📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

R. D. Wilson Sarath Chandra: తెలుగు అకాడమీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

Author Icon By Rajitha
Updated: February 11, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: తెలుగు భాషను బోధించేందుకు వర్చువల్ అకాడమీ ఏర్పాటు చేయడానికి సహకరించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ శరత్ చంద్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను (Nara lokesh) కోరారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌తో అకాడమీ సంబంధిత అంశాలపై చర్చలు జరిపారు. సీఆర్‌డీఏ పరిధిలో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తే, అకాడమీ స్వంత నిధులతో భవనం నిర్మించుకుంటామని విల్సన్ తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానన్నారు. తెలుగు భాష వ్యాప్తి కోసం తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని విల్సన్ కోరారు. తమిళనాడులో వర్చువల్ అకాడమీ ద్వారా 45 దేశాల్లోని తమిళ ప్రజలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు, అలాగే కేంద్రీయ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి తమిళ భాషను బోధిస్తున్నట్టు తెలిపారు.

Read also: AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

Filling of vacant posts in Telugu Academy

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు బోధన చేపట్టవచ్చని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని లేఖ రాసినట్లు విల్సన్ తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొంటూ, తెలుగు వర్చువల్ అకాడమీ స్థాపనకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు. మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణను అకాడమీ ద్వారా చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని విల్సన్ అభ్యర్థించారు. దీని ద్వారా అకాడమీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మంత్రి ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు అకాడమీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని విల్సన్ కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh education department latest news public service commission telugu language Telugu News Virtual Academy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.