RRB Group D Recruitment: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2026 సంవత్సరానికి గాను Group D విభాగంలో 22,000 ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు CEN 09/2025 నోటిఫికేషన్ ఆధారంగా జరుగనున్నాయి.
మొత్తం పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ డి కింద వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య సుమారు 22,000 (టెంటేటివ్) గా ప్రకటించారు.
Read also: Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
పోస్టుల వారీగా ఖాళీలు
- Assistant (Track Machine) – 600
- Assistant (Bridge) – 600
- Track Maintainer (Group IV) – 11,000
- Assistant (P-Way) – 300
- Assistant (TRD) – 800
- Assistant Loco Shed (Electrical) – 200
- Assistant Operations (Electrical) – 500
- Assistant (TL & AC) – 50
- Assistant (C & W) – 1,000
- Pointsman B – 5,000
- Assistant (S & T) – 1,500
మొత్తం పోస్టులు: 22,000
అర్హతలు (Eligibility Criteria)
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు
- 10వ తరగతి ఉత్తీర్ణులు లేదా ITI పూర్తి చేసి ఉండాలి
వయోపరిమితి (Age Limit)
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 33 సంవత్సరాలు
- వయో సడలింపు: ప్రభుత్వ నియమావళి ప్రకారం వర్తిస్తుంది
(వయస్సు గణన తేదీ: 01-01-2026)
జీతం (Salary)
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000/- (7వ వేతన సంఘం ప్రకారం) చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్లైన
- rrbchennai.gov.in
- indianrailways.gov.in
వీటిని ఉపయోగించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- షార్ట్ నోటిఫికేషన్ విడుదల: 23-12-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20-01-2026
- దరఖాస్తు ముగింపు తేదీ: 02-03-2026
అప్లికేషన్ ఫీజు
ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజు వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశల ద్వారా జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: