HLL Lifecare Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ అయిన HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
Read Also:BECIL Recruitment 2026: సూపర్వైజర్ పోస్టులకు నేడే చివరి రోజు!
ముఖ్య సమాచారం:
- మొత్తం ఖాళీలు: 40
- దరఖాస్తు గడువు: నేటి నుంచి మార్చి 10 వరకు.
- జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు వేతనం అందుతుంది.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి అభ్యర్థులు ఈ క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
- BE/BTech, బీఫార్మసీ
- MBA, MSW, PGDBM
- MIB, MPIB, PGDPM
- MA, MHRM, BSc ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను వివిధ దశల్లో వడపోత చేసి ఎంపిక చేస్తారు:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- పర్సనల్ ఇంటర్వ్యూ
- సైకోమెట్రిక్ అసెస్‌మెంట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- ఫైనల్ ఇంటర్వ్యూ.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.lifecarehll.com సందర్శించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: