📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP Group 1 Results: నేడు గ్రూప్-1 ఫలితాలు విడుదల?

Author Icon By Sudheer
Updated: January 30, 2026 • 8:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. న్యాయపరమైన చిక్కులన్నీ దాదాపు తొలగిపోవడంతో, గ్రూప్-1 తుది ఫలితాలను నేడు (జనవరి 30, 2026) విడుదల చేసేందుకు కమిషన్ రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయి పోస్టులైన గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది. గత బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో, ఫలితాల విడుదలకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. క్రీడా కోటా (Sports Quota) మరియు రిజర్వేషన్ రోస్టర్‌కు సంబంధించి కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలను ప్రకటించవచ్చని స్పష్టం చేయడంతో ఏపీపీఎస్సీ అధికారులు తుది కసరత్తు పూర్తి చేశారు. హైకోర్టు తీర్పు ప్రతి గురువారం చేరడంతో, నేడు ఫలితాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నేతలను డిస్టర్బ్ చేసేందుకే ఈ కుట్రలు

ఈ నోటిఫికేషన్ ప్రయాణం సుమారు రెండు ఏళ్లుగా సాగుతోంది. డిసెంబర్ 2023లో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వగా, మార్చి 2024లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అనంతరం అనేక వాయిదాల తర్వాత మే 2025లో మెయిన్స్ పరీక్షలు, జూన్ 2025లో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే రిజర్వేషన్లు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల కోర్టులో కేసులు దాఖలవ్వడంతో తుది ఎంపిక జాబితా ఆగిపోయింది. తాజాగా న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో మెరిట్ జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

గ్రూప్-1 ఫలితాల విడుదలపైనే గ్రూప్-2 ఫలితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఒకే అభ్యర్థి రెండు కేటగిరీల్లోనూ ఎంపికయ్యే అవకాశం ఉన్నందున, ముందుగా గ్రూప్-1 ఫలితాలిచ్చి, ఆ తర్వాతే గ్రూప్-2 తుది జాబితా ఇస్తామని కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. జనవరి 29న గ్రూప్-2కు సంబంధించి కొన్ని కీలక అప్‌డేట్స్ ఇచ్చిన నేపథ్యంలో, నేడు గ్రూప్-1 రిజల్ట్స్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని కీలకమైన రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉన్నత స్థాయి పోస్టులు భర్తీ కానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

ap group 1 ap group 1 results Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.