నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఢిల్లీ కేంద్రం నుంచి నిరుద్యోగులకు తీపి కబురు అందింది. మల్టీమీడియా మరియు గ్రాఫిక్ డిజైనింగ్ విభాగాల్లో జూనియర్ రిసోర్స్ పర్సన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. జూనియర్ రిసోర్స్ పర్సన్ (Multimedia). ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 నుండి రూ. 38,000 వరకు గౌరవ వేతనం లభిస్తుంది.
Read Also:Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అర్హతలు:
మల్టీమీడియా లేదా గ్రాఫిక్ డిజైనింగ్(Graphic Designing)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 3 నెలల మల్టీమీడియా సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification) ఆధారంగా ఎంపిక చేస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫిబ్రవరి 03, 2026. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు. NIELIT ఢిల్లీ కేంద్రం, జనక్‌పురి క్యాంపస్, న్యూఢిల్లీ.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ రోజున నిండిన దరఖాస్తు ఫారమ్, ఒరిజినల్ సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు ఐడి ప్రూఫ్‌లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. దీని కోసం రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ కోసం అభ్యర్థులు www.nielit.gov.in/delhi/recruitments వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: