हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Judge: ఢిల్లీ కోర్టులోనే మహిళా జడ్జిని బెదిరించిన నిందితుడు

Sharanya
Judge: ఢిల్లీ కోర్టులోనే మహిళా జడ్జిని బెదిరించిన నిందితుడు

దేశ రాజధాని ఢిల్లీలో న్యాయవ్యవస్థను గౌరవించని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. న్యాయస్థానాలను న్యాయం కోసం ఆశ్రయించే ప్రదేశాలుగా భావిస్తారు. కాని తాజాగా జరిగిన ఈ ఘటన, న్యాయమూర్తుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధించారని కోపంతో 63 ఏళ్ల వ్యక్తి కోర్టు లోనే మహిళా న్యాయమూర్తిపై దాడికి యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆ దోషిని అనుసరించిన లాయర్ కూడా న్యాయమూర్తిని హెచ్చరించడం మరింత కలకలం రేపుతోంది.

కోపోద్రిక్త దోషి – కోర్టులో హంగామా:

తనకు శిక్ష విధించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు కోర్టులోనే ఉద్రిక్తంగా ప్రవర్తించాడు. తన కోపాన్ని న్యాయమూర్తిపై ప్రదర్శించాడు. ఆమెపై గట్టిగా అరిచాడు, మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీకు నేనెవరో తెలుసా? బయటకు రా, ఎలాగో చూస్తాను, అంటూ బెదిరింపులకు దిగాడు. కోర్టు గదిలో ఉన్నవారు ఈ వ్యవహారాన్ని చూసి షాక్‌కి గురయ్యారు. ఒక దశలో దోషి తన చేతిలో ఉన్న వస్తువును న్యాయమూర్తి వైపు విసిరాడు. అదృష్టవశాత్తూ అది న్యాయమూర్తిని తాకలేదు. కానీ ఈ చర్య తనంతట తానే న్యాయ వ్యవస్థను అవమానించినట్లు కావడంతో దాన్ని తీవ్రంగా పరిగణించారు.

లాయర్ వ్యవహారం కూడా షాకింగ్:

ఢిల్లీకి చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ పాఠాశల ఉపాధ్యాయుడు ఓ చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీ కోర్టులో ఈయన కేసు విచారణ జరిగింది. ఈక్రమంలోనే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద నిందితుడిని దోషిగా తేల్చారు మహిళా న్యాయమూర్తి దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దోషి మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు గదిలో ఉండగానే నీ అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. నీవైతే బయటకు రా ప్రాణాలతో ఇంటికి ఎలా వెళ్తావో చూస్తానంటూ వ్యాఖ్యానించాడు. నిందితుడి తరఫున వాదించిన లాయర్ అతుల్ కుమార్ తన బాధ్యతను విస్మరించి, న్యాయమూర్తిపై అదే రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఆయన తీర్పును వ్యతిరేకిస్తూ, మీరు మా క్లయింట్‌ను విడుదల చేయకపోతే, మీ పదవి తగిన స్థాయిలో ఉండదు అనే విధంగా హెచ్చరించారు.

దీంతో మహిళా న్యాయమూర్తి శివంగి మాంంగ్లా దోషి సహా లాయర్ అతుల్ కుమార్‌పై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తానిన తెలిపారు. వారి వేధింపులు, హెచ్చరికలకు భయపడకుండా తాను తీర్పు ఇస్తానని మరోసారి ప్రస్తావించారు. ఇలా కేసును ఏప్రిల్ 5కి వాయిదా వేశారు. ఇక చివరి రోజు రాగానే లాయర్ అతుల్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మీరు మహిళా న్యాయమూర్తితో ప్రవర్తించిన తీరుకు క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కూడా సూచించారు. అలాగే అతడిపై క్రిమినల్ ధిక్కార చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో కూడా చెప్పాలని కోరారు. అలాగే దోషికి 22 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.6.65లక్షల జరిమానా విధించారు. ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా దోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ తేదీ వరకు శిక్షను నెలపాటు సస్పెండ్ చేశారు. ఈక్రమంలోనే అతడికి రూ.30,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.

Read also: Child trafficking : పిల్లల అక్రమ రవాణా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870