సౌత్ ఈస్ట్రన్ రైల్వే (SouthEasternRailway)లో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్న 54 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసే దశకు చేరింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి రేపే చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు
ఈ నియామకాలకు పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు. అలాగే జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించిన క్రీడాకారులు స్పోర్ట్స్(SouthEasternRailway) కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు సాధారణ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీబీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగ భద్రత, వేతనం, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. దరఖాస్తు విధానం, క్రీడల విభాగాల వివరాలు, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: