కేంద్ర తపాల మంత్రిత్వ(Postal Jobs) శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2026 సంవత్సరానికి గానూ మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియా పోస్టు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అందిన సమాచారం ప్రకారం, జనవరి నెలాఖరు లోపు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగనుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
Read Also: IIIT Kurnool: 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ
పదో తరగతి అర్హతతో ఉద్యోగ అవకాశం
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు(Postal Jobs) దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంబంధిత జిల్లా, మండలాల్లోనే ఉద్యోగాలు కేటాయించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాల కోసం ఇండియా పోస్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: