2026 సంవత్సరంలో ఉద్యోగ నియామకాలు(Job Market) మరింత వేగం పుంజుకోనున్నాయని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని అంచనా వేస్తోంది. ఉద్యోగ మార్కెట్‌లో(Job Market) ఈ స్థాయి వృద్ధి యువతకు శుభవార్తగా మారింది.
Read Also: BEML Recruitment: BEMLలో 50 ఉద్యోగాల భర్తీ
టెక్, AI రంగాల్లో భారీ నియామకాలు
టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి ప్రముఖ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి. డిజిటలైజేషన్, ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యాలున్న అభ్యర్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
అంతేకాకుండా సంస్థలు నియామకాల్లో వైవిధ్యత (డైవర్సిటీ) పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మహిళలు, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈసారి నియామకాలలో ప్రధాన ఆకర్షణగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: