📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Domestic Helper: పెళ్ళాం ప్యాకెట్ మనీ

Author Icon By Madhavi
Updated: July 18, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Domestic Helper: “ఆయుష్షు పెంచుకోవడం ఎలా?” అనే పుస్తకాన్ని పడీ పడి చదువుతున్నాడు సత్రవాడ సురేష్, గడియారం గంట టంగ్ టంగ్మని ఆరు సార్లు కొట్టడంతో వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకుని వచ్చింది జితవతి, మొగుణ్ణి చూసి “ఈ మగ మహారాజుల అదృష్టమే అదృష్టం కదా! ఆడవాళ్లకు రిటైర్మెంట్ అనేదే లేదు. బక్కెట్ తన్నెంతదాకా పరుగులే పరుగులు” అని అసూయపడింది. అయినా అసూయపడి చేసేదేమీ లేదని గ్రహించి కాఫీ కప్పు మొగుడికి ఇచ్చింది.

ఇంటి బయట ముగ్గు లేకపోవడం చూసి “పనిమనిషి సత్యరేఖ ఇంకా రాలేదా అండీ?” అని అడిగింది. పట్టుమని పది వెంట్రుకలే ఉన్న బట్టతలని తడుముకుంటూ “లేదు” అని గంభీరంగా చెప్పాడు. ముప్పై ఏళ్ళు బ్యాంకులో గుమాస్తాగిరి ఉద్యోగం వెలగబెట్టి ఆరు నెలల ముందే రిటైర్ అయ్యాడు సురేష్,

పిల్లలిద్దరూ పూనాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు.
సమయం ఏడు గంటలయ్యింది. ఇంట్లోంచి రుసరుసలాడుతూ వచ్చి జితవతి “ఏమయ్యిందండీ ఈ సత్యరేఖకు. సమయం ఏడు గంటలైనా ఇంకా రాలేదు?” అంది. “ఏమో జితవతీ! నాకు తెలియదు” మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. మళ్ళీ గంట తర్వాత ఏడుపు ముఖంతో భర్త దగ్గరికి వచ్చి “ఏమయ్యిందోనండీ సత్యరేఖకు? ఈ మూడేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టింది లేదు” అని భాధగా చెప్పింది. పనిమనిషి గురించి భార్య అంతలా బాధపడటం చూసి ఆశ్చర్యపోయాడు సురేష్, “వేరే ఏవైనా పనులుండి కొంచెం ఆలస్యంగా వస్తుందేమో చూద్దాం” అని ధైర్యం చెప్పాడు. కాలుతున్న కొవ్వొత్తి నుంచి కరిగిపోతున్న మైనంలా బాధగా ఇంట్లోకి వెళ్ళింది. ఇన్స్టాగ్రాం చూస్తూ కాలం మరిచిపోయాడు సురేష్. గడియారం చూసుకుంటే పది గంటలయ్యింది. గబగబా ఇంట్లోకి వెళ్లాడు.

సహాయం చేసి మోసపోయిన జితవతి కథ

మంచం మీద సత్యభామలాగా పడుకుని ఉంది జితవతి. ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కిన కళ్లతో మొగుణ్ణి చూస్తూ “ఉందో ఊరు వదిలేసి పోయిందోనండీ” అంది.
“మన ఇంట్లో పనిచేస్తున్నంత మాత్రాన వాళ్లతో అంత అభిమానం పెంచుకోకూడదే” అని ధైర్యం చెప్పాడు. “ఏమోనండీ! నా మనసు మనసులో లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి చూసి వద్దామండీ” అని అంది. సురేష్ స్కూటర్ స్టార్ట్ చేశాడు.

అబ్బన్న కాలనీలో ఉండే సత్యరేఖ ఇంటికి చేరారు. సున్నం కొట్టిస్తున్న ఇంటి యజమాని కనిపించాడు. “సత్యరేఖ ఇల్లు ఇదే కదా” అని అడిగింది జితపతి, “అవునమ్మా, కానీ వాళ్లు నిన్ననే ఖాళీ చేసి వెళ్ళారు. ఎక్కడికి మారారో తెలియదు” అని బదులిచ్చాడు. “మరి ఆమె రెండు నెలల ముందు కొన్న కొత్త స్కూటర్” అని అడిగింది జితవతి.
“స్కూటర్ గురించి ఎందుకు అడుగుతోందబ్బా? అని నోరు తెరిచాడు. సురేష్, “సామాన్లన్నీ బాదుగ వ్యానులో పెట్టుకున్నారు. వెనుకే స్కూటర్లో సర్రుమని వెళ్ళింది. సత్యరేఖ” అని బదులిచ్చి వెళ్ళిపోయాడు యజమాని, – “అయ్యో భగవంతుడా…. అని అక్కడే ఉన్న పిట్టగోడ మీద కూర్చుని గుండెలు పగిలేట్లు ఏడవసాగింది. “ఆ పనిమనిషి పోతే మనకు మరో పనిమనిషి దొరకదా జితవతీ! ఎందుకలా ఏడుస్తావు? అయినా ఆమె స్కూటర్ గురించి అడుగుతున్నావేమిటి?” అనా అన్నాడు. “అది నేను తీసిచ్చిన స్కూటర్ అండీ” అంది. “నువ్వు ఎందుకు తీసి ఇచ్చావు?”

అని ఆశ్చర్యంగా అడిగాడు సత్రవాడ సురేష్. “నేను పనిచేసే ఇల్లు ఇక్కడొకటి అక్కడొకటి ఉంది, తిరగాలంటే కష్టంగా ఉంది, స్కూటర్ తీసివ్వమని అడిగితే తీసిచ్చాను” అని పైట కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. “బండి ఖరీదు లక్ష దాకా ఉంది. నీకు అంత డబ్బు నీకెక్కడిది?” అని ప్రశ్నించాడు. “మొన్న మీరు రిటైర్ అయినప్పుడు నా ప్యాకెట్ మనీకని రెండు లక్షలు తీసుకున్నాను కదండి. మీ బ్యాంకులో అరవై పైసల వడ్డీనే కదా!

Domestic Helper: రెండు రూపాయల వడ్డీ ఇస్తానంటే ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చాను. దాంతో బండి తీసుకుంది. వడ్డీ కూడా ఠంచన్గా ఇచ్చేది” అని చెప్పింది. ఆవేశాన్ని అణుచుకుని “కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కువ వడ్డీకి ఆశపడి అసలుకే మోసం తెచ్చుకున్నావు కదా.

సరే.. జరిగిందేదో జరిగింది. ఇంటికి వెళ్లా పద” అని చెప్పి బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళాడు. వారం తర్వాత శుభ్రంగా కంచెపట్టు చీర కట్టి మిగిలిన లక్ష రూపాయలను తెచ్చి మొగుడి చేతికి ఇస్తూ “తక్కువ వడ్డీ అయినా మీ బ్యాంకులోనే వేద్దామండీ జరిగిందేదో జరిగింది. అనుభవం మనకు మిగిలింది” అని చెప్పింది. సురేష్ మెచ్చుకోలుగా చూశాడు భార్య వంక.
“అనుభవం అంటే జుట్టు అంతా రాలిపోయాక దొరికే దువ్వెన లాంటిది” అని మనసులొ అనుకుంటూ బ్యాంకు వైపు కదిలాడు సత్రవాడ సురేష్.

Read also: hindi.vaartha.com
Read also: Story: అడగలేకపోయా

#DomesticHelper #FinancialTrust domestic helper scam maid trust issue retirement savings Telugu short story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.