అమెరికా లో భాద్యతలు స్వీకరించిన కాశ్ ప‌టేల్‌.

అమెరికా లో భాద్యతలు స్వీకరించిన కాశ్ ప‌టేల్‌.

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.హిందూ పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి ప్రమాణం చేయించారు. పటేల్ ఎఫ్‌బీఐలో సమగ్రత, న్యాయాన్ని పునరుద్ధరించాలని, అమెరికాను మళ్ళీ సురక్షితంగా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్ శుక్రవారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ ) తొమ్మిదవ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణస్వీకరం సమయంలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. యుఎస్ సెనేట్ కాష్‌ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించిన తర్వాత యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి, పటేల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంభ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. క్రిస్టోఫర్ వ్రే స్థానంలో కాశ్ పటేల్‌ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే కాశ్ పటేల్‌ భగవద్గీతపై ప్రమాణం చేయడంతో ఆయనపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మీడియా సమావేశంలో కాశ్ పటేల్ మాట్లాడుతూ, ఎఫ్‌బీఐ లోపల, వెలుపల పూర్తి జవాబుదారీతనాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. ప్రజలకు, ప్రభుత్వ విధానాలకు అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

వెయ్యి మంది ఉద్యోగులకు బదిలీ

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాశ్ పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1,000 మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, అలబామా రాష్ట్రం హంట్స్‌విల్లేలోని బ్యూరోకు మరో 500 మంది ఉద్యోగులను పంపించనున్నట్లు తెలిపారు.

కాశ్ పటేల్ ప్రయాణం

భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాశ్ పటేల్ పూర్వీకులు ఉంగడా నుంచి కెనడాకు, అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి. యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు.

భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, తన ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులను అందిస్తున్నారు. ఆ క్రమంలోనే కాశ్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాశ్ పటేల్ గతంలో పెంటగాన్‌లో టాప్ రోల్‌లో పనిచేశారు. అలాగే, ట్రంప్ సన్నిహితుడిగా ఉంటూ జాతీయ భద్రతా వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

Related Posts
ప్రపంచంలోని అత్యంత పొడవైన మరియు  అత్యంత పొట్టిగా ఉన్న మహిళలు లండన్‌లో కలిశారు..
smallest tallest

2024 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ డే సందర్భంగా, ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళ రుమేసా గెల్గీ (7 అడుగులు 1.6 అంగుళాలు) మరియు అత్యంత చిన్న మహిళ Read more

పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత Read more

పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటన : 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు మరణం
pak train hijack

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు తెరపడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన రైలును పాకిస్థాన్ భద్రతా బలగాలు విజయవంతంగా తిరిగి Read more

బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం: కరెన్సీ నోట్లలో మార్పులు
bangladesh notes

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, దేశ వ్యవస్థాపక పితామహుడు ముజిబుర్ రహమాన్ చిత్రాలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించే ప్రణాళికను ప్రారంభించింది. కొత్త కరెన్సీ నోట్లలో రమణీయమైన మత Read more