Black Hen White Hen:ఒక ఊరిలో ఒక నల్లకోడి, తెల్లకోడి వుండేవి. అవి పక్క పక్కనే గుడ్లను పొదిగాయి. ఒకసారి అనుకోకుండా నల్లకోడి పొదిగిన గుడ్డు తెల్లకోడి దగ్గరికి దొర్లుకుంటూ వెళ్ళింది. ఒక గుడ్డు కలిసొచ్చిందనే పేరాశతో రెక్కల కిందికి తోపుకుంది తెల్లకోడి.
కొద్ది రోజులకు రెండు కోళ్ళు ఒకేసారి పిల్లల్ని లేపాయి. తెల్ల కోడి లేపిన పిల్లల్లో ఒకటి మాత్రమే నల్లగా వుంది. మిగతావన్ని తెల్లగా పుట్టాయి. గుడ్డు (egg) కలిసొచ్చిందని మొదట సంబరపడింది. కోడి పిల్ల నల్లగా పుట్టేసరికి అయిష్టత పెంచుకుంది.
తెల్ల కోడి – “ఇది నా బిడ్డ కాదు, నా పిల్లలు తెల్లగా (white) వున్నాయి” అని ఆ పిల్లను దగ్గరకు రానిచ్చేది కాదు. కోడి ముక్కుతో పొడిచి తరిమేసేది. “ఈ పిల్ల నీదే.. నాది కాదు.. నా పిల్లలు తెల్లగా వున్నాయి, ఇది కోడి పిల్లలా లేదు కాకి పిల్లలా వుంది” అంటూ ఎగతాళి చేస్తూ నల్లకోడిని అవమాన పరిచింది.
నల్ల కోడి చాలా బాధపడింది. కొన్ని రోజుల తరువాత తెల్లకోడి పిల్లలు అనారోగ్యంతో ఒక్కొక్కటీ చనిపోతూ వచ్చాయి. చివరికి తెల్లకోడి ఒంటరిదైపోయింది. అనాథలా మిగిలిపోయింది.
నల్లకోడి దగ్గరికి వెళ్ళి “తను పొడిచి తరిమేసిన ఆ కోడి పిల్లను తనకు తిరిగి ఇవ్వమని” అడిగింది. చిన్నప్పటి నుంచి నల్లకోడి వద్దే పెరిగిన పిల్ల కాబట్టి తెల్లకోడి దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడలేదు. పైగా అది పొడుస్తుందని భయపడింది.
“ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఏదైనా పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలిసేది. గర్వంతో వద్దనుకున్నావు అన్నీ కోల్పోయాక నల్ల కోడిపిల్ల విలువ తెలిసొచ్చింది. నలుపు, తెలుపు అనే తేడా కాదు ముఖ్యం. మంచి గుణం వుంటే చాలు. అందం అన్నం పెట్టదు గుర్తించుకో.. ముందు నీ గుణం మార్చుకో!” అంటూ తెల్లకోడికి బుద్ధి చెప్పింది నల్లకోడి.
పశ్చాత్తాపంతో వెనుదిరిగింది తెల్లకోడి.
Read also:hindi.vaartha.com
Read also: