భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 119 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్ (Engineering) విభాగాల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో ట్రైనీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత రంగంలో బీఈ/బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. (BEL) దరఖాస్తు ప్రక్రియ జనవరి 9తో ముగియనుంది. ఎంపిక ప్రక్రియ షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. పూర్తి వివరాలకు bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read also: TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం అయింది
- చివరి తేదీ: జనవరి 9, 2026
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్: bel-india.in
ఎంపికా ప్రక్రియ
భర్తీ ప్రక్రియ షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
ముఖ్య సూచనలు:
- అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలను పూర్తిగా పరిశీలించాలి
- దరఖాస్తులో తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు సమర్పించాలి
- ప్రామాణిక డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి
- ఎలాంటి ఫీజు ఉంటే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలి
బీఈఎల్‌లో ట్రైనీగా చేరిన అభ్యర్ధులు కంపెనీలో సాంకేతిక, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వంటి విభాగాల్లో వృత్తిపరమైన అనుభవాన్ని పొందవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: