దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 2026–27 విద్యా సంవత్సరానికి అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS Jobs) ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది.
Read Also: ISRO SAC: 49 సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
పోస్టుల వివరాలు
ఈ నియామకాల్లో
- TGT (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) – 493 పోస్టులు
- ప్రైమరీ టీచర్ (PRT) – 494 పోస్టులు
భర్తీ చేయనున్నారు.
అర్హతలు ఇలా ఉంటాయి
పోస్టును బట్టి అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
- ఇంటర్మీడియట్ / డిగ్రీ
- డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్)
- B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్)
- CTET ఉత్తీర్ణత
స్పెషల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి, ఫీజు వివరాలు అన్నీ KVS Jobs అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
అభ్యర్థులు తాజా అప్‌డేట్స్ కోసం క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: