నిరుద్యోగ యువతకు శుభవార్త. అపోలో ఫార్మసీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో సహకారంతో జనవరి 28, 2026న(JobFair2026) హైదరాబాద్‌లో జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా ద్వారా ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.
Read Also: Karimnagar: శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా
ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగుతుంది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
అర్హతలు, వేతన వివరాలు
ఈ ఉద్యోగాలకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన(JobFair2026) అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం అందించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జనవరి 28న నేరుగా జాబ్ మేళాకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాల కోసం అపోలో ఫార్మసీ హెచ్‌ఆర్ ప్రతినిధి టీ. రఘుపతిని (ఫోన్: 8247656356) సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: