స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, అలాగే మెడికల్, ఇంజినీరింగ్, సీఏ అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 18.
Read Also:Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాష్ట్రాల వారీగా ఖాళీలు, వయస్సు అర్హత
ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 98 పోస్టులు, తెలంగాణకు 80 పోస్టులు కేటాయించారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం, ఫీజు వివరాలు
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ దశల ద్వారా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు. అయితే SC/ST/PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: