లకి ఏ ఆపద వచ్చినా, తమతమ భేదాలకతీతంగా అండగా ఉండేవారు. దీనికి కారణం మానవసంబంధాల మీదున్న గౌరవమే.. ఇంతటి మహత్తరమైన మానవసంబంధాలు ఎదుటి వారిని పొగటం వల్లనో, ఆకలికి అన్నం పెట్టటం వల్లనో, ఆపదలో ఆదుకోవటం వల్లనో ఏర్పడేవి కావు, మనుషుల్ని మానవత్వం నుండి దూరం చేసే అరిషడ్వర్గాలకు అతీతంగా.

మనసుతో మనసు మమైకమైనప్పుడే ఏర్పడేవే ‘మానవసంబంధాలు’, మానవసంబంధాల్ని ప్రభావితం చేసే అంశాలు జీవితంలో మానవ సంబంధాల్ని ప్రభావితం చేసే అంశాలలో మొదటిది కుటుంబం. రెండవది సమాజం. కుటుంబంలో ప్రధాన వ్యక్తులు తల్లిదండ్రులే. తల్లి నవమాసాలూ మోసి జన్మనిచ్చి, మనల్ని సమాజంలోకి తీసుకొస్తే, తండ్రి విద్యాబుద్ధులు నేర్పించి, విలువలతో కూడిన గుర్తింపును, హోదాను కల్పిస్తాడు. మానవ సంబంధాల్లో కుటుంబ వ్యవస్థ మరో ముఖ్యమైన అంశం. వ్యవస్థకు పునాది వివాహం. సంతానాభివృద్ధికి, సమాజాభివృద్ధికి మనుగడకు ఇది ఎంతో అవసరం. ఇద్దరు అంతకు మించిన వ్యక్తులు ఒక ప్రదేశంలోనో, ఒక ప్రాంతంలోనో కలిసి జీవించాల్సి వచ్చినప్పుడు ‘మానవ సంబంధాలే’ వాళ్లని ఒకటి చేస్తాయి. ఇవే సామాజిక సంబంధాలుగా మారతాయి. సృష్టిలో ఏ ప్రాణికీ లేనిది, మనిషి మాత్రమే సొంతమైన రెండు లక్షణాలు న్నాయి. ఒకటి ఆలోచన, రెండు క్షమాగుణం. మంచి ఆలోచనలున్నవారికి మానవ సంబంధాలపట్ల గౌరవం. తప్పుజరిగినా క్షమించే గుణం ఉంటాయి. ఈ రెండింటినీ మనిషి కాపాడుకుంటే చాలు మానవ సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమను పంచివ్వడం, ప్రేమను పొందటం తెలిస్తే చాలు ఎం53ను మనస్కులనైనా మానవ మదర్ థెరెస్సా, మహాత్మాగాంధీ, వివేకానంద వంటి వారు దీనినే పాటించి, మరణానంతరం కూడా లౌకిక ప్రపంచంలో మానవ సంబంధాలను ప్రభావితం చేయగల్గుతున్నారు. 

ఎంత సంపద ఉన్నా వ్యర్థమే ఎప్పుడైతే ‘అమ్మా, నాన్న’ పిలుపుల్ని తప్పించి, ‘మమ్మీ, డాడీ’ పిలుపులు. ఆక్రమించుకున్నాయో, అనాటి నుండే మానవీయ సంబంధాలు తెరమరుగు కావడం ప్రారంభించాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి, న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడినప్పటి నుండి మను ష్యుల్లో మానవసంబంధాలు అంతరించడం ఆరంభించాయి. సాంకేతిక సంబంధాలు ఆస్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో తాతాయ్య నానమ్మలు చిన్నపిల్లలకి రామాయణ భారతాల్లో ఉన్న మానవసంబంధాలు, విలువల గురించి ఉగ్గుపాలతో నేర్పించేవారు. రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ వంటి మతపరమైన గ్రంథాల్లో విలువైన మానవ సంబంధాల గురించి వివరించబడ్డాయి. ‘కనీసం ఒక్కసారైనా రామాయణ కావ్యం చదువుకొనని వారికి ఎన్ని ఆస్తులున్నా… ఎన్నికోట్ల సంపదలున్నా వ్యర్థమే’ అంటారు చాగంటివారు. యాంత్రికత, కృత్రిమత, తాంత్రికత: ఈమూడు ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధాల్ని వ్యాపార సంబంధాలుగా మార్చాయి. కంప్యూటర్లు, టీ.వీలు, రోబోలు, సెల్ఫోన్లు మనుషుల మధ్య మాటల్ని, మానవ సంబంధాల్ని కబళిస్తున్నాయి. పూర్వకాలంలో  వృత్తిపరమైన సంబంధాలు కూడా మానవు సంబంధాల్లో భాగమయ్యేవి ఈకుడు క్షయకుడు, కలపాలి, వక్రంగి, కమ్మరి, కుమ్మరి మనుషుల మధ్య అనుబంధాల్ని బలపరచేవి. 

ఇవ్వాళ కాలేడీ వ్యాపారానికి కనర్హమన్నట్టు కులవృత్తులపైన కన్నేసిన కార్పొరేట్ వ్యాపారులు, సంస్థలు మానవ సంబంధాలు కనుమరుగైపోవడానికి పరోక్షంగా తమవంతు పాత్ర. పోషిస్తున్నారు. మనుషులే కాకుండా సంగీతం, సాహిత్యం, నృత్యం, కళలు, క్రీడలు, జానపదకళలు, కులవృత్తులు ఇవన్నీ మానవ సంబంధాల్లో భాగాలే. కళలలో నిపుణులైన కళాకారులతో మనకు ప్రత్యక్ష పరిచయం లేకపోయినా వారిని అభిమానిస్తాం. ఆరాధిస్తాం. మానవ సంబంధాల్లో అంతర్లీనంగా ఉండే గొప్ప దానాన్ని ఆస్వాదిస్తాం.. గుర్తుంచుకుంటాం. మేముసైతం మనుషులే కాకుండా మనుషులు పెంచుకునే జంతువులు, పక్షులు మానవ సంబంధాల్లో భాగమవుతు న్నాయి. యజమాని, కుటుంబ సభ్యులు కన్పించగానే వాటికంటి చూపులో, అరుపులో అనుబంధా న్ని వ్యక్తపరుస్తాయి. వారసత్వపు వారధులు ఉన్నారు. మహాత్మాగాంధీ. అబ్దుల్కలాం, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, నెల్సన్ మండేలా, సచిన్స్టెండూల్కర్, మైకేల్ జాక్సన్, మదరెరెసా వంటి ఎంతోమంది తమ ప్రతిభతో ప్రపంచమంతటా మానవ సంబంధాలు కలిగి ప్రకృతితో: మానవ సంబంధాలు ప్రకృతితోనూ మమైకమై ఉన్నాయి. మనిషికి చెట్టుతో, మట్టితో, పంటపైరులతో ఏర్పడే బంధాల్లో మరో పార్శ్వం కన్పిస్తుంది. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు సమస్త ప్రాణులతో మనిషికి ఉండాల్సిన మైత్రీభావనని అర్థం చేసుకున్నవే. మానవ సంబంధాలు అచేత అనుబంధాలుగా బలపడి ఒకతరం నుండి మరో తరానికి అందించబడతాయి. 

అందుకే ఓ రచయిత మానవసంబంధాల్ని వారసత్వపు వారధులుగా పోల్చారు. ఆ కారణంగానే ఎంతోమంది విదేశీయులు మన విలువలకి, సంస్కృతికి, సంప్రదాయాలకీ, వివాహవ్యవస్థకీ, వసుదైన కుటుంబ భావనకు సలాములు చేస్తున్నారు. పడవెళ్లిపోతోందిరా! మానవుడా! దరిచేరే దారేదినా!’ అనే పాతపాట విన్నప్పుడల్లా ‘తరమెళ్లీ పోతోందిరా!! అన్నట్టన్పిస్తుంది. రాబోయే పది, పదిహేనేళ్లలో ఒక తరం ప్రపంచం నుండి నిష్క్రమిస్తుంది. మంచి చెడులు, తప్పొప్పులు సరిదిద్దే పెద్దతరం, పెద్దతనం కనుమరుగవ్వబోతోంది. జనరేషన్ గ్యాప్ అని మనం ఎంత సమర్ధించుకున్నా, నాగరిత పేరుతో నానాటికీ పెరిగిపోతున్న విచ్చలవిడితనం, బరితెగింపు, అదుపు తప్పిన అలవాట్లు, కట్టుబాట్లు లేని వికృతచేష్టలు, వలువలూడదీసి బజాలెక్కుతున్న విలువలు, కుటుంబ నేపథ్యాన్ని వదిలేసే, ‘లివింగ్ టు గెదర్’ సంస్కృతి, సరోగసి వంటి వింత పోకడలతో యువతరం ఎటువైపు వెళ్తాందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొంది నేడు. ‘చెప్పేవాళ్లు లేకనా? ఒకవేళ చెప్పినా వినే సమయం లేకనా? కారణం ఏదైనా నేడు సహజాలన్నీ అసహజాలైపోతున్నాయి. కన్నతల్లిదండ్రుల మాటలు కంటగింపై పోతున్నాయి. మనీ, మెషీన్, టెక్నాలజీ, ఫ్యాషన్ ఇవే సర్వస్వం అనుకుంటూ మానవ సంబంధాలకతీతంగా, యాంత్రికంగా జీవిస్తున్నారు. 

ల్యాప్టాప్లోనో, మొబైల్తోనో సంబంధం పెట్టుకుని దైనందిన జీవితబంధాలన్నీ తెంచుకుంటున్నారు. మానవసంబంధాలు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, యంత్ర, బిగ్బాస్కెల్, స్విగ్గీ, జూమాటోల్లో దొరుకుతాయా? మనిషి జీవించడానికి కావాల్సిన సమస్తాల్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు గానీ, అనురాగాలు, ఆప్యాయతల్నీ స్మార్ట్ఫోన్లో బుక్ చేసుకుని ఆన్లైన్లలో తెప్పించుకోగలరా? గలరేమో! వినాయక చవితి పత్రిని, మట్టి వినాయకుణ్ణి ఆన్లైన్లో తెప్పిస్తున్నారు. పిడకలు మొదలు చెప్పుల వరకూ కాదేదీ ఆన్లైనికి అనర్హం అంటున్నారు. ఆప్యాయత, అనుబంధాలు సాంకేతికతో కొనలేం ఓ సాఫ్ట్వేర్ కుర్రాడు ఓ పెద్దాయనతో ‘ఒకళ్లని చూసి మరొకళ్లు ఎమోషనలవ్వటం, గతంలో బ్రతకడం, కాల్పనిక మార్పుల్ని అంగీకరించకపోవటం, ఇవేగా మీరు చెప్పుకుని ఆప్యాయతలు’ అన్నాడు. ‘నువ్వు చెప్పింది కరెక్టో కాదో. మీ ‘గూగుల్’ నూతని అడుగు అన్నాడా పెద్దాయన. వెంటనే కుర్రాడు తన స్మార్ట్ఫోన్లో ఎంత వెతికినా అతనికి కావాల్సిన సమాధానం రావటం లేదు. సరికదా.. ఆప్యాయత ఎన్ని ఉదాహరణలు చెప్పినా, కుర్రాడు కౌంటరిస్తూనే ఉన్నాడు. చివరికి సహనం నశించిన ఆ పెద్దాయన కుర్రాడి చెంపమీద లాగి కొట్టాడు. వెంటనే కుర్రాడు ‘అమ్మా’ అన్నాడు అవాక్కయి. వెంటనే ఆ పెద్దాయన ‘ఇదే ఆప్యాయత అంటే! నువ్వు ఫ్లాష్లోకెళ్లి నీకెదురుగాలేని మీ అమ్మని పిలిచావే.. అదే ఆప్యాయత అని నవ్వుతూ. వెళ్లిపోయాడు. 

వారధి మీరే నేడు మానవ సంబంధాలు, ఆప్యాయతల గురించి పిల్లలకి వివరించే తల్లిదండ్రులేరి? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల కెళితేగానీ గడవని ఈ పరుగుల జీవితాల్లో, అమ్మానాన్నల ఒక్క సెకను సమయాన్ని పిల్లలు కొనాలంటే.. లీటరు పెట్రోలు ధరకంటే ఎక్కువయ్యే రోజులివి. వీకెండ్స్ లో ఇంట్లో అమ్మానాన్నలు తారసపడినపుడు ‘ఎలా చదువుతున్నావు? మార్కులెన్ని? ఎందుకు తగ్గాయి’ వంటి ఎంక్వయిరీలతోనే గడిచిపోతోంది. మంచిచెడులు చెప్పే పెద్దవాళ్లని ఉండనివ్వడానికి తగిన వైశాల్యం ఇంట్లో ఉన్నా కుచించుకుపోయిన వాళ్లు కన్నపిల్లని హృదయం వైశాల్యంలో ఇమడలేక పెద్దవాళ్లు వృద్ధాశ్రయాలను ఆశ్రయిస్తున్నారు. వార్ధక్యానికి, బాల్యానికి మధ్య ఉండే అనుబంధానికి మనమే అడ్డుగోడలు ఏర్పరచుకుంటున్నాం. దీనికి కారణం కాలానికి తగ్గ మార్పులని సరిపెట్టుకుంటూనో, లేక జనరేషన్ గ్యాప్ పేరుతో తల్లిదండ్రుల్ని వదిలించుకుంటే సరిపోదు. ఎందుకంటే ఇవ్వాళ మంచిచెడులకు తేడా చెప్పే తీరిక మీకు లేదు. చెప్పినా వినే ఓపిక వాళ్లకి లేదు. మంచికి చెడుకి మధ్యస్తంగా విచక్షణ కోల్పోయి అకృత్యాలకి పాల్పడుతోంది మీబిడ్డలే. కాబట్టి ఇంటి యజమానిగా సంయమనం పాటించి పాతతరాన్ని గౌరవిస్తే, ఆ తరం ఇంకొన్నాళ్లు బ్రతికి ఉంటుంది. వాళ్ల జీవితానుభవసారం మన వారసులు వినగల్గుతారు. అలా వింటే చాలు వాళ్లలో విలువలు మొలకలేస్తాయి. మరో తరానికి అవి బోధివృక్షాలవుతాయి. 

అందువల్ల పాతతరానికి చెప్పే అవకాశం, కొత్త తరానికి వినే అవకాశం కల్పించాల్సిన వారిధి మీరే. చదువుల పేరిట పిల్లల్ని ఇంట్లో పెద్దలకి దూరం చెయ్యకండి. పాతతరానికి కొత్త తరానికి మధ్య అడ్డుతెర కట్టకండి. ఎందుకంటే రాబోయేతరం కాసో కూస్తో పాత విలువల్నీ, వికాసాన్ని నేర్చుకోగలిగేది, గ్రహించగల్గేది మీ తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే! వాళ్లు బ్రతికుండే ఆ కొద్దిసమయాన్ని చేజారనీయకుండా సద్విని యోగం చేసుకోండి. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులు గోడలమీద ఫొటోలుగా వేలాడకముందే, మీరే వారధిలా మారండి. ఆ తరం అందించే అనుభవాల జావళీలను వారిదగ్గర నేర్చుకుని హాయిగా మీ పిల్లల్ని పాడుకోనివ్వండి. అవన్నీ భవిష్యత్తులో తప్పటడుగులు వెయ్యకుండా వాళ్లలో సహజసామర్థ్యాన్ని వృద్ధిచేస్తాయి. పిల్లల ఎదురుగా మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించకపోవడమే మనం చేసే తప్పని తెలుసుకోవాలి. మన పిల్లల దృష్టిలో మన తల్లిదండ్రులు పాతచింతకాయ పచ్చడి లాంటివారు కావచ్చు. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి తరానికీ, ఇవ్వాల్టి పిజ్జా బర్గర్ల తరానికీ మధ్య మనం ఇడ్లీ సాంబారులా.. వారధిలా ఉండాలి. పాతతరం కనుమరుగవ్వకముందే, వాళ్ల అనుభవాల్ని అనుభూతుల్ని రాబోయే తరానికి వాళ్ల ద్వారానే పంచి పెట్టాలి. అప్పుడే ఒకనాటి ఉమ్మడి కుటుంబపు మధురిమలు..’తోబుట్టువుల మంచిచెడ్డలు, వేపపుల్లతో దంతధావనాలు, మున్నిపిండితో ఇంటినలుగులు, కుంకుడుమురగ తలంట్లు, తెలుగు నెలలు, తిధివార నక్షత్రాలు, నిస్వార్థపూరితమైన పాతతరం అప్యాయతల్ని మన పిల్లలు కనీసం తెలుసుకోగల్గుతారు. 

తొలికోడి కూతలు, వేగుచుక్క వెంట నాగలి కవలికలు, ప్రభాతాన ముఖం కడుక్కునే బోడుల సవ్యధులు, పంటపొలాల కమ్ముని వాసనలు, ఆకుమాడుల కేరింతలు. మబ్బులు కురిసే చినుకుపుష్పాలను దోసిలి పట్టిన మనుషు(సు)ల ఆప్యాయతానుబంధాలు మానవసంబంధాలు తమరేంటి?: నేటితరం క్రమంగా దూరంగా జరిగిపోతూ, చెరిపేస్తున్న విలువ, వెలకట్టలేని తిరిగిరాని ఆణిముత్యాలు. మానవ సంబంధాలన్నిటి లోకెల్లా కుటుంబబంధాలు అనుబంధాలే మనిషి జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కుటుంబం అనుబంధాలకు దేవాలయం. కుటుంబంలో ఉండే సంబంధబాంధవ్యాల వల్లనే సమాజంలో మనిషిస్థాయి, స్థానం నిర్దేశించబడుతుంది. అందుకే ఇంటగెలిచి- రచ్చగెలవమంటారు. ఒక అబ్బాయికీ, అమ్మాయికీ జన్మనిచ్చారంటే జీవితకాలబంధాలకు మీరు అంకురార్పణ చేసినట్టే. అంటే తల్లిదండ్రులుగా ఆపాత్రలు జీవితాంతం పోషించాల్సిందే. మీ పెంపకం ప్రభావం మీ పిల్లలమీద, వాళ్ల పిల్లల మీద, ఇంకా చెప్పాలంటే తరతరాల సంబంధ బాంధవ్యాలమీద ఉంటుంది. తరాల అంతరాలు క్షణక్షణానికి మారిపోతున్న సాంకేతిక అభివృద్ధితోబాటు, ఈ తరపు పిల్లల్లో ‘ఐ.క్యూ’ కూడా ఎక్కువే. మనుషుల మధ్య ఉండాల్సిన మానవసంబంధాలు సాంఘిక మాధ్యమాల మాటల్లో ఇరుక్కుపోతున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులకీ పిల్లలకీ మధ్య తరాల అంతరాలు, క్షణక్షణానికి మారిపోతున్న సాంకేతిక అభివృద్ధితో పాటు, ఈ తరపు పిల్లలలో ‘ఐ.క్యూ’ కూడా ఎక్కువే. మనుషుల మధ్య ఉండాల్సిన మానవ సంబంధాలు సాంఘిక మాధ్యమాల మాటల్లో ఇరుక్కుపోతున్నాయి. 

ఈ క్రమంలో తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య దూరం పెరిగిపోతోంది. ‘పలుకే బంగారమాయెనా’ అన్నట్టుంటోంది. కుటుంబ సభ్యులు మనసులు విప్పి మాట్లాడుకునే పరిస్థితి కనుమరుగవుతోంది. అవసరాల తడిపొడి పలకరింపులే కన్పిస్తున్నాయి. దీని వల్లనే మానవ సంబంధాలు మనకబారుతున్నాయి. తల్లిదండ్రులూ  వన్ మినిటి ఇవ్వాళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. మేం కష్టపడి చదివించాం. మీరు మమ్మల్ని చూడాల్సిందే..! అనే ధోరణి మధ్య తరగతి, కింది తరగతుల్లో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లల మీద ఖర్చు పెట్టిందానికి వది రెట్లు అధికంగా వసూలు చేస్తూ భోగలాలసత్వానికి అలవాటు పడుతున్నారు. 60ల్లోనూ 20ల్లా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుల్లో మీరు పెరిగిన వాతావరణం వేరు. అప్పటి విలువలు, కట్టుబాట్లు వేరు. తరాలు మారుతున్నాయి. మారుతున్న ధోరణితో పాటు మీరూ మారాలి. “ఆ కాలంలో మేం ఎంతో కష్టపడి పైకొచ్చాం. ఇప్పుడు మీరు కష్టపడకూడదని మీకు అన్ని సమకూర్చాం, ఇన్ని సమకూర్చాం.. ఇంత చేస్తున్నాం” అని క్లాసులు పీకే కాలం చెల్లిపోయింది. దీని వలన పిల్లలు ఇంటికి రావాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతోంది. “ఈ మధ్య విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకి డెలివరీల కోసం తల్లిదండ్రుల్ని రప్పించుకోవడం పరిపాటి అయిపోయింది.. అలాగే అకస్మాత్తుగా తల్లి తండ్రో మరణించినా. దూర దేశాల్నించి పిల్లలు రాలేని పరిస్థితుల్లో, వాట్సాప్, వీడియోల ద్వారా తల్లిదండ్రుల ఆఖరి చూపులు, కర్మకాండలు, తిలకిస్తున్న సందర్భాలు సర్వసాధారణమైపోయాయి. కడుపు తడిమి అన్నం పెట్టినంత మాత్రాన అమ్మ బాధ్యత, ఫీజులు కట్టి చదివించినంత మాత్రాన నాన్న బాధ్యత తీరిపోదు. 

బాల్యంలో వేలు పట్టి నడక నేర్పినట్టే, యవ్వనంలో కూడా పిల్లలు పక్కదార్లు పట్టకుండా, జీవితంలో సెటిలయ్యేవరకూ ‘విలువైన నడత నేర్పాల్సింది తల్లిదండ్రులే. అప్పుడే మన అనుబంధం వారిని వెన్నంటి ఉంటుంది. మనం మన పిల్లల్ని ఎంత గౌరవంగా, ప్రేమగా చూస్తే, వార్థక్యంలో వాళ్లు అంతకు రెట్టింపు ఆప్యాయతతో కంటికి రెప్పలా మనల్ని చూస్తారన్నది నిర్వివాదాంశం. యథా పేరెంట్స్.. తథా చిల్డ్రన్. పిల్లలూ గుర్తించాలి. పిల్లలకి పదేళ్ల వరకూ తల్లిండ్రుల అండదండలు అవసరం. పెరిగేకొద్దీ పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. ఈ రోజుల్లో రెండు, మూడేళ్ల పిల్లలే స్మార్ట్ ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు. ప్రాయం రాకముందే సహజ ఆకర్షణలు అంకురించకముందే అసహజాలు టెక్నాలజీ రూపంలో ఆజ్యం పోస్తూ- ప్రేమలు, హత్యలు, పన్నెండేళ్లకే గర్భధారణలు ఇంకా.. డ్రగ్స్, మద్యం ఒకటేమిటి.. పిల్లల్ని భ్రష్టు పట్టించే అంశాలన్నీ మన చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి.. ఒక లీటర్ పెట్రోలు మీద ఒక రూపాయి పెరిగితే, ఆ భారం మోస్తున్నది మీ తల్లిదండ్రులే అన్నది గుర్తించండి. వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకోండి. “నాస్తి మాతృ నమః స / నాస్తి పితృ సమో గురుః” అన్నారు. అంటే తల్లితో సమానమైన స్నేహితులు, తండ్రితో సమానమైన గురువు ఉండరు. తాము అనుకున్నది జరగకపోతే తల్లిదండ్రులతో సంబంధాలు తెంచుకున్న పిల్లల్నీ, తమ మాట వినలేదని పిల్లల్ని హత్యలు చేసే తల్లిదండ్రుల్నీ చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం.. ప్రేమరాహిత్యమే. బంధాలన్నీ సరైన సమయంలో

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:




Cultural Roots Digital Detox Emotional Well-being Family Connection Generational Wisdom human values Intergenerational Bonding Mindful Parenting Relationship Building Slow Living

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.