Railway Jobs 2026: భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అధికారికంగా ఆమోదం లభించింది. ఈ భారీ నియామక ప్రక్రియలో భాగంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో 674 పోస్టులను కేటాయించారు. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Read Also: HLL Lifecare Recruitment: లైఫ్‌కేర్‌లో 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ముఖ్య వివరాలు:
- అర్హత: పదవ తరగతి (10th) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ITI) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది).
- ఎంపిక విధానం: 1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) 2. ఆప్టిట్యూడ్ టెస్ట్ 3. పత్రాల పరిశీలన (Document Verification) 4. మెడికల్ ఎగ్జామినేషన్
అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in ను సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: