📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chandragiri Kingdom: చంద్రగిరి రాజ్యం

Author Icon By Hema
Updated: July 22, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chandragiri Kingdom:చంద్రగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఇంద్రవర్మరాజు. ఇంద్రవర్మకి నలుగురు కుమారులు. ఆ రాజ్యము ఆనవాయితీ ప్రకారం ఒక సంవత్సరానికి ఒక రాజు(king) మాత్రమే పాలన చేయాలి. ఆ రాజ్యం దగ్గరలోనే నల్లగొండ అనే పెద్ద కొండ ప్రాంతం ఉంది. ఆ రాజ్యంలో ఏ రాజు అయినా ఒక సంవత్సరం రాజ్యపాలన చేశాక ఆ రాజు నల్లకొండ మీదికి వెళ్లిపోవాలి. అదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది.

ఈ సంవత్సరం రాజు అయిన ఇంద్రవర్మ వెళ్లే సమయం వచ్చింది. ప్రతి రాజు నల్లగొండ మీదకి వెళ్లడం మరలా తిరిగి రాకపోవడం, ప్రజలకి, రాజులకి ఎవరికి అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. రాజుగారు ఇంద్రవర్మ కొడుకులు నలుగురు ఒక ఉపాయం ఆలోచించారు. తన తండ్రి అయిన ఇంద్రవర్మరాజు నల్లకొండకి వెళ్లే సమయం(time) వచ్చింది. కాబట్టి ఆ నలుగురు తండ్రికి తెలియకుండా ఆ ముందురోజు నల్లకొండకి చేరుకున్నారు.

ఆ కొండపైన ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అది చూసి ఆ నలుగురు కుమారులు ఆశ్చర్యపోయారు. ఆ రాక్షకుడు కొండ మీదకి ఎవరు వచ్చినా వాళ్లని తినేస్తుంటాడు. ఆ రాజకుమారులు ఆ కొండప్రాంతమంతా చూశారు. అక్కడ అంతా కళేబరాలు, ఎముకలు ఉన్నాయి. అది చూసి ఆ నలుగురు ఇలా అనుకున్నారు. ఈ రాజ్యాన్ని రాజులని, ప్రజలని ఈ రాక్షకుడి బారి నుండి కాపాడుకోవాలి. లేకపోతే రేపు మనం కూడా ఈ రాక్షకుడికి ఆహారం అయిపోతాం.

ఆ నలుగురు రాజకుమారులు ఒక్కసారి రాక్షసుడి చుట్టు ముట్టి రాక్షసుడిపైన బాణాల వర్షం కురిపించారు. వారి బాణాలధాటికి రాక్షసుడు మరణించాడు. అప్పుడే అటుగా కొంతమంది కొండజాతి ప్రజలు రాజకుమారులను చూశారు. ఆ మృగంలాంటి రాక్షసుడిని చంపినందుకు అభినందించారు.

ఆకథ నలుగురి రాజకుమారులను కొండజాతి ప్రజలు ఊరేగించి రాజు అయిన ఇంద్రవర్మ దగ్గరకు తెచ్చారు. కొండజాతి ప్రజల మాటల ద్వారా రాజు అంతా తెలుసుకున్నారు. తన కుమారులను అభినందించారు.

గిరి రాజ్యం
“ఓ కుమారుల్లారా! మీ ఆలోచన కు ఆచరణ తోడైంది. కాబట్టి ఈ మార్పు సాధ్యం అయింది. ఏ రాజు అన్నది ముఖ్యం కాదు, అతడు ఏపాటి వాడు అన్నది ముఖ్యం. ఓ కుమారుల్లారా! నేను మిమ్మల్ని చూసి గర్వపడతున్నాను, మీలాంటి యువకులే ఈ రాజ్యానికి అవసరం” అని ఇంద్రవర్మ తన పెద్ద కుమారుడిని రాజుని చేస్తాడు.

మిగతా ముగ్గురు కుమారులని సహాయులుగా ఉండమంటారు. దానికి ఆ నలుగురు కుమారులు అంగీకరిస్తారు. “కుమారులారా! మీరు రాక్షసుడిపై చేసే పోరాటం నన్ను ప్రజలను రక్షించే గుణం నాకు బాగా నచ్చాయి. రాజు అంటే రక్షించేవాడు” అని తండ్రి ఇంద్రవర్మ అభినందించారు.

ఇంద్రవర్మ కుమారుడు యువరాజు, ముగ్గురు తమ్ముళ్లను సహాయంతో రాజ్యపాలన నిస్వార్థబుద్ధితో చేస్తున్నారు. మరలా తండ్రి రాజకుమారులకు ఇలా బోధించారు:
“శరీర బలంతోపాటు బుద్ధిబలం ప్రతి రాజుకి ఉండాలి. యువరాజా! గొప్ప కథలలో నువ్వు లేకపోయినా, నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో. రాజ్యపాలన చేసుకో” అని హితం చెప్పారు.

అప్పటి నుండి ఆ నలుగురు కుమారులు చంద్రగిరి రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నారు. చంద్రగిరి రాజ్యాన్ని సుజలాం, సుఫలాం, మలయతసీతారం, సస్య శ్యామలంగా రాజ్యాన్ని అభివృద్ధి చేశారు. ప్రజలంతా రాజకుమారులను చూసి జేజేలు పలికారు. ప్రజల ఆనందాన్ని చూసి ఇంద్రవర్మ తన నలుగురు కుమారులను అభినందించారు.

Read also:hindi.vaartha.com

Read also: The Crow’s Evil Plan:కాకి దురాలోచన

bravery tales Chandragiri story Indian kings prince stories telugu moral stories

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.