భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML Recruitment), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా పేరుగాంచిన సంస్థ, వివిధ విభాగాల్లో 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఉండగా, అర్హులైన అభ్యర్థులు జనవరి 7 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వీలుంది.
Read Also: Pilot Recruitment: ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు
ఈ నియామకాల్లో ఇంజినీరింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, లీగల్, హ్యూమన్ రిసోర్స్ తదితర విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అభ్యర్థులు BE, B.Tech, డిప్లొమా, CA, ICWA, MBA, ME, M.Tech, MSW, MA, PhD (హిందీ), LLB వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా అసెస్‌మెంట్ టెస్ట్ లేదా రాత పరీక్ష నిర్వహించనున్నారు. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఇతర ప్రయోజనాలు కల్పించనున్నారు. దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు పరిమితి తదితర సమాచారం కోసం అభ్యర్థులు BEML Recruitment అధికారిక వెబ్‌సైట్ను తప్పనిసరిగా పరిశీలించాలని సంస్థ సూచించింది. అధికారిక వెబ్‌సైట్: www.bemlindia.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: