దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్(Bank Jobs) అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా 418 ఐటీ విభాగపు పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి BE / BTech, ME / MTech లేదా MCA ఉత్తీర్ణులై ఉండడంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
Read Also: Govt Jobs: ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!
వయో పరిమితి & రిజర్వేషన్ సడలింపులు
దరఖాస్తుదారుల వయస్సు కనీసం 22 ఏళ్లు, గరిష్ఠంగా 37 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ(Bank Jobs) నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ & దరఖాస్తు విధానం
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరగనుంది. పోస్టును బట్టి ఎంపిక విధానంలో మార్పులు ఉండవచ్చని బ్యాంక్ పేర్కొంది. అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. bankofbaroda.bank.in
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: