Telugu News: Railway Recruitment: నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Read Time:  1 min
Railway Recruitment
Railway Recruitment
FONT SIZE
GET APP

నార్తర్న్ రైల్వే (Railway Recruitment పరిధిలో 4,116 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి మరియు ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన వారు డిసెంబర్ 24 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

Read also: TG TET 2026: తెలంగాణ టెట్ షెడ్యూల్‌ విడుదల

 Railway Recruitment
Railway Recruitment

అర్హతలు, వయో పరిమితి

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాస్(Railway Recruitment) అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. గరిష్ఠ వయస్సు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు

సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు.
అయితే SC, ST, PwBD, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లింపు అవసరం లేదు. ఈ అప్రెంటిస్ పోస్టులకు లిఖిత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపిక టెన్త్ మరియు ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
www.rrcnr.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం Jobs కేటగిరీని సందర్శించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.