📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RRB Group D Recruitment: 22,195 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్..

Author Icon By Tejaswini Y
Updated: February 4, 2026 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RRB Group D Recruitment: భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డీ (Level-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Read Also:Job Notifications 2026: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

RRB Group D Recruitment

ముఖ్యమైన తేదీలు:

అర్హత మరియు వయోపరిమితి

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత లేదా ఐటీఐ (ITI) లేదా తత్సమాన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
  2. శారీరక సామర్థ్య పరీక్ష (PET): రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి శారీరక పరీక్షలు నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన.
  4. మెడికల్ ఎగ్జామినేషన్: రైల్వే మెడికల్ ప్రమాణాల ప్రకారం వైద్య పరీక్షలు.

దరఖాస్తు రుసుము:

రూ. 500 (రాత పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ చేయబడుతుంది). ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు (PwBD), ఎక్స్-సర్వీస్‌మెన్ రూ. 250 (రాత పరీక్షకు హాజరైన తర్వాత మొత్తం రీఫండ్ చేయబడుతుంది).

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లేదా rrbcdg.gov.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

22195 Vacancies Indian Railways recruitment Level 1 Posts Railway Jobs RRB Group D Recruitment RRB Group D Recruitment 2026 rrbapply.gov.in Telugu Job News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.