రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRBJobs) ఐసోలేటెడ్ కేటగిరీలో ఉన్న 312 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయి. అభ్యర్థులు జనవరి 29లోపు అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also: KVS Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో 987 పోస్టులు
అర్హతలు & అనుభవం
పోస్టును బట్టి అభ్యర్థులు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
- ఇంటర్మీడియట్ / డిగ్రీ
- LLB, MBA
- డిప్లొమా
- పీజీ (హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ)
కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరి.
ఎంపిక విధానం
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులను
- CBT స్టేజ్–1
- CBT స్టేజ్–2
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- మెడికల్ పరీక్ష
ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు RRBJobs అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ సమీపిస్తున్నందున ఆలస్యం చేయకుండా అప్లై చేయాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: